చేసిన మంచిని మరవని తత్త్వం నీది మంచినీ, చెడు కూడా మరవలేని మనస్తత్త్వం నాది నువ్వేమో… ఆకాశం, నేనేమో భూమండలం నువ్వు ప్రపంచాన్ని చుట్టేస్తే.. నేనేమో నిన్ను చుట్టేస్తా...
నేను లేకపోతే భూమండలమే లేదంటావు నువ్వు నేనంటూ ఉంటేనే కదా ఆకాశానికి చోటంటాను నేను ఎందులోనూ ఎవ్వరమూ తీసిపోయేది లేదు అన్నింట్లోనూ ఎవరికి వారే....... ఆలోచనలు, అభిరుచులు దాదాపు ఒక్కటే కానీ అభిప్రాయాల్లో మాత్రం ఆమడదూరం......
ప్రతిదాన్నీ లైట్‌గా తీసుకోమంటావు నువ్వు జీవితమే లైట్‌గా అవకూడదంటాను నేను కోరి కోరి కష్టాల్లో పడవద్దని నేను హెచ్చరిస్తే… ఏ పుట్టలో ఏముందో ఎవరికి తెలుసంటావు నువ్వు ఎవరైనా శాసిస్తే ఒప్పుకోనంటావు నువ్వు మంచి కోసం శాసించినా తప్పులేదంటాను నేను
బువ్వ తినమని బుజ్జగిస్తే… ఇద్దరం కలిసే తిందామన్నావు అంతే… వాదనలు, సమస్యలు, పరిష్కారాలు అన్నీ వేటిదారిన అవి టాటా చెప్పేశాయి...... :)
(మార్చి 31, 2009న నా మరో బ్లాగులో రాసినది.... అనివార్య కారణాల వల్ల ఆ బ్లాగును త్వరలో మూసేద్దామని అనుకుంటున్నాను... వాటిలోని పోస్టులను ఇలా ఈ బ్లాగుకు తరలించే ప్రయత్నమే ఇది... ఈ కవితను ఇంతకుముందే ఎవరైనా చదివివుంటే తిట్టుకోకండేం.....)