Pages

Saturday, 18 December 2010

మనిషికి విలువా?


ఆకాశంలో నల్లటి మేఘాల్లాగా
నా మదిలోనూ దిగులు మబ్బులు

అమ్మా..
ఈ లోకంలో పచ్చనోట్లకున్నంత
విలువ మనుషులకు లేదు కదూ..?
రాకెట్‌కంటే వేగంగా మావాడి ప్రశ్న
ఇందాకటి దిగులుకి కారణం ఇదే

మనుషులకూ విలువుందని
అబద్ధం చెప్పలేని నిస్సహాయత
మనిషి సృష్టించిన ఆ నోట్లు
నేడు ఆ మనిషినే ఆడిస్తున్నది నిజం

లేదు నాన్నా...
పచ్చనోటుకంటే మనుషులకే విలువెక్కువని
గొంతు పెగుల్చుకుని చెప్పబోతున్నానా...
ఆస్తి కోసం తల్లినే నరికిన తనయులు
అంటూ... విషయం విషాదమైనదైనా
ముఖంనిండా నవ్వులతో
న్యూస్ రీడర్ వార్తా పఠనం..

ఎక్కడో పాతాళంలోంచి
మనుషులకే విలువెక్కువ నాన్నా
అంటూ నా మనసు ఘోషించినా
పచ్చనోటుముందు
రక్త సంబంధాలు బలాదూర్
వార్తా కథనం పచ్చిగా చెప్పేసింది..

మనసు మూగగా రోదిస్తుంటే..
ఇందాకటి దిగులు మేఘాలు
కన్నీటి జల్లులై...
మనుషులకే విలువుండే రోజులు
తప్పక వస్తాయంటూ...
నన్ను ఊరడించాయి...
ఆరోజులు వస్తాయా...?!

8 comments:

Anonymous said...

మీ కవిత బాగుందండి.మనుషులకే విలువుండే రోజులు రావాలని ఆశిద్దాము

Shobharaju said...

అనూగారూ ధన్యవాదాలండీ..

srinivasarao said...

అవును... కరెన్సీకి తప్ప ఇక్కడ కారుణ్యానికి తావు లేదు...
మీరు ఇంకా మంచి డిఫరెంట్ అంశాల్ని డీల్ చేయగలరు, ట్రై చేయండి...

srinivasarao said...

బ్లాగు ట్రీట్ మెంట్ బాగుంటుంది... నేను ఇలాంటి ఒక్క పనీ చేయలేకపోతున్నందుకు నిరాశగా కూడా ఉంది...

srinivasarao said...

బ్లాగ్ స్పాట్ కాకుండా బ్లాగర్ అని వేరే ఉందా... అడిగానని అనుకోవద్దు, ఎందుకంటే వీటిల్లో నేను పూర్ మీకు తెలుసు కదా....

Shobharaju said...

ధన్యవాదాలు సర్.. తప్పకుండా ప్రయత్నిస్తాను.. బ్లాగ్ స్పాట్ కాకుండా, బ్లాగు.కామ్ అని ఒకటుంది. అందులో కూడా బ్లాగులు పెట్టుకోవచ్చు.

SRRao said...

శోభ గారూ !
మీ రచనల్లో సమకాలీన సమస్యల మీద ఆవేదనతో బాటు మంచి రోజులు వస్తాయనే ఆశ ప్రస్పుటంగా కనబడుతున్నాయి. ఇది మంచి పరిణామం. ఇలాగే మీ నుండి మరిన్ని మంచి రచనలు ఆశిస్తూ.....

Shobharaju said...

ధన్యవాదాలు సర్.. మీలాంటివాళ్ల ఆశీస్సులు ఉంటే తప్పకుండా మరిన్ని రాసేందుకు ప్రయత్నిస్తాను..