Pages

Tuesday, 12 April 2011

"సాహితీ" కుటుంబం...!!


ఏంట్రా తల్లీ ఎన్నాళ్ళైంది చూసి
ఏమైపోయావు.. ఎక్కడున్నావు?
సోదరీ.. బాగున్నావా...
ఈ మధ్య అస్సలు కనిపించటం లేదేం?

అమ్మాయ్.. ఒంట్లో బాగలేదా
బొత్తిగా నల్లపూస అయిపోయావే?
సోదరా... ఏమైంది నీకు
రోజుకి ఒక్కసారైనా
పిలిస్తే చాలు పలికేవాడివి
ఇప్పుడెక్కడ?

అయ్యో చెల్లికి ఏమైంది
అక్క ఎలా ఉందో ఏంటో
మా అమ్మాయి జాడే లేదు
ఇక అన్నయ్య మాటో..
స్నేహితుల ఎదురుచూపులు
మాటల్లో చెప్పలేనివి....

అక్కా... అన్నా, తమ్ముడా,
అమ్మాయ్, తల్లీ, చెల్లీ.......
ఈ పిలుపులన్నీ..
రక్త సంబంధం పంచి ఇచ్చినవా?
కానే కావు... మరి... ??
"సాహితీ" తల్లి ఇచ్చిన అను'బంధాలు'

ఈ 'తల్లి' పంచిన ప్రేమతో తరించిన
పిల్లలంతా తమ ఆత్మీయతనంతా
పిలుపుల్లో రంగరించి...
ప్రతి ఒక్కరూ సైనికులై
కలాల నాగళ్లతో
ప్రతిరోజూ, ప్రతిక్షణం..
"సాహితీ" సేద్యం చేస్తున్నవాళ్లే....!!

మామూలు "కుటుంబం"లోకిమల్లే
ఈ 'సాహితీ' కుటుంబంలోనూ
వాదులాడుకుంటారు....
కానీ ఆస్తుల కోసం కాదు
అలుగుతారు..
కావాల్సింది పొందేందుకు కాదు
బుజ్జగిస్తారు...
అభిప్రాయాలను బలవంతంగా రుద్దేందుకు కాదు....

వాదులాడుతారు... చర్చిస్తారు...
ఓ స్పష్టమైన అభిప్రాయానికి వచ్చేందుకు
మేటి పరిష్కారాలను వెదికేందుకు
కలాలకు మరింతగా "పదును" పెట్టేందుకు

అలుగుతారు...
చాన్నాళ్లుగా పలుకరించనందుకు కాదు
పిలుపు కోసమూ కాదు... "రచన" కోసం...
కలాలకు 'సోమరితనం' సోకకూడదని..
సాహితీవనం బీడుబారి పోకూడదని
'రచన'లనే 'మొలక'లతో పచ్చగా కళకళలాడాలని

బుజ్జగిస్తారు...
దారి తప్పిన 'రచన'లతో
గాయపరిచే 'మాట'లతో
'వ్యాఖ్య'లనే యుద్ధంతో
'సాహితీ' అమ్మ విధించిన
హద్దులను చెరిపేయటం
సరికాదంటూ...
ఒకరినొకరు బుజ్జగించుకుంటారు

ఇలా... "సాహితీ" తల్లి లాలనలో
'రేపటి' తరానికి 'ప్రతీక'లుగా
'విజ్ఞాన'మనే జ్యోతిని వెలిగిస్తూ
"ముఖచిత్ర కూడలి" సాక్షిగా
"జైహో సాహితీ మాతాకీ" అంటూ
ఒకళ్ళు ఇద్దరై... ఇద్దరు ముగ్గురై
వందలు వేలై..... అలా.... అలా.....
మున్ముందుకే.......!!!

(ఫేస్‌బుక్‌లో నిర్వహిస్తున్న "తెలుగు సాహితీ వలయం" గుంపు కోసం ప్రేమతో రాసిన
ఈ కవితను బ్లాగర్ల కోసం శ్రీరామనవమి శుభాకాంక్షలతో....)

11 comments:

kallurisailabala said...

Shoba garu chakkaga rasarandi mana madhya unna atmiyata, premabhimanala gurinchi...

శోభా రాజు said...

ధన్యవాదాలు శైలా... అన్నట్టు చెప్పటం మరిచాను.. నీకు, నీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు... :)

kallurisailabala said...

thank u sobha...meku, me kutumba sabhyulaki kuda subhakankshalu...

గిరీష్ said...

once again..nice
బాగుందండీ,
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శోభా రాజు said...

ధన్యవాదాలు గిరీష్‌గారూ... మీక్కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు... :)

కొత్త పాళీ said...

Nice

-సో మా ర్క said...

పలుకు పలుకుతో చలువ పందిళ్ళు వేశారు కారుణ్య గారూ!
నా మనో గంగ మీ సాహితీ ఆనంద రస డొలికల నర్తిస్తూ,
కవితా సముద్రాన్ని ఎప్పుడో చేరుకుంది.

శోభా రాజు said...

కొత్తపాళీగారూ ధన్యవాదాలు సర్... :)

"పలుకు పలుకుతో చలువ పందిళ్ళు...
నా మనో గంగ మీ సాహితీ
ఆనంద రస డొలికల నర్తిస్తూ,
కవితా సముద్రాన్ని ఎప్పుడో చేరుకుంది..." సోమార్కగారూ.. మీ వ్యాఖ్య కవితలాగా చాలా అందంగా ఉంది.. ధన్యవాదాలండీ... :)

SRRao said...

శోభా !
' సాహితీ ' కుటుంబ విశేషాన్ని, ఆత్మీయతల్ని చక్కగా వర్ణించావమ్మా ! అభినందనలు.

శోభా రాజు said...

ధన్యవాదాలు బాబాయ్‌గారూ.. మీ పోస్టులను కూడా సాహితీ వలయంలో పోస్టు చేస్తే బాగుంటుందేమో ఆలోచించగలరు... :)

jyothirmayi prabhakar said...

చాలా బాగుంది శోభా