Pages

Tuesday 3 May 2011

ఆంధ్రభూమిలో నా బ్లాగు గురించి....

ఆంధ్రభూమి పత్రిక, విశాఖపట్నం సిటీ ఎడిషన్ సెంటర్ స్ప్రెడ్‌లో మెరుపు అనే పేజీలో నా బ్లాగు గురించిన పరిచయం గత వారం పబ్లిష్ అయ్యింది. ఇన్నాళ్లుగా ఎంతగా ప్రయత్నించినా ఆ కాపీని సంపాదించటం కుదరలేదు. ఒక సోదరుడి సహాయంవల్ల అది ఈరోజుకి సాధ్యమైంది. ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని ఇలా ముందుకొస్తున్నా.....


"కొంతమంది మిత్రులు ఈ స్కాన్ చేసిన పేజీ సరిగా కనబడటం లేదని, చదివేందుకు వీలు కావటం లేదని అన్నారు. అందుకే వారి కోసం ఇది.. జగతి గారు పత్రికకు పంపిన తరువాత నాక్కూడా మెయిల్లో పంపించారు. అలా పంపినదాన్ని యధాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను."


హలో బ్లాగున్నారా?

చల్లని మనసు, మెత్తని మాటా, మృదుమధురమైన భావనలు, అన్నిటికీ మించి ప్రేమ పూరితమైన కవన పుష్పాలు....వెరసి శోభారాజు అనబడే ఈ అమ్మాయి మనసు...అసలు మనసుకి అర్ధం ఇప్పుడేంటో తెలుసా ...బ్లాగ్ ...మనో భావాలను అక్షరాల దారాలతో అందంగా అల్లిన మాలలు ఈ బ్లాగులు. 

ఈ రోజు అలాంటి మృదువైన ఓ మనసు గురించి తెలుసుకుందామా. ఆమె బ్లాగ్ పేరు కుడా ఆమె అంత సున్నితమైనదే సుమండీ 'కారుణ్య'. బ్లాగ్ లోకి ప్రవేశిస్తూనే ఆమె నిరాడంబరత ప్రేమాస్పదమైన ఆమె మాటల్లో తన గురించి ఇలా  అంటుంది...''నన్ను నేను వెదుక్కుంటూ" ఎంత గొప్ప మాట. ఇంత చిన్నవయసులో ఎంత పరిణితి.

నాన్న గురించి తను రాసినది చూస్తే హృదయం చెమర్చక మానదు ఎవరికైనా. ఏ మాత్రం అతిశయం లేకుండా స్వచ్చంగా రాసిన కవితలు ఆమె హృదయానికి దర్పణాలు. స్పందించే హృది ఉంటే కాదేది కవితకనర్హం అన్నట్లు చిరు స్పందనలను కూడా కవిత్వకరీకరించే అందమైన అక్షరాల హరివిల్లు శోభారాజు 'కారుణ్య'.

ఈమె రాతలు కేవలం చదవాల్సినవే కాక చాలా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయనిపిస్తుంది నాకు. కోల్పోతున్న మనవ సంబంధాలు తల్లి తండ్రుల పట్ల  ప్రేమానురాగాలు, అమ్మ మనసు ఇలా ఎన్నో భావాలు ఆర్ద్రతతో మనల్ని కదిలించక మానవు.

అందరితోనూ కలగలిసి పోయే మనస్తత్వం, అందరి ఆనందాన్ని విజయాన్ని తనదిగా ఆనందించే సహృదయతా కలిగిన శోభ నిజంగా అందరికీ ఎంతో ప్రియమైన వ్యక్తీ  కూడా. ఎక్కడా ఎప్పుడూ ఒక్కక పరుష వాక్యం పలుకదు, కానీ స్థిరచిత్తురాలు సుమా. ఈమె ప్రస్తుత నివాసం చెన్నైలో. కొన్నేళ్ళు భర్త ఉద్యోగ రీత్యా విశాఖ గాజువాకలో కూడా ఉన్నారు. 

జీవితం పట్ల ప్రేమ , జీవన మర్యాద కలిగి ఉన్న ఈ కారుణ్య మూర్తి బ్లాగ్ మీరు ఒకసారి పలకరించారా, ఆ తర్వాత మీరే పదే పదే పలకరిస్తారామెని 'హలో బ్లాగున్నారా?' అంటూ...  చూసారా ఎంత మంచిదాన్నో మరి నేను మీకు ఆమె బ్లాగ్ చిరునామా చెప్తాను ఉండండి మరీ....  http://kaarunya.blogspot.in/

..................జగతి 


14 comments:

లాహిరి said...

కంగ్రాట్స్ శోభా!

లాహిరి said...

కొన్నాళ్ళు భర్త ఉద్యోగరీత్యా గాజువాకలో ఉన్నారు.... ఓహో, అదా విశాఖతో అనుబంధం? మీ గురించిన పరిచయం బాగా రాశారు... గుడ్... ఎక్కడో సన్నగా ఈర్ష్య కూడా కలుగుతున్నట్టుంది సుమా!

శోభ said...

ధన్యవాదాలు లాహిరి (శ్రీనివాసరావు) గారూ...

ఓ రెండు సంవత్సరాలపాటు విశాఖ గాజువాకలో ఉన్నాం. మళ్లీ చెన్నై వచ్చేశాం సర్.. నా బ్లాగు గురించి పరిచయం చేసిన జగతిగారు వైజాగ్‌లో రచయితగా బాగా పేరున్నవారు. తను బ్లాగుల్లో నా కవితలను చూసి ఇంప్రెస్ అయి ఓసారి నీ బ్లాగు గురించి రాస్తాను నీకు ఇష్టమేనా అని అడిగారు. నేను సరేనని అనడంతో జగతిగారు తన మాటల్లో నా బ్లాగు గురించి అలా అందంగా రాశారు.. ఈ క్రెడిట్ అంతా వారిదే.. ఈ సందర్భంగా జగతి గారికి కృతజ్ఞతలు..

మీకు ఈర్ష్య కలుగుతోందా.. అయినా నా కంటే లేటుగా ప్రారంభించిన మీ లాహిరి బ్లాగును, దానికి వస్తున్న ఆదరణను చూస్తుంటే నాకే కుళ్లుమోతుతనంగా ఉందండీ.. :)

మధురవాణి said...

Congratulations!!! :)

గిరీష్ said...

హలో బ్లాగున్నార? :)
Each and every word written by Jagati garu is absolutely true.
Congrats!

శోభ said...

మధురవాణిగారూ... థాంక్యూ వెరీమచ్ అండీ... మీ జర్మనీ అనుభవాల గురించి వచ్చిన ఆర్టికల్ చాలా బాగుంది. ముఖ్యంగా మీ ఫొటో చాలా బాగుంది.. ఆర్టికల్ ఆద్యంతం చదివించేలా ఉంది... మరోసారి అభినందనలు... :-)

శోభ said...

గిరీష్‌గారూ.. నేను బాగున్నానండీ.. మీరెలా ఉన్నారు..

ఆర్టికల్ రాసిన జగతిగారికి, చదివి ఇంతలా అభిమానం చూపిస్తున్న మీకు ధన్యవాదాలు...

సో మా ర్క said...

శోభా రాజు గారూ !జగతి గారు మీ గురించి, మీ బ్లాగు గురించి చాలా, చాలా తక్కువగా! చెప్పారు.చెప్పిన ప్రతీ అక్షరం" ప్రత్యక్షర సత్యం".అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.స్వభావోక్తి తప్ప.నాది ఒక మాట ! సబ్బు పరిమళించడానికి కావాలి నీరు ,భావం పరీమళించడానికి కావాలి సరి వారు .మేము రోజూ చూస్తున్నా, మేము చెయ్యలేని పని జగతి గారు చేశారు .ఆమెకు ,మీకు నా అక్షరాభినందనలు.
-సోమార్క

శోభ said...

సోమార్కగారూ.. మీ అభిమానానికి కృతజ్ఞతాభివందనాలండీ..

మనసు పలికే said...

చూసారా.. జగతి గారన్నట్లు నేను కూడ అడిగేస్తున్నా "హలో బాగున్నారా?" అని.:)
జగతి గారు అంత అందంగా మీబ్లాగు గురించి రాయడం వెనకాల అంత కంటే అందమైన మీ బ్లాగు ఉంది కదా. మీకు అభినందనలు, జగతి గారికి ధన్యవాదాలు..:)))))

శోభ said...

అపర్ణా.. నేను బాగున్నాను.. నువ్వు కూడా బాగున్నావని అనుకుంటున్నా...

జగతిగారికి, నా పోస్టులను అభిమానిస్తున్న మీ అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు... :-)

sasikala said...

jagathi gaaru vrasindi choosthe mee lanti hrudayanni palakarinchaalani
pisthundi.chakkati chirunavvu snehaaniki aahwaanam palukuthundi.
all the best my friend.sasikala.

మాలా కుమార్ said...

అభినందనలండి .

శోభ said...

@ శశికళగారూ మీ అభిమానానికి ధన్యవాదాలండీ... మాలా కుమార్‌గారూ మీ అభినందనలు అందుకునేశానండీ... థ్యాంక్యూ... :)