Pages

Wednesday 6 July 2011

నాన్నా.. నువ్వు లేని మా అమ్మ..!!



నువ్వు దూరమై ఏడాది గడుస్తున్నా
కాలం ఎప్పట్లాగే పరుగెడుతోంది
కాలంతోపాటు మేం కూడా…

నువ్వు దూరమైన అమ్మకూడా...
కాలంతో నిశ్శబ్దంగా అడుగులేస్తోంది
అయితే... నువ్వు ఉన్నప్పటి అమ్మకూ
నువ్వు లేనప్పటికీ అమ్మకూ
తేడా మాకిప్పుడే స్పష్టమవుతోంది

నువ్వు లేని ఆమె గతంలోలా
పెద్దరికంగా, ధైర్యంగా లేనేలేదు
ఆమెలో ఏదో తెలీని బాధ
అలాగనీ దాన్ని బయటపడనీయదు
నోరువిప్పి చెప్పదు
బహుశా.. తానే బాధపడితే
పిల్లలు ఇంకెంత బాధపడతారోనని
లోలోపలే కుములుతోందేమో…

అందుకే.. తను మరీ చిన్నపిల్లయిపోయింది
ఇప్పుడు ఆమె మాకు అమ్మకాదు
మేమే ఆమెను పాపలా చూడాల్సి వస్తోంది

పసిపిల్లలు తెలీని వారిని చూస్తే
హడలిపోయినట్లుగా..
ఆమె మాకు కష్టాలొస్తే హడలిపోతోంది
తెలిసినవారిని పిల్లలు హత్తుకున్నట్లుగా
మాకు సంతోషం కలిగితే
గుండెలకు హత్తుకుని ఆహ్వానిస్తోంది…

అదేంటమ్మా అలా చేస్తున్నావ్? అంటే,
చిన్నపిల్లలా ఉడుక్కుంటోంది…
నా పిల్లలు నాకే మంచి చెడ్డలు చెప్పటమా?
అని ప్రశ్నించటం మానేసి…
అందరూ నన్నే అంటున్నారనీ
అమాయకంగా ఏడుస్తోంది…

అందుకే ఆమెను ఓ పసిపాపలా
కంటికి రెప్పలా కాపాడుకోవటం మినహా
పై లోకానికి వెళ్లిన ఓ నాన్నా…
నిన్ను తెచ్చివ్వలేని నిస్సహాయులం మేం
ఆమెకి కలలోనైనా కనిపించి
నువ్వు ఉన్నప్పటి మా అమ్మలా
తనని ఉండమని చెప్పవూ…?!

15 comments:

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

baagundi shobha

జాన్‌హైడ్ కనుమూరి said...

heart rouching


best wishes

శోభ said...

జ్యోతక్కా... జాన్‌హైడ్‌గారూ.. నా పోస్టు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...

గిరీష్ said...

Touching post అండి..బాగుంది

kallur viswam said...

really heart touching and i wept for long time

kallur viswam said...

shoba garu really mansu chaala baruvuga vundi ade amma meeda vunna premenemo

శోభ said...

గిరీష్‌గారూ, విశ్వంగారూ... పోస్టు నచ్చినందుకు ధన్యవాదాలు.

విశ్వంగారూ.. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను.. అమ్మ, నాన్నల ప్రేమంటే అంతే కదండీ..

సృజన said...

ఎవరూ భర్తీ చేయలేని స్థానాలు...అమ్మా నాన్నలు!

శోభ said...

సృజనగారూ ధన్యవాదాలండీ..

priya said...

chala chakka chepparu shoba..chala bagundhi..

priya said...

chala bagundhi shoba garu...

మాలా కుమార్ said...

చాలా టచీగా వుంది .

శోభ said...

ప్రియగారూ, మాలగారూ.. ధన్యవాదాలండీ..

వనజ తాతినేని/VanajaTatineni said...

Really heart Touching..

శోభ said...

ధన్యవాదాలు వనజగారు...