Pages

Thursday 11 August 2011

చిన్ని ఆశలే కానీ… తీరేదెలా…?!


నక్షత్రాలన్నింటినీ గుత్తులుగా చేసి
మా ఇంటి పై కప్పుకు వేలాడదీయాలని
ఆకాశంలోని చందమామను లాక్కొచ్చి
నా కొప్పులో చక్కగా తురుముకోవాలని

వెన్నెల చల్లదనాన్నంతా
పెద్ద పెద్ద డబ్బాలలో నింపేసి
మా ఇంటినిండా దాచేసుకోవాలని
జలపాతాల నీటినంతా
నా దోసిళ్లతో బంధించేయాలని

అభయారణ్యాల అందాన్నంతా
మా పెరట్లో తోటగా చేసేయాలని
అడవిమల్లెల సువాసనంతా
మా ఇంటిమల్లెలు దోచేసుకోవాలని
కోకిలమ్మ రాగాలన్నీ
మా పాప గొంతుతో వినాలని

ఎన్నె ఎన్నెన్నో…
చిన్ని చిన్ని ఆశలే…..!!

కానీ, తీరేదెలా……….?????

13 comments:

dhaathri said...

ivi chinni aasalaa kanna thallee .....ive chinni aasalaith einka nee pedda aasalu surya golaanni intlo light gaa pedathanantavemo....love j

రసజ్ఞ said...

మీ చిన్ని చిన్ని ఆశలు బాగున్నాయి. మీ పెద్ద పెద్ద ఆశలని కూడా తెలుసుకోవాలని ఉంది ఇది చదివిన తరువాత.

SRRao said...

శోభమ్మా !
మానవుడే మహనీయుడు... తలుచుకుంటే మనిషి సాధించలేనిది లేదు. మానవుడిలోని దానవుడిని జయించగలిగితే ఇవి సాధించడం కూడా సాధ్యమేనేమో ! ప్రశాంతమైన మనసే స్వర్గం. నీలాంటి మంచి మనసున్న బంగారుతల్లికి ఇవి తీరని కోరికలు కాదమ్మా ! బావుంది. చాలా బాగా రాసావు తల్లీ !

శోభ said...

@ జగతి అమ్మా... మీ కామెంట్ చాలా సరదాగా ఉంది.. నా కవితలాగే...... :)

శోభ said...

రసజ్ఞగారు... thank you so much andi....

శోభ said...

బాబాయ్... అంతా మీ అభిమానం.. ఇంతమంది మంచివాళ్లతో భావాలను పంచుకునే అవకాశాన్ని, నిష్కల్మష ప్రేమను అందుకునే అదృష్టాన్ని ప్రసాదించిన ఇంటర్నెట్‌కు ఎప్పటికీ రుణపడి ఉండాలనిపిస్తోంది...

జాన్‌హైడ్ కనుమూరి said...

మీ చిన్ని చిన్ని ఆశలు బాగున్నాయి.

జాన్‌హైడ్ కనుమూరి said...

పాజిటివ్ ఆశలు వుండటం వల్ల అవి తీరినా, తీరకపోయినా ఆలోచనా దృక్పథం పాజిటివ్ వైపు వుంటుంది. అది శుభసూచకం కూడా!!!

శోభ said...

Thanks a lot John Hyde Kanumuri Gaaru.. I agree with You Sir...

Anonymous said...

Mee aashalu teerite bavuntundi, prakruthi premikulaina varandari aasha idi

శోభ said...

అనానిమస్ గారు... ధన్యవాదాలండీ. ప్రకృతి ప్రేమికులు అయిన వారందరి ఆశ ఇదేనని అన్నారు.. నిజమేనండీ.. చాలా చిన్నివైన ఆశలన్నీ తీరితే ఎంత బాగుంటుందో కదూ...?!

bangaRAM said...

choodamma shobha mee chinni aashalu
thappanisariga teerutai.sativarine preminchegunamgalavariki teerani korikalemtai.1973 lo vachina "neeti nijayathi" ane cinemaloni pata "matalakandani bhavalu manchi manasulu chebuthai.kavithala kandani bhavalu kanti papale chebuthai " anedanni gurtukochindi thalli. veelunte aa paata vini abhiprayam cheppamma.

శోభ said...

బంగారం బాబాయ్.. ధన్యవాదాలు.. తప్పకుండా ఆ పాటను వింటాను.