Pages

Thursday 8 August 2013

వానొచ్చింది..!!



చెంప ఛెళ్లుమన్నప్పుడు
దెబ్బ.. దెబ్బతో వచ్చే నొప్పీ
రెండూ మర్చిపోయి
రెప్పపాటు క్షణంలో
అలా వచ్చి ఇలా వెళ్లిపోయే
కరెంట్ షాక్ లాంటి మెరుపులు
ఎంత ఆశ్చర్యంగా అనిపించేదో

వానొస్తే మెరుపుల్ని చూస్తే ఎంత భయమో
కానీ కళ్లలోంచి ఆ మెరుపులు వస్తుంటే
ఆశ్చర్యమే ఆశ్చర్యం
అంతపెద్ద ఆకాశానికీ మెరుపులు
ఇంత చిన్న కళ్లకీ మెరుపులే.....!
ఎక్కిళ్ల శబ్దం ఆశ్చర్యాన్ని బ్రేక్ చేసేదాక
షాక్ నుంచి తేరుకోలేని కళ్లు...

ఆకాశానికి చిల్లుపడి వానొస్తే...
మా గొడుగుకీ చిల్లుపడి
వానొచ్చింది
నా కళ్లకి....
టపా టపా హోరులో కలిసిపోతూ...
సాగరంలో మునిగితేలుతూ
గట్టు తెగేందుకు ఓ కన్ను
వద్దు వద్దంటూ మరో కన్ను...!!

5 comments:

Priya said...

బావుంది శోభ గారు :)

నవజీవన్ said...

వానకు మెరుపులే కదా అందం. మంచి వానధార లాంటి కవితాధారను అందించారు.ధన్యవాదాలు.

శోభ said...

ప్రియా...

నవ జీవన్ గారూ...

కవిత మీకు నచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్.. :)

సృజన said...

చక్కని భావాన్ని పొందుపరిచారు.

శోభ said...

ధన్యవాదాలు సృజనగారు