Pages

Monday 20 December 2010

చెప్పాలి... గుర్తుండిపోయేలా..!!


పొద్దుట్నుంచీ ఒకటే ఆలోచన
ఏదో రాయాలి, చెప్పాలి
ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి
చెప్పాలన్న విషయంలో స్పష్టత ఉన్నా,
ఎలా ప్రారంభించాలో తెలియని అయోమయం

కానీ చెప్పాలి..
తానున్నంతవరకూ గుర్తుండిపోయేలా
అనుక్షణం గుర్తు చేస్తుండేలా
అసలు మరపు అనేదే ఎరుగకుండా
సూటిగా చెప్పాలి
కానీ ఎలా...?

రోజులా రేపు తెల్లారుతుంది
అదేం పెద్ద విషయం కాదు
ఆ రేపటిలోనే ఎంతో విషయం ఉంది
ఆ రేపటిలోనే ఎంతో జీవితం ఉంది
ఆ రేపటి రోజునే
మా ప్రియమైన పుత్నరత్నం
దేవకన్యలు తోడురాగా
ఈ భూమిమీద వాలిపోయాడు

మావాడి ప్రతి పుట్టినరోజునా
వచ్చే గిఫ్ట్‌లను చూస్తూ.. ఆ దేవుడికి
మనసులో థ్యాంక్స్ చెప్పేస్తుంటా
ఎందుకంటే...
ఆ దేవుడు చాలా పెద్ద గిఫ్ట్‌ను
తన రూపంలో మాకు ఇచ్చినందుకే...

విషయం పక్కదారిపట్టకముందే...
బ్యాచిలర్‌గా చివరి పుట్టినరోజు
జరుపుకుంటున్న ముద్దుల తనయుడా...
పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది అందరూ చెప్పేదే
కానీ పెళ్లంటే...
కొత్తల్లో లోకాన్నే మర్చిపోయేలా ఉండటమూ కాదు
పాతబడేకొద్దీ అనుమానాలూ, అవమానాలూ కాదు
పెళ్లంటే ఇద్దరి మధ్య ఉండే నమ్మకం

పరస్పరం నమ్మకం, ప్రేమాభిమానాలతో
మీ జీవితం నల్లేరుమీద నడకలా
మూడు పువ్వులు, ఆరు కాయలుగా
హాయిగా, ఆనందంగా సాగిపోవాలని
ఇలాంటి పుట్టినరోజులు
మరిన్ని జరుపుకోవాలని
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ...
విష్ యూ హ్యాపీ బర్త్ డే మై డియర్ సన్...!!
(డిసెంబర్ 21న పుట్టినరోజు జరుపుకోబోతున్న మా పుత్రరత్నానికి ఆశీస్సులతో...)

5 comments:

Padmarpita said...

birthday wishes to Your son...

లాహిరి said...

బ్యాచిలర్ గా చివరి పుట్టిన రోజు అన్న పదం అర్థం కాలేదు...

Anonymous said...

శ్రీనివాసరావు గారు,
అర్థం కాకపోవడానికేముందండి? ఈ పుట్టినరోజు తరువాత త్వరలో ఆ అబ్బాయి పెళ్ళనుకుంటా. పెళ్ళి గురించి చెప్పారుగా టపాలో.

SobhArAju gAru,
i wish your son a very happy birthday and a very happy married life too.

శోభ said...

@పద్మార్పిత గారు, @రావుగారు, @అనానిమస్ (పేరు చేర్చడం మరిచారు) - మీ అమూల్యమైన అభిప్రాయాలను, ఆశీస్సులను అందించినందుకు ధన్యవాదాలు!

శోభ said...

శ్రీనివాసరావుగారూ.. అనానిమస్‌గారు చెప్పింది నిజమే. బ్యాచిలర్‌గా చివరి పుట్టిన రోజు.. అంటే తరువాత వచ్చే పుట్టినరోజునాటికి మావాడికి పెళ్లి అయిపోయి ఉంటుంది. తనకి ఇంకో మూడు నెలల్లో పెళ్లి అవబోతోంది.అందుకే అలా రాశాను.