Pages

Thursday 7 July 2011

నిన్ను చేరేందుకే ఈ ప్రయాణం…!!


నిన్ను కలిసేదాకా
రాత్రులన్నీ చల్లగా
పగళ్లన్నీ నిస్తేజంగా
రోజులన్నీ నిశ్శబ్దంగా
నాకే వినిపించనంతగా
నా హృదయ స్పందన…

అదే నిన్ను కలిసాక
నా చేతులెప్పుడూ ఖాళీగా లేవు
నా మనస్సెప్పుడూ మౌనంగా లేదు
చూస్తుండగానే…
నిమిషాలు కాస్తా.. గంటల్లాగా
గంటలు కాస్తా… రోజుల్లాగా
రోజులు కాస్తా.. వారాలు, నెలలుగా
కాలం మునుముందుకు…

నిన్ను చూడకముందు
ఆకాశంలోని నక్షత్రాలు
వెలసిపోయినట్లుగా ఉండేవి
అదే నిన్ను చూశాక…
ఆ నక్షత్రాల్లో మెరుపు
నా జీవితంలోనూ వెలుగు

నువ్వు తోడుంటే…
నా శక్తి రెట్టింపవుతుంది
తినే తిండి, పీల్చే గాలి
అన్నీ బలవర్ధకాలే….!

నువ్వు లేని రోజున
నా ప్రపంచం శూన్యం
మళ్లీ…
ఓ అద్భుతమైన రోజున
నిన్ను చేరేందుకు
ఆగదు ఈ నిరంతర ప్రయాణం…!

9 comments:

గిరీష్ said...

బాగుందండి జెనెరిక్‌గా ఎవరు ఎవరికైనా రాసేయచ్చు.. :)

Anonymous said...

chaala bagundamma shobha swachcchanga undi nee manasulage...love j

శోభ said...

గిరీష్ గారూ, జగతి అమ్మా... మీ ఇద్దరికీ నా పోస్టు నచ్చినందుకు థాంక్యూ వెరీమచ్...

శశి కళ said...

choosina chaala sepati varaku mee kavitha lone naa mansu munaka. super.

A Rama Krishna Rao said...

kavita adbhutangaa vundandi

శోభ said...

శశిగారూ, రామక్రిష్ణారావుగారూ.. నా పోస్టు మీకు నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్సండీ...

శోభ said...

శశిగారూ, రామక్రిష్ణారావుగారూ.. నా పోస్టు మీకు నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్సండీ...

కనకాంబరం said...

శోభాజి చాలా బాగుంది . ఎలా వున్నారు? ...Nutakki Raghavendra Rao
(kanakaambaram)

శోభ said...

Thank You Very Much Nutakki Sir... Nenu Bagunnanu Sir.. Meerela Vunnaru...?