స్వచ్ఛంగా ఉంటాను
ఎవరెలా రాసినా...
రంగులు పులుముకుంటాను...!
నాకు పేదా, ధనికా
రాజు, రెడ్డి తేడా లేదు
చిన్నా, పెద్దా బేధం లేదు
బాషా బేధాలు అసలే లేవు
అ, ఆలు రాస్తూ అక్షరాలు దిద్దినా
ఆశల సౌధాల ప్రేమలేఖలు రాసినా
ఆస్థి విలువల స్టాంపులు రాసినా...!
ఆంతర్య సౌందర్యాలను
అందంగా జతకూర్చి
ఆశల మాలికలతో
సజీవ కవితల్ని ఆవిష్కరించినా..!
కన్నవారిని కష్టపెట్టలేక
మెట్టినింట బ్రతుకులేక
మరణశయ్యకు మరలిపోతూ
అత్తవారింటి అర్థాలను,
పరమార్థాలను లోకానికి అక్షరీకరించినా...!
ఎవరెలా రాసినా...
నిజాన్ని నిర్భయంగా చాటేస్తాను...!
చించి పడేస్తారో.. ఉండచుట్టి పారేస్తారో
మీ ఇష్టం మరి...!
శిఖరం
1 day ago
5 comments:
Nice one... :)
బావుంది
శ్రీకాంత్‌గారూ, ధన్యవాదాలండీ...
తెల్లకాగితం! brilliant!
కానీ పారదర్శకం ఇక్కడ నప్పే పదం కాదేమో
అవునండీ.. చక్కగా గుర్తు చేశారు. ఏదో ఆవేశంలో రాసేశానుగానీ, పారదర్శకం అర్థాన్ని మాత్రం మర్చిపోయాను.. గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అండీ...
Post a Comment