మా అమ్మ వజ్రం లాంటిది
ఒక అందమైన రత్నం లాంటిది
ఆమె... దేవలోకం...
ప్రసాదించిన గొప్ప బహుమతి
ఆమె నాకు మాత్రమే సొంతం
జీవితమంతా అన్నీ తానై నన్ను నడిపిస్తుంది
జీవన పయనంలో ఒడిదుడుకులొస్తే
కలత చెందకుండా, కంటనీరు పెట్టకుండా
అన్నీ తానై నన్ను కాపాడుతుంది
మృదుత్వం, దయ, ప్రేమ, నిజం...
నిజాయితీ, మార్దవ్యం కలగలసిన ఆమె
నీలాకాశం లాగే... ఈ భూమాతలాగే
దేవుడిచ్చిన ఓ గొప్ప బహుమతి
అమ్మా..! నిన్ను ప్రేమిస్తున్నాను
నీ పాదాలపై ప్రణమిల్లుతున్నాను
నీకెప్పుడూ దూరం కాను...
పసిబిడ్డలాంటి నిన్ను...
పదిలంగా చూసుకుంటాను...!!
గాలిపటం
16 hours ago
4 comments:
బాగుందండి!
first love for everyone is MOM అని అంటారు కదా! మీ కవిత కూడా అలాగే ఉంది.మీ అమ్మగారి లాగ..అందంగా :)
ఇందుగారు, అమ్మ ఓడీఐగారూ... ధన్యవాదాలండీ.. :)
పరిమళంగారూ.. థ్యాంక్సండీ..
Post a Comment