Pages

Monday 19 December 2011

మా 'ఇంట్లో' ఓ 'కాంచన'........!!


ఎందుకో ఈరోజు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఏవేవో ఆలోచనలు, జ్ఞాపకాలు.. అటూ, ఇటూ పొర్లుతూ, నిద్రపోయేందుకు ట్రై చేస్తున్నా..

ఈలోగా... "పిన్నీ..." నిద్ర పట్టడం లేదు.. ఎవైనా కబుర్లు చెప్పమ్మా..." అంటూ మావాడు వచ్చి లేపాడు.

"ఏం కబుర్లు ఉన్నాయి నాన్నా... నేనయితే ఏవేవో ఆలోచిస్తున్నా, నిద్ర పట్టడం లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావు, నీకెందుకు నిద్ర పట్టడం లేదు.." అని అడిగా

"నేనేమీ ఆలోచించటం లేదు. ఎందుకో మరి నిద్రయితే రావటం లేదు పిన్నీ"

అది సరే అమ్మా... ఏదైనా పాట పాడు అన్నాడు

"పాటా, ఇప్పుడా.. టైం ఎంతయిందో చూశావా.. అంటూ గోడ గడియారంవైపు చూపించా.." అప్పుడు టైం సరిగ్గా 12 గంటలవుతోంది.

"ఏం పాట పాడాలంటే టైం చూసుకోవాలా ఏంటి.. పాడమ్మా"

"12 గంటలప్పుడు దయ్యాలు తిరుగుతుంటాయని అంటుంటారు అంతే కదా...?! నాకేమీ భయం లేదులే.. నువ్వు పాడాల్సిందే పిన్నీ" అన్నాడు మొండిగా

చుట్టూ చీకటి, ఇంటిపక్కన కిటికీకి దగ్గర్లో రావిచెట్టు, దానిపైన రకరకాల పక్షులు చిన్నగా శబ్దం చేస్తున్నాయి. గబ్బిలాలు వేలాడుతూ అదో రకమైన సౌండ్ చేస్తున్నాయి. నిజంగా దయ్యాల సినిమాలో సీన్ లాగా ఉంది పరిస్థితి. ఆ టైంలో మావాడు పాట పాడమనడం. నాకైతే ఎంత వణుకు పుట్టిందో...

"పాటా, లేదూ ఏమీ లేదు పోయి పడుకో నాన్నా" అన్నా

"నువ్వు పాడాల్సిందే.. లేకపోతే కాంచనను పిలుస్తా"

అస్సలే కొన్ని రోజులుగా కాంచన సినిమా ఎఫెక్ట్ తో ఉన్నా. కాంచన సినిమా చూసినప్పటినుంచి ఎందుకో ఇంతకుముందెప్పుడూ లేనంత భయంతో వణికిపోతున్నానంటే నమ్మండి. సరిగ్గా కారణం తెలీదుగానీ.. ఇది నిజం.

అది పసిగట్టిన మావాడు.. మాటిమాటికీ కాంచనలాగా ముఖంపెట్టి, గొంతుమార్చి భయపెట్టడం.. నేను భయపడుతుంటే ఎంచక్కా నవ్వుతూ కూర్చుంటున్నాడు.

చివరికి తను చెప్పింది వినకపోతే కాంచనను పిలుస్తా అనేంతగా తయారైంది పరిస్థితి. ఇదుగో ఇప్పుడూ అలానే బెదిరిస్తున్నాడు.

నేను ఏదో పాట పాడబోయా...

"అమ్మా.. ఇప్పుడుగానీ నువ్వు నిను వీడని నీడను నేనే"
అని పాడుండాలి. నిజంగా బెదిరిపోయుంటానేమో...... అన్నాడు. నిజంగా అలా అనుకోగానే భలే నవ్వొచ్చేసింది. పడిపడీ నవ్వాం ఇద్దరం... మేం ఇంతలా నవ్వుతుంటే, కంప్యూటర్ మోనిటర్‌లోకి తదేకంగా చూస్తూ, ఏదో చదువుతున్న మా ఆయనను చూసి ఇంకాస్త నవ్వాం. అయినా ఆయన లోకం ఆయనది....

"అరే నిన్ను భయపెట్టే ఛాన్స్ మిస్సయిపోయింది కదా చిన్నా" అంటూ మళ్లీ నవ్వా.

అలా, అలా కబుర్లు.... మరణం.. మరణం తరువాత జీవితం... పైకి టాపిక్ మారింది

"అది సరేగానీ... పిన్నీ చనిపోయిన తరువాత జీవితం ఉంటుందా...?"

"ఏమో..? నాకు తెలీదు...?"

"ఉంటుంది. స్వర్గం, నరకం కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది. అదే మరణం తరువాతి జీవితం..." చెప్పుకుంటూ పోతున్నాడు

"నిజమా...?"

"అవును. కోర్కెలు తీరక అర్ధాంతరంగా మరణించినవాళ్లు ఇక్కడే భూలోకంలో మనతోపాటే తిరుగుతుంటారట. వాళ్లు అనుకున్నది జరగ్గానే, వెంటనే ఈ లోకం విడిచి వెళ్తారట" అంటున్న చిన్నాతో..

"అవును నిన్న రాత్రి నేను సినిమా చూస్తూ, నిన్ను పిలిచాను చూడు. సేమ్ ఇదే టాపిక్ తెలుసా..?"

"అవునా...? వెరీగుడ్ పిన్నీ... ఇప్పుడు నేను నీకు విషయాన్ని బాగా అర్థం చేయించవచ్చు
సో.. పిన్నీ... ఇప్పుడు నేను చెప్పొచ్చేదేమిటంటే.."

"అలా స్వర్గానికీ, లేదా నరకానికీ వెళ్లని వాళ్లంతా మనతోపాటు ఇక్కడే ఉంటుంటారన్నమాట..!"

"నిజ్జంగా.. నిజమా... అయితే..?!" నోరెళ్లబెట్టి అడుగుతున్నా..

నాలో ఆశ్చర్యంతో కూడిన భయాన్ని పసిగట్టిన మావాడు "అవును... ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే.. మన ప్రక్కనే కూర్చుని వింటుండవచ్చు. నిద్రపోతుంటే పక్కనే పడుకోవచ్చు. తింటున్నప్పుడు అవికూడా మనకు కంపెనీ ఇస్తుండవచ్చు. నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు.. ఇలా ప్రతి పనిలోనూ అవి కూడా ఉండి ఉండవచ్చు...." చెప్పుకుంటూ పోతున్నాడు

నిజం చెప్పొద్దూ... నాలో సన్నగా వణుకు ప్రారంభమైంది

దాన్ని కప్పిపుచ్చుకుంటూ "అయినా రాత్రిపూట ఇలాంటి విషయాలా చెప్పేది. ఇంకెలా నిద్రొస్తుంది" అన్నా కోపంగా

"నిజం ఎప్పుడు చెప్పినా ఒకటే పిన్నీ... నువ్వు ఇలా భయం దాచుకుంటూ, కోపం నటిస్తుంటే పక్కనే ఉండే దయ్యాలు చూస్తూ, నవ్వుకుంటూ ఉంటాయి. వాటిముందు నువ్వు చులకన అయిపోవద్దు... ధైర్యంగా ఉండాలి. సరేనా...?!" అంటూ అప్పటిదాకా అణచిపెట్టుకున్న నవ్వును ఇక ఆపుకోలేక పడి పడీ నవ్వాడు.


"నువ్వలా భయపడుతుంటే..
ఇంకొన్ని నిజాలు చెప్పాలనిపిస్తోంది పిన్నీ..."

నేనూ నవ్వేందుకు ట్రై చేస్తూ... "ఇంతకంటే ఇంకా నిజాలున్నాయా..?! వూ.. కానివ్వు..."

"ముఖ్యంగా.. పగలంతా మనకు కేటాయించిన దెయ్యాలు.. మన ఇంటిని రాత్రిపూట వాడుకుంటాయి. అలా అవి వాడుకుంటున్నప్పుడు మనం మధ్యలో ఎంటరయితే భలే చిరాకుపడతాయి తెలుసా...?!"


"ఏంటీ... మన ఇంటిని వాడుకుంటాయా...?"

 

"అవును.. ఇందులో వెరీ వెరీ స్పెషల్ ఏంటంటే... నువ్వు రాత్రిపూట నిద్ర మత్తులో బాత్రూంకు (నిద్ర మధ్యలో బాత్రూంకి వెళుతూ చాలాసార్లు కాళ్లకి ఏదో ఒకటి తగులుకుని పడటం బాగా అలవాటు. అది చూసి చాలాసార్లు ఇంట్లోవాళ్లు నన్ను వెక్కిరిస్తుంటారు. దాన్ని మావాడు ఇలా గుర్తుచేసి ఆటపట్టిస్తున్నాడన్నమాట :) ) వెళుతుంటావు కదా... అప్పటికే అవి పాపం క్యూలో ఉంటాయి. అది తెలీనీ నువ్వు వాటన్నింటికంటే ముందుకెళతావు. అది చూసిన ఆ దెయ్యాలు నీపై కక్ష కడతాయిలే ఉండు..." నవ్వుతూ చెబుతున్నాడు

"అవునా...?! ఇది మరీ దారుణం.. మన ఇంటి బాత్రూం వాడుకునేందుకు అవి పోటీపడతాయా..?"

"అవును... మన జనాభాలాగే, వాటి జనాభా కూడా ఎక్కువే కదా.. అలాంటప్పుడు ప్రతి ఇంట్లోనూ అవి ఉన్నా, మనలాగా ఇద్దరు ముగ్గురు ఉండరు. చాలామందే ఉంటారు. అలాంటప్పుడు ఇంత చిన్న ఇల్లు సరిపోదు కాబట్టి, అవి వంతులవారీగా పనులు చేసుకుంటుంటాయేమో.......?!"


అదంతా నిజంగా జరుగుతున్నట్టు చెప్పుకుపోతున్నాడు మావాడు.

నాకైతే నిజమో, అబద్ధమో తెలీని పరిస్థితి...

అది నిజమే.. కళ్లముందు జరుగుతుందన్నంతగా వర్ణించి, వర్ణించి చెబుతూ, నవ్వుతూ.. నన్ను పరిశీలిస్తున్నాడు

ఆశ్చర్యమూ, నిజమేనేమోనన్న ఖంగారూ, అదో రకంగా ముఖంపెట్టి నవ్వాలో, కోపగించుకోవాలో తెలీని స్థితిలో ఉన్న నన్ను భయపెట్టడం తేలికేనని అర్థమైంది వాడికి. అయితే పాపం భయపడుతోంది. మరీ ఎక్కువగా భయపెడితే ఎక్కడ జ్వరం వస్తుందేమో అనుకున్నాడో ఏంటో.. ఆ రోజుకి అలా వదిలేశాడన్నమాట.

"సో... ఈ దయ్యాల జీవితం గురించి మరోసారి వివరంగా చర్చించుకుందాం పిన్నీ... ఇప్పుడు నాకు భలే నిద్రొస్తోంది.. నేను వెళ్లి పడుకోకపోతే, నా బెడ్‌ను అవి ఆక్రమించేస్తాయి.
వెళ్తాను... బాబాయ్ ఇక చదివింది చాలు, వచ్చి పడుకోండి" అన్నాడు నవ్వుతూనే....

నేను తనవైపు గుర్రుగా చూస్తుంటే... "పిచ్చి పిన్నీ..... నేనేదో నిన్ను ఆటపట్టించాలని చెబితే నువ్వు నిజమే అనుకుని నమ్మేస్తున్నావా ఏంటి...? ఏం భయపడకు.. అస్సలు దెయ్యాలు లేవు.. ఒకవేళ నాకు కనిపిస్తే అప్పుడు చెబుతాలే...! హాయిగా నిద్రపో..." అన్నాడు.


"ఏంటి దయ్యాలు నీకు కనిపిస్తేనా....?!
"

"అయ్యో... జోక్ చేశానమ్మా... నాకు కనిపించటం ఏంటి.. అసలు అవుంటే కదా...?!"


 "అదీ.. అలారా దారికి... ఇంకోసారి ఎప్పుడైనా నిద్ర రాలేదు.. ఏవైనా మాట్లాడు అని నా దగ్గరికి రా చెబుతా నీ సంగతి...?" అంటూ బెదిరించా

"అమ్మా... తల్లీ... వదిలేయ్... లేకపోతే......"

"లేకపోతే....?" రెట్టించాను

"ఆ.. ఏం లేదు.. గుడ్ నైట్ పిన్నీ, బాబాయ్..." అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు.

లేకపోతే... అని ఆగిపోయిన చిన్నా... దెయ్యాల్ని పిలుస్తా అనబోయి... మళ్లీ భయపెట్టడం ఎందుకని ఆగిపోయాడని నాకు తెలుసు.

తను చెప్పింది నిజం కాదని తెలిసినా...... మనసులో ఏదో మూల ఒక డౌట్... అలా ఆలోచిస్తూనే నిద్రపోయా...

మరుసటి రోజు అందరూ పనులకు వెళ్లిపోయిన తరువాత.. అసలు పగలు టైంలోనే నాకు ఆ దయ్యాలు నా పక్కనే ఉన్నాయేమో అనిపించేది. బాత్రూంకి వెళితే, నా ముందు క్యూ ఏమైనా ఉందా అని పరిశీలనగా చూస్తూ వెళ్లడం... వంట గిన్నెల్లో వండినది ఏమైనా ఖాళీ అయ్యిందేమో చూడటం...... కుర్చీల్లో ఎవరైనా కూర్చుని ఉన్నట్టు కనిపిస్తుందేమోనని చూడటం... గ్లాసులో నీళ్లు వంపినవి అలానే ఉన్నాయా, కొంచె ఖాళీ అయ్యాయేమోనని పరిశీలించటం....
లాంటివి నాకు తెలీకుండానే జరిగిపోయాయి.

నిజం చెప్పొద్దూ....... ఇప్పుడు కూడా నేను ఇదంతా రాస్తుంటే అవి నా పక్కన కూర్చుని చదువుతున్నాయేమో అనిపిస్తోంది...


"ఇన్నాళ్లూ కాంచన ఎఫెక్ట్.. ఇప్పుడేమో ఇంట్లో దెయ్యాల ఎఫెక్ట్..." ఏంటో మరీ ఇంతలా ఇన్వాల్వ్ అయిపోతే ఎలా చెప్పు తల్లీ..... అంటూ నా మనసు కూడా నన్ను చూసి నవ్వుకుంటోంది మా అబ్బాయిలా....
LOL

37 comments:

మధురవాణి said...

హహ్హహ్హా.. శోభ గారూ.. ధైర్యం విషయంలో మీరు నాకు పోతీకోచ్చేలా ఉన్నారే! :)))))
ఇప్పుడు మీ పోస్ట్ చదువుతుంటే ఎంచక్కా నవ్వొచ్చింది గానీ ఎవరైనా నా ఎదురుగా కూర్చుని అలా దెయ్యాల కబుర్లు చెప్తే మాత్రం ఇంకంతే సంగతులు.. P

Anonymous said...

ఏమో! మీ బ్లాగ్ దెయ్యాలు కూడా చదువుతాయేమో! నేను దెయ్యాన్ని కాదులెండి. :-)

Unknown said...

అక్క పోస్ట్ బలే ఉంది.
ఈ టైం లో చదివాను రాత్రికి నా పరిస్థితి ఏంటో?
కాని మీ అబ్బాయి చెప్పింది నిజ్జం
దయ్యాలు రాత్రే రావాలని లేదు పగలు మనతో మనకి కనబడకుండా ఉంటాయి అని నేను కూడా విన్న...
అమ్మో ఇంకా రాయలేను
వణుకు వస్తోంది.

సుభ/subha said...

LOL :):):):):)

Uday Kumar said...

౨౩౫౪ $%#^ *&(^% )(*&^%&*%% #@$%&&^^ ( మా గురించి రాస్తావా ఈ రాత్రికి చెప్తాం నీ పని)

Advaitha Aanandam said...

హ హ హ హ..... నవ్వలేక చచ్చానండీ ...

రసజ్ఞ said...

హహహ ఆ పిల్లాడెవరో నాలాంటి వాడే ;)

శోభ said...

మధురవాణిగారూ.. నా ధైర్యం ఏంటో మీకు తెలిసింది కదా.. దెయ్యాలంటే భయం లేనిది ఎవరికి చెప్పండి. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పనా..

మేం పుట్టి పెరిగిన ఇల్లు ఊరికి చివర్లో ఉంటుంది. మా ఇల్లే చివరిది అనుకోండి. ఇంటికి రెండువైపుల పొలాలు, మరో రెండువైపులా ఇల్లు. అసలే అక్కడ దెయ్యాల భయం ఎక్కువ. రాత్రిళ్లు ఎవైనా విచిత్రమైన సౌండ్లు వస్తే దెయ్యాలని అనుకుని భయపడేవాళ్లం. చిన్నప్పుడంతా అలా భయంగానే గడిచిపోయింది.

అదలా ఉంచితే.. ఈ మధ్య ఎగ్జామ్స్ కోసం వెళ్లి అక్కడే నెల రోజులు ఉన్నా. ప్రతి రోజూ రాత్రి 12 అయ్యిందంటే చాలు గజ్జెల చప్పుడు వినిపిస్తోంది. తమ్ముళ్లేమో గుర్రుపెట్టి నిద్రపోతుండేవాళ్లు. అమ్మా, నేను మాత్రం ఆ సౌండ్ వింటూ భయంభయంగా గడిపాం. తమ్ముళ్లను లేపితే ఎంతకూ లేవరు. మాకేమో లేచి కిటికీలోంచి బయటికి చూసే ధైర్యం లేదు. పోనీ లేచి లైట్ వేద్దామన్నా లేచినప్పుడు ఆ దెయ్యం చూసేస్తుందేమోనని భయం.. :)

అలాగే ఓ పది రోజులు గడిచాయి. తమ్ముళ్లకు చెబితే ఏమో సౌండ్ వచ్చిందేమో.. అయితే మాకెప్పుడూ అలా వినిపించలేదు అని కొట్టి పారేశారు. ఇక ఏం చేయలేక రోజూ ఆ శబ్దాన్ని భరిస్తూ.. భయం భయంగా గడిపాం.

ఓరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరు. నేను చదువుకుంటూ ఉన్నాను. ఒక్కసారిగా రాత్రిళ్లు వచ్చే ఆ గజ్జెల సౌండ్ వినిపిస్తోంది. అదిరిపడ్డాను. ఇదేంట్రా స్వామీ పగలే దెయ్యం వచ్చేసింది. ఇంట్లో ఎవరూ లేరే.. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ కాసేపు అలాగే ఉండిపోయా. తరువాత మెల్లిగా లేచి చూశా. ఎదురుగా కిటికీ పక్కగా ఎవరూ కనిపించలేదు. సరేనని మెల్లిగా తలుపు తీసి బయటికి వచ్చాను. వరండాలో కూడా ఎవరూ లేరు. సౌండ్ మాత్రం అలాగే వస్తోంది. అలాగే చేతిలోకి ఓ పెద్ద కర్ర తీసుకుని ఏదయితే అదయిందని అటూ, ఇటూ వెతకటం మొదలుపెట్టా. ఓ మూల నుంచి ఆ సౌండ్ వస్తున్నట్లు గమనించేశా.. ఇంకేముంది జాగ్రత్తగా, భయంగా దగ్గరికి వెళ్లి చూస్తే.....

ప్లీజ్ ఎవ్వరూ నవ్వకండే.....

అదో పురుగు... :) :)

నిజం తెలిసాక... ఓవైపు సంతోషం... మరోవైపు ఇన్నిరోజులూ ఎంతగా భయపడ్డామో తల్చుకుంటే పొరలు పొరలుగా నవ్వు. ఎంతలా నవ్వానంటే.. కడుపు పగిలిపోతుందేమో అనేంతలా..

అమ్మ, తమ్ముళ్లు ఇంటికి వచ్చాక చెబితే అందరూ ఒకటే నవ్వు.... ఇది జరిగి సరిగ్గా రెండు నెలలు అవుతోంది.

మీరు కూడా నవ్వుతున్నారా... చెబుతుంటే నాకే ఎంతలా నవ్వొస్తోందో... :) :)

శోభ said...

@ తెలుగు భావాలు గారూ... నిజమేనండీ.. నా బ్లాగ్ దెయ్యాలు కూడా చదివి నన్ను ఇంట్లో ఇంకా ఎక్కువగా విసిగించేస్తాయో ఏమో.. నా ఊహలు, ఆలోచనల్లో... :)

శోభ said...

@ శైలూ... సాయంత్రం టైంలో పోస్ట్ చదివానన్నావు. మరి రాత్రి సరిగా నిద్రపోయావా... :)

అయితే దయ్యాలు రాత్రే కాదు, పగలు కూడా మనతోపాటు మనకు కనబడకుండా ఉంటాయని నువ్వు కూడా విన్నావా.. అయితే నా పని గోవిందా... గోవిందా.... :)

శోభ said...

@ లలితగారూ...
@ సభగారూ...

మరీ అంతలా నవ్వకండి... పక్కనే కూర్చుని దెయ్యాలు మిమ్మల్నే గమనిస్తూ ఉన్నాయేమో.... LoL :) :)

శోభ said...

@ అమ్మో... ఉదయ్ అన్నయ్యా, మీరలా అనకండి నిజంగా నాకు భయమేస్తోంది... :) :)

@ మాధవిగారూ..... చదువుతుంటేనే మీ పరిస్థితి అలా ఉంది. ప్రత్యక్షంగా ఆ టైంలో భయపడ్డా, తరువాత జరిగింది తల్చుకుంటుంటే నిజ్జంగా నాకు ఎంత నవ్వొస్తోందో... :) :)

@ రసజ్ఞగారూ... అసలు మా చిన్నాగాడితోనే వేగలేకుంటే మరీ మీరు కూడానా. మరీ ఇంత అల్లరైతే ఎలా చెప్పండి. అలానే నన్ను భయపెడుతూ ఉండండి.. ఎప్పుడో ఓసారి ఆ దెయ్యాలతోనే ఫ్రెండ్ షిప్ చేసి మా చిన్నాను, మిమ్మల్ని జడిపించేస్తాను... హమ్మా..... LoL... :) :) :)

dhaathri said...

నిజంగా చాలా బాగుంది రా శోభమ్మా అందరమూ ధైర్యవంతులమే మహా గొప్ప వాళ్ళాం అసలిలాంటివి విన్నాక అప్పుడు అసలు విహ్స్యం బయటపడెది హ హ హ హ హ ......లవ్లీ రైట్ ....ప్రేమతో ....జగతి

శోభ said...

ధాత్రి అమ్మా... మీరు చెప్పింది ముమ్మాటికీ నిజమే.

ఈ పోస్ట్ మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకోసం మీకు నేనిచ్చే కానుక బోలెడన్ని థాంకులు.. అంతకంటే ఎక్కువ నవ్వులు.... :)

Anonymous said...

శోభా అసలే అమ్మ కూడా లేరు ఇప్పుడు....నువ్వు ఇలా నన్ను భయపెట్టడం ఎమైనా బాగుందా చెప్పు

శోభ said...

షామిలీ డియర్... ఒక్కరే ఉన్నప్పుడే దెయ్యాలు అల్లరి ఎక్కువ చేస్తాయట.. అవలా అల్లరి చేస్తుంటే నువ్వేం భయపడకు.. వెంటనే నా పేరు చెప్పు.. అలా చెబితే అల్లరి మానేస్తాయి అని అంటానని అనుకుంటున్నావు కదూ..?!

అలా చేస్తే బాగానే ఉంటుంది. కానీ వాటికి నా భయం గురించి తెలుసు కాబట్టి, నవ్వుకుంటూ ఇంకాస్త అల్లరి చేస్తాయేమో.. జాగ్రత్త... :) LoL

kanthisena said...

మనం దయ్యాలను ప్రేమిస్తే దయ్యాలు కూడా మనల్ని ప్రేమిస్తాయి. చందమామ కథల్లో చదువుకోలేదూ మనం..

శోభ said...

నెలవంకగారూ... మీరు చెప్పింది మంచిదే. కానీ దెయ్యాల్ని ప్రేమించే ధైర్యం ఉండాలిగా ముందు... :)

జ్యోతి said...

ఐనా దయ్యాలంటే భయమేంటి.?? అవి మనకంటే భయంకరంగా ఉంటాయా?? రాజుగారన్నట్టు ప్రేమ అన్ని భయాలను తొలగిస్తుంది. ఆమెన్.. :).. నేనైతే దయ్యం కనపడితే దోస్తానా చేస్తాను. మీకు కనిపిస్తే నా దగ్గరకు పంపించండి శోభగారు...చూద్దాం దాని తడాఖా ఏంటో??

శోభ said...

జ్యోతిగారూ.. తప్పకుండా పంపించేస్తానండీ నాకు కనిపిస్తే.. :) అసలు కనిపిస్తే బాధే ఉండదు. అలా కనిపిస్తే అప్పుడు వాటితో ఫ్రెండ్‌షిప్ చేయాలో వద్దో తేల్చుకోవచ్చు..... :) :)

సుజాత వేల్పూరి said...

రాజు గారూ, ఇదెక్కడి అన్యాయమండీ? దయ్యాలని ప్రేమించమంటారా? చందమామ కథల్లో దయ్యాలు ఎంత మంచివసలు? ఎప్పుడూ చెట్టు మీది నుంచి దిగొచ్చి డబ్బు మూటలిచ్చి మాయమవుతూ ఉంటాయి? అలాంటి దయ్యాలుంటే ఒక దాన్ని పెంపుడు దెయ్యంగా తెచ్చుకుంటే బాగుంటుంది.

శోభ గారూ, మీ ఆలోచనలని అందరితోనూ పంచారు. ఈ టపా చదివాక ఏ పని చేస్తున్నా "పక్కన దయ్యముందేమో" అని సందేహంగా ఉంది! భలే పని చేశారు మొత్తానికి!

శోభ said...

సుజాతగారూ... చందమామ కథల్లోలాగా దెయ్యాలు వచ్చి డబ్బు మూటలిచ్చి వెళ్తే బాగానే ఉంటుంది. కానీ ఇప్పటి దెయ్యాలు మనతోపాటు మనకు తెలీకుండా జీవిస్తున్నాయి కాబట్టి... మనందరం ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభాన్ని అవి కూడా ఎదుర్కొంటూ ఉంటుండవచ్చు. అందుకనే అలా డబ్బు మూటలు ఇవ్వలేక, ఇలా నవ్వు మూటల్ని మనకు ఇస్తున్నాయి... :)

kanthisena said...

సుజాతగారూ, డబ్బు మూటలిచ్చి మాయమయ్యే చందమామ దయ్యాలా. అయితే వాటిని డబుల్‌గా ప్రేమిస్తానండీ.. అవి తరిమినా పోను....

జ్యోతిగారూ, "ప్రేమ అన్ని భయాలను తొలగిస్తుంది." నిశ్చయంగా.. నిస్సందేహంగా...

గూగుల్ వాడు బజ్‌లను క్లోజ్ చేశాక మీరస్సలు కనబడలేదు. ఎక్కడున్నారు... ఎక్కడికెళ్లారు? గూగుల్ వాడిని ఇక నమ్మనే కూడదు. వాడేమైనా చేయగలడు.

జ్యోతి said...

రాజుగారు నన్నేనా అడిగేది.. బజ్జు దుకాణం ఎత్తేయకముందే నేను అక్కడనుండి తప్పుకున్నానండి. ప్లస్ లో చేరా. అప్పుడప్పుడు అందరిని పలకరిస్తాలెండి..

kanthisena said...

అవునండీ సుజాతగారితో సహా మీ ఇద్దరి గురించీ అడిగాను. బజ్ ఎంత సులభమైన పరికరంగా ఉండేదో.. గూగుల్ ప్లస్, బజ్ అంత సులువుగా ఉంటుందా దాని జోలికే పోలేదు నేను ఇంతవరకూ. ఇలాంటి పితలాటకాలు ఉంటాయనే నేను తొలినుంచి బ్లాగును మాత్రమే పట్టుకున్నాను. ఇంతవరకూ బజ్‌లో మాత్రమే పెట్టిన టపాలన్నీ పోయినట్లేగా ఆందరివీ.. నల్లమోతు శ్రీధర్ గారినయితే ప్రతిరోజూ చూసేవాడిని. అందరూ మిస్సయ్యారు. ఏంటో... అందరికీ బజ్జి పడింది.

lalithag said...

మీ అనుభవం నాకు నవ్వు తెప్పించిందని చెప్పేశాను కదా. ఇక నా సంగతి చెప్తాను. చందమామ కథలలో దయ్యాలు సరదాగా ఉంటాయి. ఆ స్ఫూర్తితో నేను కూడా దయ్యం కథలు వ్రాయాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ అంత సులభం కాదని అర్థమౌతోంది. ఈ లోగా ఇంకో పిల్లల పత్రికకోసం మా పెద్దబ్బాయి ఊహకు మాటలు ఇచ్చి ఒక హారర్ కథ వ్రాయాలని మొదలు పెట్టాను. నేను పిల్లల కోసం హారర్ వ్రాయలేనని తెలుసు. నాకే ముందు భయం కదా :) ఐనా మొదలు పెడదాం ఎటు వెళ్తుందో అని కూర్చున్నాను. ఇక్కడ మీరు మీకు గజ్జెల చప్పుళ్ళు వినిపించిన అనుభవం చెప్పారు కదా. అలాంటి పరిస్థితి నా కథలో హీరోది అన్న మాట. ఊహించి వ్రాస్తున్నాను. పిల్లలు పడుకున్నారు, మా ఆయన ఊళ్ళో లేరు. ఇల్లంతా నిశ్శబ్దం. అప్పుడప్పుడూ చిన్న chiming. ఇది ఎప్పుడూ వినిపిస్తుంటుంది రాత్రి నిశ్శబ్దంలో నేను పని చేసుకునే చోట. వేలాడే గాంజు అలంకరణల కదలికల చప్పుడది. అది ఒక్క దాన్నీ పని చేసుకునేటప్పుడు magnify అవుతుందనన్నమాట. వ్రాస్తుంటే నాకే దడ పుట్ట సాగింది. కొద్ది సేపట్లోనే అర్థమైపోయింది నేను ముగింపు వేరేలా వ్రాస్తానని. ఐనా భయం పోలేదు. ఆ రాత్రి పడుకుని ప్రొద్దున లేచి ముగించినట్టున్నాను కథ. ఇక మా చిన్నబ్బాయికి పొరపటున ఏవో దయ్యం కథలు బేస్‌మెంటులో ఉన్న చిన్న storage గదిలో చదివి వినిపిస్తానని చెప్పాను ఏదో అలక తీర్చడానికి. వాడు రాత్రి పూట కూర్చుని చదవాలంటాడు. నాకేమో భయం. ఇంతవరకూ వాడికిచ్చిన మాట చెల్లించలేదు :(

శోభ said...

హ్హ హ్హ హ్హ..... లలితగారూ... మీరు చెప్పేది వింటుంటే నాకు ఎంత నవ్వొస్తోందో.. సరదా అనుభవం మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు... మొత్తానికి మీ చిన్నోడి దగ్గర భలే ఇరుక్కుపోయారన్నమాట... మావాడి దగ్గర నేను ఇరుక్కు పోయినట్లుగా.... :) :) :)

krishnaleelatarangini said...

So funny....ma chinnammayi kuda inta juttu moham meediki lakkuni "Kanchanaaaaaaaaaaa ani nannu edipinchedi. unna mata cheppalante naku deyyala kante ilanti cinemalantene bhayam ekkuva. Deyyalu manaki kanabadavu. Kani ee cinemalu vati bommalu etc adugaduguna manaki kanabadutu pranalu teestayi. kaduuu? avunaaa?! Inko mata cheppana...funny vishayanni serious turn tipputunnanani ankukokandem....Okasari Vivekanandudu Ganga teerana kurchuni japam chesukuntunnaduta. Appudayanaki gali lonchi evo konni mulugulu edupu vinipinchayata. Ala kassepu vatini vinna Vivekanandudu ventane ganga loki digi kanabadani aa pretatmalaki tarpanam vadilatta. ante aa mulugulu edupu agipoyayata. Korikalu teerani vallu pretatmaluga galilo sancharistu untaranna matani nenu nammutanu...kani Vivekanandudu cheppinattu avi evariki kanabadavu. Evarni e vidham ganu badhinchavu...kanchana la juttu peekkuni manalni pichekkinchavu..tella cheera kattukuni aa tella cheera paruvu tiyyavu...idanta cinema valla punyam...so manam bhayapadalsindi cinemalake...I am really afraid of them...:)

వేణూశ్రీకాంత్ said...

హహహ మొత్తానికి మీ భయాన్ని మా అందరికి బాగా పంచారండీ :-) ఇపుడు నేను కూడా గమనించడం మొదలెట్టేస్తా కొన్ని రోజుల పాటు :-))

శోభ said...

గాయత్రిగారూ... మీరు చెప్పింది నిజమే. ఎవరం ఎప్పుడూ దెయ్యాలను నిజంగా చూసి ఉండము. అలా ఉంటాయి, ఇలా ఉంటాయి అనుకోవడం తప్ప. కానీ, అలాంటి ఊహలకు రూపం ఇస్తాయి సినిమాలు. ఊహలు చిత్రాలుగా కళ్లముందు కనిపిస్తుంటే ఇంకేముంది పై ప్రాణాలు పైనే... నిజం చెప్పాలంటే అలాంటి సినిమాలను నేను ఒక్కదాన్నే ఎప్పుడూ చూడను. భయం భయంగా ఉంటుంది. సో.. మీరు చెప్పినట్లుగా మనందరం భయపడాల్సింది దెయ్యాలకు కాదు.. సినిమాలకే.. ఒప్పుకుంటున్నా..... :)

శోభ said...

వేణూ శ్రీకాంత్ గారూ.. జాగ్రత్తండీ.. మీరిలా ఈ పోస్టు చదివి, కామెంట్ పెడుతుంటే మీ పక్కనే ఉండి గమనిస్తున్నాయేమో.... :) :) :)

Harsha said...

బావుంది అమ్మా... నిజంగా మీ వాడు చెప్పినవి దెయ్యాలు కాదు ఆత్మలు.. అంటే దేహం లేనివి అని నా ఉద్దేశ్యం... నిజంగా దెయ్యాలు అనేవి ఉంటే కనుక నిజంగా ముందు మీ వాడికే కనిపిస్తాయిని నా నమ్మకం...

నిజంగా నేను చాలా నవ్వుకున్నాను అమ్మా.. చాలారోజులు తర్వాత...

మంచి పోస్ట్...

మీ
హర్ష

శోభ said...

హర్షా... దెయ్యాలు ఉంటే ముందు మావాడికే కనిపిస్తాయా.. ఆ తరువాత తన ఫ్రైండ్‌వైన నీకు కూడా కనిపిస్తాయేమో.. జాగ్రత్త.. :)

ఈ విషయం స్వాతితో చెప్పేవు. పాపం నువ్వు ఆఫీసుకెళ్లాక తను ఒక్కతే ఉంటుంది కదా.. భయపడుతుందేమో....?!

ఇక్కడ ఉంటే మమ్మెల్నెప్పుడూ నవ్విస్తూ ఉండేవాడివి. ఇప్పుడు మేము ఈ పోస్టు ద్వారా నిన్ను నవ్వించామన్నమాట. గుడ్... గుడ్... :)

SATTAR SAHEB said...

హహహః హహహః
చాలా బాగా చెప్పారు మేడం
సస్పెన్సు హర్రోర్ త్ర్హిల్లర్
అన్ని మిక్ష్ చేసి

చిన్ని విషయాన్నీ అలా వర్ణిచడం నాకు బాగా నచ్చింది

సత్తార్
ది హన్స్ ఇండియా
ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్

శోభ said...

Thanks Sattar gaaru...

pavan said...

Soo Funny madam... chaala baaga chepparu... ee coment chaduvutunnapudu kooda mee pakkane unnayemo mam....

శోభ said...

థ్యాంక్యూ పవన్ :-)