Pages

Tuesday, 20 December 2011

మా బహుమతికో బహుమతి...!!

 
 
 కొంతమంది పరిచయమే ఓ బహుమతి
ఆ బహుమతి దక్కడమే ఓ వరం
దాన్ని నిలబెట్టుకోవడమే ఓ తపం
అలా చేస్తేనే అవుతుంది బ్రతుకు ధన్యం

కొన్ని పరిచయాలెప్పుడూ
కొంతదూరమే మనతో వస్తాయి
మరికొన్ని పరిచయాలు
నమ్మకం నిలుచున్నంతదాకా
మరికొన్ని జీవితం కడదాకా

మనతో కడదాకా నడిచొచ్చే
వాళ్లనెప్పుడూ నమ్మవచ్చు
వాళ్ల ప్రేమలో నిజాయితీని
వాళ్ల ఆదరణలో ఆర్ధ్రతను
వాళ్ల అభిమానంలోని అనురక్తిని
వాళ్ల ఓదార్పులో నిస్వార్థాన్ని
అన్నింటినీ ఆస్వాదించొచ్చు
 
కష్టాల్లో వెన్నుచూపకుండా
మీకు మేం తోడున్నాం అంటూ
మన గెలుపును తమ గెలుపుగా
ఓటమిని తమ ఓటమిగా
సంతోషాన్ని తమ సంతోషంగా
మన మనసుకు, మమతకు
అద్దంలో ప్రతిబింబంలా నిలిచే
వాళ్లను చూసి గర్వపడొచ్చు

{అలా మా "వాడు" అని గర్వంగా చెప్పుకునేలా.. భగవంతుడు ఇచ్చిన ఓ గొప్ప బహుమతిగా మాకు దక్కిన మా "చిన్నా" పుట్టిన రోజు (డిసెంబర్ 21) సందర్భంగా మీ అందరి దీవెనలూ, ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ....}
- మీ కారుణ్య

10 comments:

Unknown said...

అక్క ! మీ చిన్నకి నా తరపున బోలెడు బోలెడు శుభాకాంక్షలు.ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ...

సుభ/subha said...

మీ చిన్నాకు జన్మదిన "సుభా" కాంక్షలండీ ముందస్తుగా.. ఎవ్వరూ ఇవ్వలేని బహుమతి ఇచ్చారు చిన్నాకు.

శోభ said...

@ శైలూ..

@ సుభ గారూ... మీ అభినందనలకు ధన్యవాదాలు.

యశోదకృష్ణ said...

Happy birthday to chinna.

శోభ said...

ధన్యవాదాలు గీతగారూ.....

గీతిక బి said...

చిన్నారి చిన్నాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

నిండు నూరేళ్ళూ సుఖసంతోషాల్తో, ఆయురారోగ్యాల్తో తల్లిదండ్రులకి మంచిపేరు తెచ్చేలా వర్థిల్లమని దీవిస్తూ...

గీతిక

మధురవాణి said...

మీ చిన్నా కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

శోభ said...

సో మెనీ థ్యాంక్స్ మధురవాణిగారూ.....

జాన్‌హైడ్ కనుమూరి said...

పుట్టినరోజు శుభాకాంక్షలు.

శోభ said...

ధన్యవాదాలు జాన్ గారూ....