లేచీ లేవంగానే "మా" అనే కేక..
కళ్లు తెరవగానే
అటు దేవుడినీ, ఇటు నన్నూ
మార్చి మార్చి చూసే చూపులు..
ఇక రెండు వారాలకోసారేనని........
దినపత్రిక కోసం అబ్బా కొడుకులిద్దరూ
తగవులాడుకుంటుంటే
ముసి ముసిగా నవ్వుతూ...
పిల్లాడితో పోటీ ఏంటని
పేపర్ లాక్కుని అబ్బాయికిచ్చేసే
రోజువారీ సంఘటన కోసం
ఇకపై రెండు వారాలు ఆగాలని......
అమ్మా... నాకివాళ ఈ టిఫిన్ చేసి పెట్టు
అలాగే లంచ్‌లోకి అంటూ...
లెక్కలేనని ఐటమ్స్ పేర్లు చెబుతుంటే,
కళ్లు తేలేస్తుండే నా అవస్థను చూసి,
చిలిపిగా నవ్వుతూ అల్లరి చేసే సన్నివేశాలు
ఇక రెండు వారాల విరామం తర్వాతేనని...
రోజూ కాలేజీకెళ్తూ..
వీధిమలుపు తిరిగేదాకా
ఆగకుండా టాటా చెప్పే చేతులు
మేడమెట్లు ఎక్కి, దిగేటప్పుడు
ఆసరాగా నిలిచే అవే చేతులు
పనిలో లీనమై ఉన్నప్పుడు
మెడచుట్టూ అల్లుకుపోయే
ఆ చేతుల స్పర్శ..
ఇక రెండు వారాలకోసారేనని
రాత్రి భోజనాల వేళప్పుడు
ఓవైపు టీవీ చూస్తూ...
మరోవైపు పుస్తకం చదువుతూ
ప్లేటులో ఏముందో చూడకుండా
గెలుకుతూ తింటుంటే..
ఇలాగయితే ఒంటికి ఎలా పడ్తుంది నాన్నా
అంటూ సుతిమెత్తగా మందలిస్తూ..
గోరుముద్దల్ని తినిపిస్తూ.. తృప్తి పొందేది
ఇక రెండు వారాలకోసారేనని...
నిదురమ్మ ఒడిలోకి జారుకునేందుకు
ముందుగా నా ఒడిలో నువు దూరిపోతే
చేతివేళ్లతో నీ తలను నిమురుతుంటే
కళ్లు ఇంతింతచేసి కబుర్లు చెబుతూ
హాయిగా నిద్దరోయే నీ నుదుటిపై
వెచ్చని ముద్దుపెట్టి మురిసిపోయేందుకు
రెండు వారాలు ఆగాలని....
రెండు వారాలు ఆగాలని బాధపడాలో
రెండు వారాలకైనా వస్తావని సంతోషించాలో
అర్థంకాని అయోమయం ఓవైపూ...
బ్రతుకుపోరులో ఉద్యోగం అనే ఆసరాతో
ప్రయోజకుడివై తిరిగొస్తావన్న ఆనందం మరోవైపూ...
ఇప్పుడు దూరమైనా, ఎప్పటికీ దగ్గరుంటావన్న
ఆశ అనే శ్వాసతో ఎదురుచూస్తూ ఓ అమ్మ.....!!!
కళ్లు తెరవగానే
అటు దేవుడినీ, ఇటు నన్నూ
మార్చి మార్చి చూసే చూపులు..
ఇక రెండు వారాలకోసారేనని........
దినపత్రిక కోసం అబ్బా కొడుకులిద్దరూ
తగవులాడుకుంటుంటే
ముసి ముసిగా నవ్వుతూ...
పిల్లాడితో పోటీ ఏంటని
పేపర్ లాక్కుని అబ్బాయికిచ్చేసే
రోజువారీ సంఘటన కోసం
ఇకపై రెండు వారాలు ఆగాలని......
అమ్మా... నాకివాళ ఈ టిఫిన్ చేసి పెట్టు
అలాగే లంచ్‌లోకి అంటూ...
లెక్కలేనని ఐటమ్స్ పేర్లు చెబుతుంటే,
కళ్లు తేలేస్తుండే నా అవస్థను చూసి,
చిలిపిగా నవ్వుతూ అల్లరి చేసే సన్నివేశాలు
ఇక రెండు వారాల విరామం తర్వాతేనని...
రోజూ కాలేజీకెళ్తూ..
వీధిమలుపు తిరిగేదాకా
ఆగకుండా టాటా చెప్పే చేతులు
మేడమెట్లు ఎక్కి, దిగేటప్పుడు
ఆసరాగా నిలిచే అవే చేతులు
పనిలో లీనమై ఉన్నప్పుడు
మెడచుట్టూ అల్లుకుపోయే
ఆ చేతుల స్పర్శ..
ఇక రెండు వారాలకోసారేనని
రాత్రి భోజనాల వేళప్పుడు
ఓవైపు టీవీ చూస్తూ...
మరోవైపు పుస్తకం చదువుతూ
ప్లేటులో ఏముందో చూడకుండా
గెలుకుతూ తింటుంటే..
ఇలాగయితే ఒంటికి ఎలా పడ్తుంది నాన్నా
అంటూ సుతిమెత్తగా మందలిస్తూ..
గోరుముద్దల్ని తినిపిస్తూ.. తృప్తి పొందేది
ఇక రెండు వారాలకోసారేనని...
నిదురమ్మ ఒడిలోకి జారుకునేందుకు
ముందుగా నా ఒడిలో నువు దూరిపోతే
చేతివేళ్లతో నీ తలను నిమురుతుంటే
కళ్లు ఇంతింతచేసి కబుర్లు చెబుతూ
హాయిగా నిద్దరోయే నీ నుదుటిపై
వెచ్చని ముద్దుపెట్టి మురిసిపోయేందుకు
రెండు వారాలు ఆగాలని....
రెండు వారాలు ఆగాలని బాధపడాలో
రెండు వారాలకైనా వస్తావని సంతోషించాలో
అర్థంకాని అయోమయం ఓవైపూ...
బ్రతుకుపోరులో ఉద్యోగం అనే ఆసరాతో
ప్రయోజకుడివై తిరిగొస్తావన్న ఆనందం మరోవైపూ...
ఇప్పుడు దూరమైనా, ఎప్పటికీ దగ్గరుంటావన్న
ఆశ అనే శ్వాసతో ఎదురుచూస్తూ ఓ అమ్మ.....!!!
(చదువులు పూర్తి చేసుకున్న పిల్లలు ఉద్యోగాల వేటలో కన్న తల్లిదండ్రులను, ఉన్న ఊరిని వదిలి మహానగరాలకు వెళ్లటం సర్వ సాధారణ విషయమే. అయితే అప్పటిదాకా తన కొంగు పట్టుకుని తిరుగాడిన పిల్లలు ఇలా ఒక్కసారిగా దూరమవటాన్ని జీర్ణించుకోవటం తల్లులకు కాస్త కష్టమైనపనే. అలా ఓ అమ్మ మనసులోకి తొంగిచూసే చిన్న ప్రయత్నమే ఇది...)
10 comments:
చాలా బావుందండి
నిజంగా ఎంత బాధగా ఉంటుందో
ప్రతి తల్లికీ బాధ తప్పదు
బ్రతుకు పోరాటంలో పిల్లలకీ వెళ్ళక తప్పదు
నా టపా మీకు నచ్చినందుకు సో మెనీ థ్యాంక్స్ లతగారూ....
శోభా రాజ్ గారూ !
అమ్మ మనసును ఎంత సున్నితంగా పట్టుకున్నారండీ!
మల్లీ రావూరి భరద్వాజ గారి తల్లిమనసును గుర్తుకు తెచ్చారు.హాట్స్ ఆఫ్ !!!!!!!
రెండు వారాలకొకసారి అంటుంటే, హాస్టల్‌కి వెళ్తున్నాడేమో అనుకున్న..ఉద్యోగానికా..ఓకె ఓకె.. :).
మీరు రెండువారాలకే అలా ఐపోతే.. కొంత మంది ఇక్కడ నెలలైనా సరే ఇండ్లకెళ్ళట్‌లేదు..వారి తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో పాపం..
మీ టపాల్లో ఏదో టచ్ ఉందండి.. keep writing..
@ సోమార్కగారూ..ధన్యవాదాలు సర్... మళ్లీ మల్లీ రావూరి భరద్వాజ గారి తల్లిమనసు గుర్తుతెచ్చానని మీరనటం నా అదృష్టం.. Thanks a lot sir....
@ గిరీష్‌గారూ మీరన్నది నిజమే.. ఉద్యోగాలు చేస్తున్న తమ పిల్లలు నెలలతరబడీ ఇంటిముఖం చూడటంలేదని నాకు పరిచయం ఉన్నవాళ్లు చాలామంది వాపోయారు. వాళ్లందరి ఆవేదనకూ అక్షర రూపమే నా ఈ కవిత..
నా ప్రతి పోస్టునూ తప్పకుండా చదివి, వెంటనే వ్యాఖ్య రూపంలో పలుకరించేవాళ్లలో ముందువరసలో మీరే ఉంటారు.. ధన్యవాదాలు.. కృతజ్ఞతలు... :)
చాలా చక్కగా ఉంది... ఈ కవితలో ప్రతి ఒక్కరూ తమ ఉనికిని గుర్తించగలరు.. అద్భుతం..!
Thank You Sree....... :)
శోభక్కా చాలా బాగా రాసారు అమ్మకబుర్లు...
అందరికీ రెక్కలు ఎగిరిపోడానికి ... కాని
అమ్మకి మాత్రం వెచ్చని వాత్సల్యాన్ని పంచడానికి!
తనని మరిచినా పైవాడు పట్టించుకోడు కానీ
తల్లిని మరిస్తే మాత్రం క్షమించడు... ఉపేక్షించడు!
-సత్య
సత్యా....
నీ ప్రతి కామెంట్ ఓ కవితలా ప్రాణం పోసుకుని ఏదో మెసేజ్‌ను నింపుకునే వస్తుంది... Thanks a lot Satya....... :)
Post a Comment