నేను భవిష్యత్తునెదుర్కొంటాను
అది నాకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది
నేను ఎదురుచూసినట్లుగా ఏమీ ఉండదు
నా కోసం ఏదీ ఎదురుచూస్తూ ఉండదు కూడా…
అలాంటప్పుడే నాదైన స్వప్నం
ఈ భూమ్మీదకు వాలిపోయింది
కాలం గడిచేకొద్దీ…
నావైన చిన్ని ప్రపంచాలు
కలలు, ఆశలు, ఆరాటాలు
అన్నీ అలా.. కొద్ది కొద్దిగా…
నాకు దూరంగా వెళ్లిపోయాయి
మళ్లీ ఆ రోజులకు వెళ్లలేను
ఇంకెప్పటికీ అవి తిరిగి రాలేవు
అయినప్పటికీ…
నాకు నేను ఎప్పుడూ పసిపాపనే...!!
10 comments:
కలలు, ఆశలు, ఆరాటాలు అన్నీ అలా ... కొద్ది కొద్దిగా … దూరంగా వెళ్లిపోయి ... కాలం గడిచేకొద్దీ … నావైన చిన్ని ప్రపంచాలు ... నాకు నేను పసి మనసుననే గుర్తుచేస్తున్నాయి ... !!
Thank You Sir...
shobhaa nijangaa chala inspring ga undi ippude dull ga unna nee kavith analo chala spandana kaliginchindi....love j
అవును శోభమ్మా ! నువ్వేప్పటికీ పసిపాపవే ! అలా అనుభూతి పొందగలగడం అదృష్టం.
జగతి అమ్మకు, ఎస్.ఆర్.రావు బాబాయ్‌కి ధన్యవాదాలు...
nice feeling...
చాలా బాగుంది శోభా..ఎప్పటికీ పసిపాపనే అనడం చాలా బాగుంది
పద్మార్పితగారూ.. జ్యోతక్కా.. మీ ఇద్దరికీ సో మెనీ థ్యాంక్స్...
సూపర్ అండీ..
నేను ఎదురు చూసినట్లుగా ఏమీ ఉండదు
నా కోసం ఏదీ ఎదురు చూస్తూ ఉండదు కదా..
True..
Thank You Very Much Girishgaaru...
Post a Comment