నా ఆలోచనలన్నీ
మనసు అనే విరిగిన ముక్కను
తీసుకొచ్చి చేతిలో పెట్టాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్యుడే మెల్లిగా కిందికి పడిపోతున్నట్లు…!
నా ఆలోచనలన్నీ
సంతోషం అనే కలకండ ముక్కను
తీసుకొచ్చి నోట్లో వేశాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
చంద్రుడే హాయిగా కిలకిలా నవ్వుతున్నట్లు…!
నా ఆలోచనలన్నీ
ఆశ అనే రేపటిని
తీసుకొచ్చి ముందు నిలిపాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్య, చంద్రులే పోటీ పడుతున్నట్లు…!
4 comments:
చాలా చాలా బాగుంది శోభ గారు:))
థాంక్యూ అపర్ణా... ఇన్ని రోజులు ఏమయ్యావు.. అస్సలు కనిపించటం లేదు...
చాలా బాగుంది మేడం...సూర్యుడు చంద్రుడు పోటీ పడ్డం...
ధన్యవాదాలు వర్మగారు..
Post a Comment