Pages

Wednesday 7 September 2011

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమి...?


ఇతరుల బాధలు చూసి తల్లడిల్లే
తనువంతా మనసున్న తల్లి
కారుణ్య రాతలతో మనసులోని
ఆర్ద్రత వ్యక్తపరచే అనురాగవల్లి

తండ్రి జ్ణాపకాలతో తరచి
తరచి
  అనుక్షణం పరితపిస్తూ
ఎదలోతుల్లోని భావాలను
ప్రసరింపచేసే మరుజాజిమల్లి

ఆబాలలోకాన్ని అనాదిగా ఆనందింపచేసే
చందమామ కబుర్లుతో
గడచిన బాల్యపు పొలిమేరలకు
పయనింపచేసే స్నేహశీలి

ఆర్తులకు అడగకపోయినా
తోడుగా నిలిచే కల్పవల్లి
అప్యాయతకు అనురాగానికి
శాశ్వత చిరునామా ఈ రంగవల్లి

గర్వంగా చెప్పుకుంటా ఈమె నాకు దేవుడిచ్చిన చెల్లి....!!

(నాపై ఉన్న అవ్యాజమైన ప్రేమను తన ప్రేమమయ మాటలతో అక్షరీకరించిన ఉదయ్ అన్నయ్యకు కృతజ్ఞతాభివందనాలు... మీ ప్రేమానురాగాల చిరుజల్లుల్లో తడిసిముద్దవుతూ, మురిసిపోతున్నా... మీ అక్షరాలను ఎప్పటికీ పదిలంగా దాచుకోవాలనే ఇలా బ్లాగులో పొందుపరుచుకుంటున్నాను అన్నయ్యా...)

5 comments:

సమీర said...

chaalaa baaga nachchindi ani inkaa pedda maatalatho cheppudaamante naaku maatalu dorakadm ledu. antagaa nachchindi. chaalaa chaalaa baagundi.

శోభ said...

Thanks a lot Sameera gaaru...

జాన్‌హైడ్ కనుమూరి said...

శోభ
ఉదయ్ కుమార్
అభినందనలు

Unknown said...

ఉదయ అన్నయ్య మీ గురించి చక్కగా చెప్పారు.
మీ ఆత్మీయత అంటే నాకు చాలా ఇష్టం.
మీ ప్రేమ పూర్వక పలకరింపు
నిజంగా మీరు నాకు దేవుడు ఇచ్చిన అక్కయ్య..
Love u Akka

శోభ said...

I too love You Sailu.. నా మనసుకు ఎంతగానో నచ్చిన చెల్లివి.. ప్రేమను పంచడానికి ఒకే రక్తం పంచుకోనక్కరలేదుకదా...

శైలు అని పేరు కనిపించగానే అంతే అక్కడే నిలబడిపోతాయి నా కళ్లు, టైం లేకపోయినా, ఎంత బిజీగా ఉన్నా సరే ఆ పోస్టు చదివేశాకే మరే పనైనా.. శైలు.. పేరు వింటేనే ఒక దగ్గరితనం...