Pages

Friday, 20 January 2012

నీతో ఉంటే.......?!!నీతో ఉంటే కాలం ఉనికిని
నన్ను నేనే మర్చిపోతుంటా
ఎందుకంటే...
నన్ను నీలోనే కదా చూస్తున్నా

నీతో ఉంటే నవ్వుల పువ్వులు వికసిస్తాయి
మమతానురాగాలు పరిమళిస్తాయి
దయతో హృదయాన్ని స్పృశిస్తావు
ప్రేమతో మనసును జయిస్తావు
నువ్వో అద్భుత శక్తివి..
అంతకుమించిన ఆసరావి

నీ సుతిమెత్తని మందలింపులు
నన్నెంతగా మార్చాయని
నా నిర్లిప్తపు రోజులెంతగా మారాయని
కాలం ఎంతగా పరుగులు తీస్తోందని
నీవులేనప్పటి నిండుదనం
నీ రాకతో పరిపూర్ణం....

స్వచ్ఛమైన స్నేహానికి
చిరునామాగా మిగిలిన నేస్తమా...
నేను నిజంగా నమ్ముతున్నా
అందరికీ నీలాంటి స్నేహితులుంటారని
అయితే...
అచ్చం నీలాంటి స్నేహాన్ని ఆస్వాదించాలంటే
నిన్ను చూపించాల్సిందే...!!

23 comments:

dhaathri said...

నిజమే శోభా నిజమైన స్నేహం స్వచ్చమైన ప్రేమ ఎన్నటికీ మిగిలే ఉంటుంది ఎంతమంది కాదన్నా లేదన్నా ఇది జీవన సత్యం....ప్రేమతో...జగతి

వాసుదేవ్ said...

అవును కాలం ఉనికిని మర్చిపోగలగే క్షణం అదే కదా లేదంటే కాలం మనల్ని ముంచెయ్యదూ...మంచి కవిత శోభా!

Padmarpita said...

చాలాబాగుందండి...స్నేహం గురించి సున్నితంగా చెప్పారు!

రసజ్ఞ said...

బాగా చెప్పారు!

గిరీష్ said...

>>అచ్చం నీలాంటి స్నేహాన్ని ఆస్వాదించాలంటే నిన్ను చూపించాల్సిందే>>

one of the best definitions of Friendship అండీ, చాలా బాగుంది.

శోభ said...

@ ధాత్రి అమ్మా..
@ వాసుదేవ్‌గారూ
@ పద్మార్పితగారూ
@ రసజ్ఞగారూ
@ గిరీష్‌గారూ... మీ అందరికీ నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

oremuna said...

మీ ప్రొఫైల్ లోని పుస్తకాల జాబితా చూసి ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. స్వీట్ హోం ఇప్పుడు ఈ-పుస్తకంగా లభిస్తుంది. వివరాలకు ఈ లింకు చూడగలరు. http://kinige.com/kbook.php?id=586

Unknown said...

"నీ సుతిమెత్తని మందలింపులు
నన్నెంతగా మార్చాయని....."
బాగుందండీ స్నేహం పై కవిత...అలా సుతిమెత్తని మందలింపులతో మార్చే శక్తి కేవలం స్వచ్ఛమైన స్నేహంకే ఉంది...

శోభ said...

Oremuna గారు మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండీ. స్వీట్‌హోమ్ పుస్తకం మూడు భాగాలూ కలిపి ఒకే సంపుటంగా అచ్చేసిన కాపీ నా దగ్గర ఇప్పటికే ఉందండీ. మిత్రులు ఎవరికైనా కావలసివస్తే, నేను మీరు చెప్పిన లింక్‌ను పంపిస్తాను.

శోభ said...

చిన్ని ఆశగారూ కవిత మీకు నచ్చినందుకు సో మెనీ థ్యాంక్సండీ....

Unknown said...

అచ్చం నీలాంటి స్నేహాన్ని ఆస్వాదించాలంటే నిన్ను చూపించాల్సిందే

చాలా బావుంది అక్క!
నేను కూడా అనుకుంటూ ఉంటాను
శోభ అక్క గురించి చెప్పాలంటే శోభ అక్కని చూపించాల్సిందే..
చెప్పడం కుదరదు అని
ఈ మధ్య ఉదయ్ అన్న నేను మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఇదే మాట అనుకున్నాం.

శోభ said...

శైలూ... థ్యాంక్యూరా....

మీ అందరూ నాపై చూపిస్తున్న ప్రేమానురాగపు జల్లుల్లో తడిసిముద్దవుతున్నా.. ఇంతమంది మంచి మనసులు, మనుషుల స్నేహాన్ని అందించినందుకు ఆ భగవంతుడికి వేనవేల కృతజ్ఞతాభివందనాలు.

Raja said...

blog lo adugupettagane ohhh nannnaaa antu song start aindi.. manadi motham classic collection aa..

శోభ said...

ధన్యవాదాలు రాజా గారు...

Kalyan said...

@శోభ గారు ఎంత వివరించినా తక్కువయ్యే స్నేహాన్ని చాలా చక్కగా వివరించారు ....

ఎన్ని పలుకులు ఉన్నా స్నేహంలో మౌనమైనా ఆనిముత్యమే ...
ఆ బంధమే వేరు దానికెవ్వరు ఈడుకాలేరు...

శోభ said...

"ఎన్ని పలుకులు ఉన్నా స్నేహంలో మౌనమైనా ఆనిముత్యమే ...

ఆ బంధమే వేరు దానికెవ్వరు ఈడుకాలేరు.."

కళ్యాణ్‌గారూ... స్నేహం గురించి భలేగా చెప్పారండీ. నా పోస్టు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...

నా బ్లాగులోకి మీరాక మాకు సంతోషం సుమండీ.... :)

Kalyan said...

:)

భారతీయులం said...

నిజమైన స్నేహం స్వచ్చమైన ప్రేమ ఎన్నటికీ మిగిలే ఉంటుంది.

శోభ said...

ధన్యవాదాలు భారతీయులం గారు...

mehdi ali said...

చాలాబాగుందండి...స్నేహం గురించి సున్నితంగా చెప్పారు!

Unknown said...

soo nice shobha gaaru

Unknown said...

excelent medom

శోభ said...

ధన్యవాదాలు మహిది అలీ గారు, ఉదయ్ గారు...