Pages

Wednesday, 16 October 2013

నీ నవ్వు...!!


నవ్వాలి నవ్వాలి
నీలా నవ్వాలి
అచ్చం నీలాగే నవ్వాలి
నీ అంత స్వచ్ఛంగా
నీ అంత అందంగా
నీ అంత నిర్మలంగా
మొత్తంగా నీలా మారిపోయి
నవ్వాలి... నవ్వుతూనే ఉండాలి

నేనూ..
ఎప్పుడో ఇలా నవ్వినట్టు గుర్తు
మళ్లీ ఇన్నాళ్లకి నీ నవ్వులు
మర్చిపోయిన నా నవ్వుల్ని
ఉబికి వస్తున్న ఊటలా
వెలికితెస్తున్నాయి

నిజం చెప్పనా...
అచ్చం నీలాగే నవ్వేందుకు
ప్రయత్నిస్తున్నా
మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ
ఓడిపోతూనే ఉన్నా
ఎంత ప్రయత్నించినా
నీ నవ్వులోని స్వచ్ఛత
నా నవ్వుకి రాలేదెందుకో...?!


6 comments:

Unknown said...

నైస్ శోభా....మన నవ్వులకా స్వచ్ఛతలు రావు... మన నవ్వులకు వయసొచ్చిందిగా....స్వచ్ఛత చాటుకు పోతుంది...

vemulachandra said...

నీలాగా నవ్వాలి స్వచ్చంగా, అందంగా, నిర్మలంగా ....
కానీ నవ్వలేకపోతున్నా!
ఎంత ప్రయత్నించినా నీ నవ్వులోని స్వచ్చత నా నవ్వుకు రావటం లేదు.
నిజం శోభమ్మా! .... ఆ పసి నవ్వుల్లో ధైవత్వం ఉంది.
అభినందనలు నీ నవ్వు నిర్మలత్వానికి

శోభ said...

@ పద్మక్కా...

మీరు చెప్పింది నిజమే.. మన నవ్వులకు వయసొచ్చింది.. స్వచ్ఛత ఏ చాటుకో పోతోంది.. థ్యాంక్యూ

శోభ said...

ధన్యవాదాలు వేములపల్లివారూ....

పసినవ్వుల్లోని దైవత్వానికి వారి నిర్మలత్వానికి మీ అభినందనల స్వచ్ఛతకు ధన్యవాదాలు

Karunya said...

స్వచ్చమైన నవ్వుకోసం మరల పుట్టాలేమో..

Vijaya Ramireddy said...

సాంఘిక ప్రజ్ఞ కు ఇంకా అలవరచు కోలేని పడని నవ్వులవి