skip to main |
skip to sidebar
ఎన్నింటినో మురిపిస్తుంది
మరెన్నింటినో మరిపిస్తుంది
దూరాల్ని చెరిపేస్తుంది
తేడాల్ని చూపెడుతుంది
నిజాల్ని నిందిస్తుంది
అబద్ధాల్ని అందలం ఎక్కిస్తుంది
మోసాల్ని శాశ్వతం చేసేస్తుంది
సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
ఆశల అందలం ఎక్కిస్తుంది
దభాల్న కిందికి తోసేస్తుంది
ఓ "కాలమా"
ఎందుకు నీకు అంత "కసి"...???
6 comments:
అప్పుడే .... ఆశల అందలం ఎక్కిస్తావు, దభాల్న కిందికి తోస్తావు.
ఓ "కాలమా"
ఎందుకు నీకు అంత "కసి"....???
ఆ సమాధానం లోనే జీవితం అర్ధం ఉంది. వెదుక్కొమని అర్ధం.
అభినందనలు శోభారాజశేఖర్!
ఆ సమాధానంలోనే జీవితం అర్థం ఉంది వెదుక్కోమని... చక్కని విశ్లేషణ వేములపల్లివారూ... ధన్యవాదాలు
Very niccce..very very niiicccee:-):-)
kaalam = maayaajaalam
నిజమే శోభ కరుణ లేని కాలంతో పోటీ పడి సాగటమే మనుగడ కదా.
'కాలం' అనుభవాల నిగంటువు అందులో ప్రతి పేజీ లో ఒక్కో అనుభవ జ్ఞానం పొందుపరచబడి ఆత్మోన్నతి కొరకు పాటుపడుతుంది . అందుకే కాలం కటువుగా కనిపించే కారుణ్య గురువు.
సూపర్ గా రాసారు శోభా ...... గారు 😊😊😊
Post a Comment