అనుకోకుండా ఎదురుపడ్డావ్
కళ్లముందు మసక చీకటి
అంతా అస్పష్టం
ఆకారాలకా.. మనసులకా
నిర్లిప్తపు పెదవులపై
ప్రాణంలేని నవ్వొకటి విసిరి
నిశ్శబ్దపు అడుగులతో
వర్తమానపు దారిలో
అటునువ్వు ఇటునేను
ఎప్పుడో పుష్కరం క్రితం
పెద్దరికపు ఆంక్షలకి
తెగిపడిన ఆశల శకలాల్ని
పైపైన వదల్చుకుంటూ
లోలోన గుండెనిండా మోసుకెళ్తూ
జ్ఞాపకాల్ని గాలి తెరల్లోనూ
అనుభూతుల్ని కన్నీటి పొరల్లోనూ
బంధించేసి...
మౌనంగా రోదిస్తూ
మనసుని దహిస్తూ
మిగిలిన బూడిద కుప్పని
ఒంటినిండా పులుముకుని
గంభీరంగా, గుంభనంగా
సాగుతున్నాం
పాయలుగా చీలిపోయి...
9 comments:
"అంతా అస్పష్టం!
ఆకారాలకా .... మనసులకా?
ఆ నిర్లిప్తపు పెదవులపై ప్రాణం లేని నవ్వు .....
పెద్దరికపు ఆక్షలకి తెగిపడిన ఆశల శకలాల్ని మోసుకెళ్తూ,
మిగుల్చుకున్న బూడిద ను ఒంటినిండా పులుముకుని ....
సాగుతున్నాం పాయలుగా చీలిపోయి"
మనిషి జీవితంలో సాహచర్యం ప్రాముఖ్యతను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ .... ఒక మంచి కవిత
అభినందనలు శొభా రాజశేఖర్!
excellent feeling !!yinthakanna yemcheppalo....naku theliyaka....
వేములపల్లివారూ మీ ఆత్మీయ స్పందనకు కృతజ్ఞతలు
దేవిగారూ.. ధ్యాంక్యూ సోమచ్ అండి
Shobha gaaru... Heart touching poetry.... Suppperrro suppppeerrr..:-):-):-)
Boledanni thankulu Karthik gaaru :-)
chaala bagundi....
Thanks Abhi..
ఇలా పాయలుగా చీలిపోయి లోపల బడబాగ్ని లావాతో , పైకి మంచు కట్టుతో ప్రవహిస్తున్న మానస సరోవరాలెన్నో ఈ ధరిత్రి పైన
Post a Comment