Pages

Thursday 14 November 2013

తంగేడు పువ్వులు గుర్తొచ్చీ...!!



తంగేడు పువ్వుల గుత్తులతో ఆటలు
బంకమట్టితో చేసిన బుల్లి బుల్లి పాత్రల్లో వంటలు
సీతాఫలం చెట్లలో దాగుడుమూతలు
కానుగ చెట్లపై కోతి కొమ్మచ్చి గెంతులు
రేణిగాయలు పులుపులు
యలక్కాయ వెగటులు
ఉలింజకాయల తీపి వగరులు
మర్రిచెట్టు ఊయలలు
చింత చిగురు కష్టాలు
నేరేడుపండ్ల గుర్తులు
తాటికాయల కమ్మటి వాసనలు
పనసకాయల దొంగతనాలు
మామిడి తోటలపై మూకుమ్మడి దాడులు
యేటి నీళ్లలో జలకాలు
అమ్మ చీర చెంగుతో చేపలు పట్టడాలు
వెన్నెల రాత్రుల్లో ఆటలు

తిరిగిరాని పసితనానికి ఎన్ని తీపి జ్ఞాపకాలో...
తంగేడుపువ్వులు గుర్తురాగానే ఏవేవో గుర్తుకొచ్చి ఇలా....



11 comments:

Anonymous said...

చాలా బాగుంది మీ పోస్ట్,

ఇక్కడ అప్రస్తుతమనే అనుకుంటాను, అయితే తంగేడు చెట్ల గురించి నా చిన్నప్పటి అనుభవం గుర్తొచ్చింది... ఈ ఆకును పశువుల కింద వేస్తారు, అది ఎరువు దిబ్బలో మరిగితే పొలానికి బాగా సత్తువ అని, రోజూ మా పిల్ల గాల్లను పంపించి ఆకు కోసకరామని చెప్పే వారు పెద్దోళ్ళు :)

ఇంకా ఏదో పండుగ కుడా చేస్తారు ఈ తంగేడు పువ్వులతో మాత్రమె, ఆడ పిల్లలు మాత్రమే పాటిస్పేట్ చేయాలని అనేవారు, (గౌరమ్మ పండుగ అనుకుంటా (?)))

వర్షం పడేతపుడు, పిడుగులు పడ్డపుడు ఎక్కువగా తంగేడు చెట్ల మీద పడేవి, రీసన్ ఏంటో తెలీదు కానీ, కనుక్కోవాలని కుతూహలం గా వుంది..

సెన్సిబుల్ గా వున్నా మీ ఈ పోస్ట్ లో ఈ సోది అంతా రాసినందుకు చింతిస్తూనే ముగిస్తున్నాను.

థాంక్ యు శోభ గారు :-)

Anonymous said...

పాపచ్చి కాయలు తినే వుంటారు కదా (వాటిని మీ ప్రాంతం లో ఏమంటారో మరి, ఆంగ్లం లో ఏమంటారో కుడా గుర్తు రావడం లేదు.. వాటి చుట్టూ ముళ్ళు వుంటాయి, అవి ఎర్రగా వుంటాయి), ఆ ముళ్ళు అన్నీ నాలుక మీద గుచ్చుకొని ఆ నవ్వతో ఒక రకమైన ఆనందాన్ని ఆస్వాదిస్తూ, నోటిని పింక్ కలర్ లో మార్చుకొని, ఎవరి నోరు ఎక్కువ ఎర్రగా వుందో పోటీలు పెట్టుకోవడం,

మేడి చెట్లు ఎక్కి, కాయలు కోయకుండానే చెట్టు నుంచి జారి పడ్డపుడు, మిత్రులు నవ్వుతుంటే వచ్చే బాధతో కూడిన ఇరిటేషన్,

తేనె పెట్టెలు దులుపుతూ వాటితో కుట్టించుకోని వాసిన పెదాలు,
వాగులు వంకల్లో ఈత పోటీలు,
ఎనుముల మీద సవారీ,

ఎన్నెన్నో ఆనందాలు, ఎన్నెన్నో గురుతులు :)
(పై అజ్ఞాత నే, శోభ గారు :)

శోభ said...

:) ఎప్పుడు అడిగినా మీరెవరో పేరు చెప్పరుగానీ ఇప్పుడు కూడా అడగకుండా అజ్ఞాతగానే సంబోధిస్తున్నాను..

మీ బాల్య అనుభవాల స్పందనకు ధన్యవాదాలు అజ్ఞాతగారూ..

తంగేడు ఆకును పశువుల కింద వేయటం, దిబ్బలోవేసి ఎరువును పొలాలకు వాడటం మావైపు కూడా చేస్తారు.

తంగేడు పువ్వులతో గౌరమ్మ పండుగ చేస్తారు. చిన్నప్పుడు ఆడపిల్లలందరం చెరువులోని బంకమట్టితో గౌరమ్మను తయారు చేసి, తంగేడుపువ్వులతో అలంకరించి ఇంటింటికివెళ్లి గౌరమ్మ పాటలు పాడుతూ డబ్బులు, ధాన్యం వసూలు చేసేవాళ్లం... ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు మీకు థ్యాంక్యూ... :)

వర్షం పడేటప్పుడు, పిడుగులు పడేటప్పుడు తంగేడు చెట్ల మీద పడేందుకు కారణం తెలీదు.. ఈ విషయం ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు కూడా.. మీరు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది.

సోది ఏం కాదు.. మంచి జ్ఞాపకాల్ని గుర్తుచేశారు.. అందుకు నేనే మీకు కృతజ్ఞురాల్ని.

శోభ said...

పాపచ్చికాయల్ని మావైపు నాగదారి కాయలు అంటారండీ.. మీరు చెప్పిన అనుభవాలన్నీ మాకూ ఉన్నవే... కానీ ఆ ముళ్లు ఇరుక్కుపోతే భలే నరకంలెండి.. అయినా అప్పట్లో అదో ఆనందం.

మీ బాల్య జ్ఞాపకాలు చాలావరకు మాకూ ఉన్నవే... నిజ్జంగానే ఎన్నెన్నో ఆనందాలు, ఎన్నెన్నో తీపిగుర్తులు.. తిరిగిరానివి.. మాసిపోనివి... :)

HVM - హర్ష వీక్షణం said...

నేనేనండీ :)

Meraj Fathima said...

శోభా చాలా కాలానికి దొరికారు, మీ బ్లాగ్ పేరు మరచిపోయి, మిమ్మల్ని పట్టుకోలేకపోయాను. మీ శైలి నాకు చాలా ఇష్టం. ఒకసారి నా బ్లాగ్ కూడా చూడండి.

శోభ said...

మేరాజ్ అక్కా...

నిజమే చాలా రోజులైంది మీతో మాట్లాడి.. ఎలా ఉన్నారు.. నా శైలి మీకు నచ్చినందుకు ధన్యురాల్ని. తప్పకుండా మీ బ్లాగ్ చూస్తాను..థ్యాంక్యూ

శోభ said...

అజ్ఞాత గారు ఇలా ముందుకొచ్చారన్నమాట... థ్యాంక్యూ @ హర్ష గారు...

Vijaya Ramireddy said...

తిరిగిరాని పసితనం లోని తీపి జ్ఞాపకాలను ఇలా మీరు గుర్తుచేసి , మధురమైన అనుభూతులను మల్లి పంచారు మీరు.

శోభ said...

హర్ష గారూ... ఎలా ఉన్నారు
ఈ మధ్య బ్లాగు పోస్టులు చదువుతుంటే బోలెడన్ని కామెంట్లలో మీరు అనానిమస్ గా కనిపించేవారు. ఈ పోస్టులో మీరెవరో చెప్పేశారు. చూడగానే అప్పట్లో సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ చదువుతుంటే మీరు గుర్తొచ్చి చాలా ఆనందంగా ఉంది. బావున్నారని తలుస్తున్నాను.

శోభ said...

థ్యాంక్యూ సర్