Pages

Thursday, 2 January 2014

తను…!!


విహంగ మహిళా సాహిత్య పత్రికలో వచ్చిన నా తొలి కవిత (అలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా తొలి కవిత)ను బ్లాగ్ నేస్తాలతో కూడా పంచుకుందామనీ.. :)


ముద్దుగా బొద్దుగా... నేను
ఎర్రగా పీలగా... తను

హుందాగా ముందు బెంచీలో... నేను
పక్కనే కాస్త దూరంగా... తను

నీ పేరేంటి కళ్లతో ప్రశ్నిస్తూ... నేను
మీతో మాట్లాడొద్దట కదా... తను

ఏం ఎందుకనీ కోపంగా... నేను
ఏమో మా అమ్మ చెప్పిందిలే... తను

కొన్నాళ్లకి…….

ఏయ్… నాక్కూడా కాస్త మిగల్చవే... నేను
నా బాక్స్ ఉందిగా తినవే... తను

నాతో మాట్లాడకు మీ అమ్మ తిడుతుంది... నేను
నాతో మాట్లాడకపోతే నేను తిడతాను... తను

ఇంతకీ మీ అమ్మ ఏం చెప్పిందేంటి... నేను
మీరు తక్కువ కులమోళ్లట కదా… తను

అట్లయితే నా బువ్వ కూడా తినేస్తున్నావేం
అయితేనేం… నువ్వు నా “ఫ్రెండ్‌”వి కదా…!!


12 comments:

Meraj Fathima said...

మా శోభమ్మది కదా ఎప్పుడో చదివేసా.

శోభ said...

థ్యాంక్యూ అక్కా... :)

Priya said...

Simply superb, Shobha gaaru :) :)

Unknown said...

Chala bagundi

శోభ said...

ధన్యవాదాలు ప్రియా...

శోభ said...

థ్యాంక్యూ సో మచ్ శ్రీనిధి గారు

lakshmi yalamanchili said...

సింప్లీ సూపర్బ్

శోభ said...

ధన్యవాదాలు లక్ష్మిగారు

pavan said...

Simple but amazing...:)

శోభ said...

Thq Pavan.. :-)

Karunya said...

ఎంత ముచ్చటగా ఉందో శోభ.

Vijaya Ramireddy said...

'తారతమ్యాల వ్రేళ్ళను', నిలువు పెకలించి వేసింది ; ఈ స్నేహ పాశమే... సమాజం లో ...
ఎంతో సరళంగా స్నేహ బంధాన్ని చెప్పారు శోభా గారు .