ఒంటరి ఆకాశంలో
చీకటినిండిన మబ్బుతునకనై
ఓసారి
ఆశల వాకిట వేలాడుతూ
వేకువ తెచ్చే వెల్తురు పిట్టనై
మరోసారి
ఎదలో జ్ఞాపకాల కల్లాపిజల్లి
కిలాకిలా నవ్వుల ముగ్గులెడుతూ
ఇంకోసారి
దిగులు కొండలు గాలి బుడగలై
పగిలినప్పుడు
మంచు గొడుగులు కన్నీరై
కురిసినప్పుడు
నేను నానీడా తోడుగా
ఒంటరిగా ఏకాంతంగా
చాలాసార్లు............. !!!
10 comments:
adhbhutham chala bagundhandi.....ee kavitha chaduvuthuntey evo gnapakalu tharumuthunnayi :(
శోభా..,చాలా మంచి కవిత సున్నిత మైన భావాలు,
అందమైన పదాల అల్లిక
అక్కా... నీవన్నీ చాలా లోతుమాటలు
మంచు గొడుగు కింద ఉన్నావంటే
ఎప్పటికైనా తడవక తప్పదు..
నీ నీడ నీతోడు ఉందంటే ఏకాంతంలో ఉన్నట్టే .
ఎందుకంటే ఒంటరితనం లో ఆ నీడ కుడా వదిలేసెళ్తుంది
@ ధన్యవాదాలు కుమార్ గారు
@ థ్యాంక్యూ సో మచ్ మేరాజ్ ఫాతిమా అక్కా... నేను ఏం రాసిన మొదట మీ కామెంట్ వచ్చేస్తూ.. వెన్నుతడుతూ.. ప్రోత్సహిస్తూ ఉంటుంది.. మీ వాత్సల్యానికి వందనాలు..
@ సత్యా... హ్మ్.... లోతైన మాటలు... ఒంటరితనంలో నీడ కూడా వదిలేసేళ్తుంది... నిజమే కదా.. థ్యాంక్యూ
నేరుగా గుండెలను హత్తుకున్నయ్ అమ్మా ఈ అక్షరాలు
Gundelalu hattukunnay Amma ee aksharaalu
ధన్యవాదాలు వంశీ
అద్భుతంగా ఉంది. నిద్రాణమైన బాధని మంచుగొడుగు తో పోల్చినవైనం.
మంచుగొడుగు పద ప్రయోగం అద్బుతం శోభ.
దిగులు కొండలు గాలి బుడగలై
పగిలినప్పుడు
మంచు గొడుగులు కన్నీరై
కురిసినప్పుడు
నేను నానీడా తోడుగా
ఒంటరిగా ఏకాంతంగా
చాలాసార్లు............. !!!
Post a Comment