Pages

Tuesday, 31 October 2017

కొన్ని ఇంతే...!!


కొన్ని సమయాలు ఇంతే...
కళ్లు మూసి తెరిచేలోగా గడిచిపోతుంటాయి

కొన్ని వ్యాపకాలు ఇంతే...
కష్టమైనా ఇష్టంగా చేయాలనిపించేలా ఉంటాయి

కొన్ని ఇష్టాలు ఇంతే...
ఎంత తరిగినా పెరుగుతూనే ఉంటాయి

కొన్ని జ్ఞాపకాలు ఇంతే...
తవ్వే కొద్దీ ఏటి చెలిమలా ఊరుతూనే ఉంటాయి

కొన్ని నిజాలు ఇంతే...
నిష్టూరమైనా చెప్పక తప్పవంటుంటాయి

కొన్ని జీవితాలు ఇంతే...
నిరీక్షణలోనే కాలాన్ని వెళ్లదీస్తుంటాయి

11 comments:

mehdi ali said...

సూపర్బ్ అండి

శోభ said...

ధన్యవాదాలు సర్.. నా బ్లాగ్ లోకి మీ రాకకు సంతోషంగా ఉంది. థ్యాంక్యూ సర్..

Unknown said...

Chaala baagundhi Amma kavitha

శోభ said...

థ్యాంక్యూ వంశీ

గిరీష్ said...

కొన్ని పరిచయాలు కూడా అంతే.. అలా గుర్తుండిపోతాయి.

మీరు శుభం అని తలుస్తాను శోభ గారు...బాగున్నారు కదూ :)

శోభ said...

Nijam.. konni parichayalu kooda anthe gurthunda potaayi eppatiki...

Nenu chaala bagunnanu.. meeru baagunnarani thalusthanu Girish gaaruu..

Chaalaa rojulaki meeraaka naa blaagintiki... Chaala santhosham.. 🙂🙂

శోభ said...

థ్యాంక్యూ శ్యామ్ గారు..

Vijaya Ramireddy said...

కొన్ని వ్యాపకాలు ఇంతే ...
కష్టమైన ఇష్టంగా చేయాలనిపించేలా ఉంటాయి ... మిరే అన్నారు గా ...
అందుకే మీరు అక్షర మాలికలను అందిస్తున్నారు అందరికి... శోభా గారు

Anonymous said...

Simple and deep

శోభ said...

thankyou andi

శోభ said...

thankyou Sir