ఎందుకో మనసంతా శూన్యం
ఓ మూలగా నా సీటు, నేనూ
ఒకటే దిగులు.. విచారం..
ఎంత ఆలోచించినా అంతుబట్టదే
ఏమయ్యింది నాకు
ఎందుకీ నిర్లిప్తత
దేనికోసం ఆరాటం
కాసేపటికిగానీ బోధపడలేదు
అప్పటిదాకా నాతోనే ఉన్న
నా ఊపిరి కాస్తా...
అలా నడుచుకుంటూ..
మళ్లీ వస్తానంటూ
మాయమైపోయింది...
ఊపిరితో పాటు, మనసు కూడా
నవ్వుతూ తనవెంటే వెళ్లిపోయింది
నన్నొదిలేసి వెళ్లినందుకు
దానికీ దిగులేసిందే ఏమో..
మళ్లీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది
చూద్దును కదా
పగలబడి నవ్వుతోంది
దిగులేసి వచ్చేశాను కానీ,
మళ్లీ వెళ్లక తప్పదు
రాకా తప్పదంది
తాను మళ్లీ రాకపోతే
ఈ ప్రాణం నిలవదని
దానికి మాత్రమే తెలుసు మరి...!
అందుకేనేమో...
కాసేపటి ముందున్న నల్లటి మేఘాలు
సంతోషపు జల్లులై
నన్ను నిలువెల్లా తడిపేస్తున్నాయి.......!!!!!
9 comments:
baavundi chaalaa
బాగుంది శోభారాజ్ గారు.
@ మంజుగారూ, శ్రీకాంత్‌గారూ ధన్యవాదాలండీ...
baavundi
థ్యాంక్ యు వెరీమచ్ భానుగారూ...
చాలా బాగుందండి.
నానిగారూ ధన్యవాదాలండీ..
శోభ గారు,
మీ బ్లాగుకు రావడం ఇదే మొదటి సారి. కొన్ని టపాలు చదివాను. ఇంకా చదవాల్సినవి బోలెడున్నాయి. రాస్తున్న శైలి చాలా బాగుంది!
ప్రణవ్‌గారూ ధన్యవాదాలండీ..
Post a Comment