Pages

Thursday, 6 January 2011

ఓ అబద్ధం.. మరో జ్ఞాపకం...!!

అటుచూడు…
ఓ అందమైన అబద్ధం
రెండు చేతులనూ
గుండెలపై వేసుకుని మరీ
నిత్య నూతనమైన విశ్రాంతితో
నిద్రపోతున్నట్లుగా కనిపిస్తోంది

ఇటుచూడు…
ఓ మరపురాని జ్ఞాపకం
ముసిముసి నవ్వులను
పెదవులపై పూయిస్తూ…
జ్ఞాపకాల తీరానికి
పదే పదే తీసుకెళ్తూ...
గుండెగదిలో సవ్వడి చేస్తూ
గిలిగింతలు పెడుతోంది…!

2 comments:

Ennela said...

shobhaa gaaru, bhale baagundandee mee blaagu..yee bommalannee yekkadivandee..yenta muddugaa unnaayo! excellent narration..

శోభ said...

ధన్యవాదాలు ఎన్నెలగారూ.. నేను ఇవ్వాళే మీ బ్లాగు చూశా. కాస్త టైం దొరకబుచ్చుకుని మీ టపాలు చదువుతాను. ముందుగా ఓ స్త్రీ రేపురా టపా చదివాను. భలే సరదాగా సాగింది. చిన్నప్పుడు నాకు కూడా అలాంటి అనుభవాలు బోలెడు. చదువుతుంటే ప్రతి సంఘటనా మా ఊర్లో జరిగినట్లుగానే ఉంది.

ఇక నా బ్లాగులో ఫొటోల సంగతికొస్తే... గూగుల్‌లో వెదుకుతుంటే, అనుకోకుండా ఓ సైట్లో కొన్ని ఫొటోలు దొరికాయి. వాటినే నా పోస్టుల్లో సందర్భానుసారంగా వాడుకుంటున్నానంతే.. హమ్మయ్య ఓ రహస్యం మీకు చెప్పేశా.. మరెవరికీ చెప్పకండే.. :)