Pages

Tuesday, 4 January 2011

నా పాప కోసం...!!

ఇంకా పుట్టని నా పాప కోసం
ఆశల సౌధాలెన్నింటినో కట్టేశా...


బుల్లి బుల్లి చేతులతో
బోసినవ్వులు రువ్వుతుండే
బొమ్మలాంటి బుజ్జాయిని
పాలబుగ్గల పసిపాపాయిని
తనివితీరా ముద్దాడాలని
లాలిపాడుతూ జోకొట్టాలని...


చందమామను చూపిస్తూ
గోరుముద్దలు తినిపించాలని 

వచ్చీరాని మాటలతో
చిలుక పలుకలు పలుకుతుంటే
పగలబడి నవ్వాలనీ
తప్పటడుగులు వేస్తూ
నడక నేర్చుకుంటుంటే
దగ్గరుండి దారి చూపించాలనీ...


జీవితం ప్రతి దశలోనూ
చుక్కానినై నడిపించాలనీ
అచ్చం అమ్మలాగున్నావే తల్లీ
అని అందరూ అంటుంటే
మురిసి మైమరచి పోవాలనీ
ఎన్నో, ఎన్నెన్నో ఆశలు...


కానీ,
నా పాప చేసుకున్న పుణ్యమో
ఆ దేవుడు ఇచ్చిన వరమో...
తాను పుట్టకుండానే బ్రతికిపోయింది
                                                                                                       నా పొట్టలో పుట్టనందుకు కాదు..
                                                                                                       ఈ పాడులోకంలోకి రానందుకు....!!!

16 comments:

Ashok said...

papa puutladane anduku anandam???

www.appudreams.blogspot.com

మనసు పలికే said...

నో కమెంట్స్...:( కవిత మాత్రం చాలా చాలా బాగుంది శోభ గారు..

శోభ said...

అశోక్‌గారూ.. అపర్ణగారూ.. సో మెనీ థ్యాంక్స్ అండీ..

మధురవాణి said...

very touching!
మీ బ్లాగ్ టెంప్లేట్ చాలా బాగుంది. :)

MSR said...

ఈ పాడులోకంలోకి రానందుకు ఆ బిడ్డ అదృష్టవంతురాలే...
కానీ అంత మంచి తల్లి ప్రేమను పొందలేని దురదృష్టవంతురాలే కదా...
కవితలో కొంత కాంట్రడిక్షన్ ఉన్నట్టుంది కదూ...
ఎందుకో అలా అనిపించింది, నేనూ పెద్దగా విశ్లేషించలేను!

శోభ said...

మధురవాణిగారూ... ధన్యవాదాలండీ..
ఇక నా బ్లాగు టెంప్లెట్ నచ్చినందుకు అందుకోండి నా నవ్వులు... :) :) :)

MSR‌ గారూ.. మీరన్నది నిజమే.. ఇంతకంటే మీకు వివరణ ఇవ్వలేను. Sorry..

వేణూశ్రీకాంత్ said...

కవిత చాలా బాగుందండి... ఫోటో మరీ బాగుంది చూపు తిప్పుకోనివ్వలేదు..

శోభ said...

Thanks Venugaaru.. Googleలో వెదుకుతుంటే ఆ ఫొటో లక్కీగా దొరికింది. :)

జయ said...

కవిత బాగుంది. కాని కవిత లోని వ్యధ కదిలించింది.

శోభ said...

జయగారూ.. ధన్యవాదాలండీ..

గిరీష్ said...

nice poem

శోభ said...

ధన్యవాదాలు గిరీష్‌గారూ..

జ్యోతిర్మయి said...

శోభ గారూ మీ కవితలన్నీ చాలా బావున్నాయి.

శోభ said...

Thanks a lot Jyothimayi gaaru...

రసజ్ఞ said...

భావ వ్యక్తీకరణ, ఆ పదజాలం అనిటితో కూడిన మీ కవిత చాలా చాలా బాగుందండీ! ఇది(మీరు పెట్టిన చిత్రం) ఒక painting కదూ!

శోభ said...

ధన్యవాదాలు రసజ్ఞగారు.. ఈ కవితలోని బొమ్మ పెయింటింగేనండీ. గూగుల్లో వెతుకుతుంటే దొరికింది.