Pages

Monday 14 February 2011

ప్రేమ "ఒక్క" రోజేనా....???!!!


"ప్రేమ" కొన్నిసార్లు కొత్తగా
మరికొన్నిసార్లు తాజాగా
చాలాసార్లు సంతోషంగా
ఉన్నచోట ఉండనీయకుండా
ఊపిరి సలపనీయకుండా
ఉక్కిరి బిక్కిరి చేస్తుంది...

ప్రేమ చిగురించిన తొలినాళ్లలోనో
కొత్త దంపతుల సరాగాల్లోనో
ఇవన్నీ మామూలే...

అంటే...
ప్రేమించిన మొదట్లోనో..
పెళ్లయిన కొత్తల్లోనో
ప్రేమ ఉంటే సరిపోతుందా...
మరి జీవితమంతా ఏముండాలి...?

అసలు ప్రేమించడానికి తీరికెక్కడిది?
బరువులు, బాధ్యతలు,
కష్టాలు, కడగండ్లు,
అప్పులు, అగచాట్లు
ఇన్నింటితో వేగుతుంటే...
మళ్లీ ప్రేమంటారేంటి?

అవన్నీ ఉంటే.. ప్రేమించకూడదా ఏం?
ఎలా కుదురుతుంది?
ఎందుకు కుదరదు?

అలసిన మోముతో
భారంగా అడుగులేసుకుంటూ
ఇంటికి చేరిన అతనికి
చిరునవ్వుతో స్వాగతం చెబుతూ
ఆప్యాయంగా చుట్టుకోవటం "ప్రేమ" కాదా?
దీన్ని "ప్రేమ" అనకూడదా?

"ప్రేమ"గా చెంత చేరి
నుదుటపై చెమటను తుడుస్తూ
బాగా అలసిపోయారా అన్నట్టు
కళ్లతోనే పరామర్శిస్తున్న ఆమెను
ఇంటిపనితో నువ్వూ అలసిపోయావుగా?
అంటూ కళ్లతోనే బదులిస్తూ..
ఊరడించటం "ప్రేమ" కాదా?
దీన్ని "ప్రేమ" అనకూడదా?

ఈ మాత్రం "ప్రేమ"ను కురిపించేందుకు
తీరుబాటు కావాలా?
ప్రత్యేకమైన రోజులు కావాలా?
"ప్రేమ" అనేది ఏ ఒక్కరోజులోనో పుట్టి
మరొక్క రోజులోనో అంతమయితే చాలా..?
జీవితమంతా ఉండక్కరలేదా?

ఇగోలను పక్కకు నెట్టి
ఒకరినొకరు అర్థం చేసుకుని
సాగిపోవటమే నిజమైన "ప్రేమ"
కానీ.. ఈ రోజుల్లో ఎంతమందికి
అది సాధ్యమవుతోందో...
ఆ దేవుడికే ఎరుక..........!!!

13 comments:

గిరీష్ said...

The first enemy to love is ego as u said..nice

శోభ said...

Thank u Girish Gaaru...

MANZOOOOOOO said...

chaala baagundi..!

MANZOOOOOOO said...

prema ane padaaniki arthame lekundaa pothunna ee rojulloo....prema gurinchi prema kunna badhyathanu gurinchi chaala baaga chepparu.

శోభ said...

Thank u Very Much Manjugaaru...

మనసు పలికే said...

ఎలా కుదురుతుంది..?
ఎందుకు కుదరదు..?
చాలా బాగా చెప్పారు శోభ గారు. నిజమే ఇగోలు పక్కన పెడితేనే ప్రేమని ఆస్వాదించగలం:)

శోభ said...

ధన్యవాదాలు అపర్ణా...

దంపతుల మధ్య లేదా ప్రేమికుల మధ్య అంతరాలకు ముఖ్యంగా ఇగోలే కారణం. ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటుకు కారకులైనవాళ్ళు అవతలివాళ్ళకు సారీ చెప్పేందుకు ముందుగా అడ్డొచ్చేది ఈ అహమే.

నేనే ఎందుకు చెప్పాలి అని ఒకరు, తనే ఎందుకు చెప్పకూడదని ఇంకొకరు... ఈ అహాన్ని తీసి గట్టున పెట్టేసేవాళ్ల జీవితాలు ఆనందమవుతాయి...

veera murthy (satya) said...

kaarunya garu namaste!

కవితా పోటీకి ఆహ్వానం

http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html

-satya

Anonymous said...

man that was a good one..really

Vinay Datta said...
This comment has been removed by a blog administrator.
గిరీష్ said...

karunya garu,
yemaipoyaru meeru..y u r not posting the new ones..
i am big fan to ur blog..pls dont stop..

శోభ said...

గిరీష్‌గారూ మీ అభిమానానికి ధన్యవాదాలండీ.. నేను ఎక్కడికీ పోలేదు. ఉన్నాను. కాస్త బిజీగా ఉండి ఏమీ రాయలేకపోతున్నానంతే. తప్పకుండా త్వరలోనే రాస్తాను.. Once again Thank You Very Much Girishgaaru...

గిరీష్ said...

Thank You.. :)