Pages

Tuesday, 15 March 2011

తమ్ముడా.. మోహన కుమారా..!!



పైలోకాలకు తరలిన తమ్ముడా
నువ్వెళ్లిపోయి నా తమ్ముడిని
కాదు కాదు నీ మిత్రుడిని
నీ సంతోషాలనే కాకుండా
నీ దుఃఖాన్నీ పంచుకున్న
మావాడికి ప్రాణబిక్ష పెట్టి
నువ్వెళ్లిపోయి…
నీ స్నేహానికీ, మాకూ…
ప్రాణం పోశావా..?


నా బిడ్డతో పాటు ఆ బిడ్డను కూడా
చల్లంగ చూడలేదు ఎందుకమ్మా అంటూ
గంగమ్మ తల్లితో మొరపెట్టుకుంటున్న
అమ్మతో.. కుమార్ అంతమంచోడా
అని అడిగితే…


వాడు కూడా నీ తమ్ముల్లాంటోడే తల్లీ
ఎంత మంచి రూపు, ఎంత మంచి మాట
నీ తమ్ముడూ.. ఆ కుమారూ…
ఒకే కంచంలో తినేవాళ్లు
ఒకే మంచంలో పడుకునేవాళ్లు
అంత మంచి నేస్తాలను
అంత మంచి బిడ్డను
తాను ఎక్కడా చూడలేదని
అమ్మ రోదిస్తూ చెబుతుంటే…


ఎప్పుడో చూసిన నీ రూపాన్ని
ఒకచోట పేర్చి చూసేందుకు
ఎంత ప్రయత్నించినా కుదరలేదు
అదెలా కుదురుతుంది చెప్పు…
నా ఎదురుగా తమ్ముడి రూపంలో
సజీవంగా నువ్వు కనిపిస్తుంటే…


(మార్చి 22, 2009న జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయిన మా పెద్ద తమ్ముడి ప్రాణ స్నేహితుడు కుమార్‌కు అశ్రునివాళులతో… వద్దంటే వినకుండా ముందు కూర్చుని బండి నడుపుతున్న కుమార్.. తన తప్పేమీ లేకుండానే జీపు వాడు గుద్దేయటంతో, వెనుక కూర్చున్న నా తమ్ముడికి ప్రాణబిక్ష పెట్టి తానేమో కానరాని దూరాలకు వెళ్లిపోయాడు.)

5 comments:

గిరీష్ said...

may his soul rest in peace..

మనసు పలికే said...

So Sad..:(
కుమార్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను..

శోభ said...

గిరీష్‌గారూ, అపర్ణా మీ సహానుభూతికి ధన్యవాదాలు...

అందరం కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయులం. ప్రేమ వివాహం చేసుకున్న కుమార్‌కు ఒక బాబు. ఆ అమ్మాయి మూడో నెల గర్భంతో ఉండగా ఈ ప్రమాదం జరిగటంతో విధిలేని పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకుని పుట్టింట్లో ఉంది. మళ్లీ పెళ్లి చేసేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ అమ్మాయి ఒప్పుకోవటం లేదు. కుమార్‌ని అంతగా ప్రేమించిందామె....

గిరీష్ said...

naku telisi ameku amega inko pelli chesukodu..thats love..kani abortion entandi..ala ela champestaru :(. bartani teliyakunda pogottukunte, kodukuni/kuturni telisi.. sorry

శోభ said...

:( ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకుందో.. ఇష్టం ఉండి చేసిందో, ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయించారో తెలియదు.. ఈ విషయంలో నాకూ మాటలు రావటం లేదు గిరీష్‌గారూ...