ఏమయ్యింది మనకు
పెంచుకున్న ఆశలు
అల్లుకున్న అనుబంధాలు
ఊసులు, భాషలూ
గాల్లో కట్టిన మేడల్లాగే
అవి కూడా ఇంతేనా…!
అప్పట్లో నీ సాహచర్యం
రోజు రోజుకీ ప్రకాశవంతమై
ప్రేమ, నవ్వులు, శ్రద్ధ
అభిమానం, అనురాగం
ఇలా చెప్పుకుంటూపోతే
దినదిన ప్రవర్థమానమే..!
నా వద్ద సంతోషాలెన్నీ ఉన్నా
అవన్నీ నువ్విచ్చినవే కదా…!
కమ్మటి కలలు ఎన్ని కన్నా
అవన్నీ నీ వల్లనే కదా….!
నేను అమితంగా ఇష్టపడే
ఒక్కగానొక్క అపురూప నేస్తానివి...
ఎప్పటికీ వడలిపోని
అరుదైన విరజాజి పువ్వువి..!
మరలాంటిది ఏమయ్యింది మనకు..?
ఏ నిశిరాతిరి నిద్దురలో
మబ్బుతెరలు కమ్మేశాయో.. ఏమో
వెలుగు రేఖలు విచ్చుకునేలోపే
జరగాల్సినదంతా జరిగిపోయింది
మనసులు తేలికై
దూరాలు దగ్గరై
నవ్వుల పువ్వులు
నిండు దోసిళ్లలో
కొలువయ్యేదెప్పుడో…!!
పెంచుకున్న ఆశలు
అల్లుకున్న అనుబంధాలు
ఊసులు, భాషలూ
గాల్లో కట్టిన మేడల్లాగే
అవి కూడా ఇంతేనా…!
అప్పట్లో నీ సాహచర్యం
రోజు రోజుకీ ప్రకాశవంతమై
ప్రేమ, నవ్వులు, శ్రద్ధ
అభిమానం, అనురాగం
ఇలా చెప్పుకుంటూపోతే
దినదిన ప్రవర్థమానమే..!
నా వద్ద సంతోషాలెన్నీ ఉన్నా
అవన్నీ నువ్విచ్చినవే కదా…!
కమ్మటి కలలు ఎన్ని కన్నా
అవన్నీ నీ వల్లనే కదా….!
నేను అమితంగా ఇష్టపడే
ఒక్కగానొక్క అపురూప నేస్తానివి...
ఎప్పటికీ వడలిపోని
అరుదైన విరజాజి పువ్వువి..!
మరలాంటిది ఏమయ్యింది మనకు..?
ఏ నిశిరాతిరి నిద్దురలో
మబ్బుతెరలు కమ్మేశాయో.. ఏమో
వెలుగు రేఖలు విచ్చుకునేలోపే
జరగాల్సినదంతా జరిగిపోయింది
మనసులు తేలికై
దూరాలు దగ్గరై
నవ్వుల పువ్వులు
నిండు దోసిళ్లలో
కొలువయ్యేదెప్పుడో…!!
8 comments:
gud one...
జ్ఞాపకాలు బాగున్నాయి
ముగింపు ఏదైనా కొత్తదనం ఆశించవచ్చా
very nice....and heart touching
nice.. :)
జాన్‌హైడ్‌గారూ ధన్యవాదాలు సర్..కొత్తదనం ఏమీలేదండీ..
చిన్న చిన్న అలకలు, కోపాలు సముదాయింపులు, అల్లర్లు, కలసిపోవడాలు..... చిన్న చిన్న సంతోషాలు... ఇవన్నీ ఉంటేనే కదా జీవితం.. ఈ ముగింపు కూడా పాజిటివ్‌గానే ఉంటుంది..
శశిగారు, మానసగారు థాంక్యూ వెరీమచ్...
True, it happens to every relationship...
ధన్యవాదాలు గిరీష్‌గారు..
Post a Comment