అమ్మ గుర్తొస్తే...ఒకటే ఆకలికడుపు నింపుకునేందుకు కాదుగుండె నింపుకునేందుకు........
నాన్న గుర్తొస్తే...ఆకలే ఆకలికడుపునిండా కాదుకళ్ల నిండా.......లేని నాన్నను వెతుకుతూనా కళ్లకు ఒకటే ఆకలి.....
అమ్మ ప్రేమతో గుండె నింపుకోవచ్చుకానీ...ఎప్పటికీ తిరిగిరాని నాన్న ప్రేమ.....???అందుకే నా కళ్ల ఆకలి తీరదు
ఎందుకు తల్లీ పస్తులుంటావ్ఇలాగైతే ఎలా అంటూ.. నాన్నఎప్పుడైనా కల్లో కనిపించి ఊరడిస్తేనా ఆకలంతా మటుమాయంకానీ... ఆ కల మాయమవగానేనాన్న కోసం నా కళ్ల ఆకలిమళ్లీ మొదలు..............
20 comments:
very moving kanna very sensitive.....love j
Thank You Very Much Amma.....
entha nijamu.....entho bagundi
నాన్న బలం ... నాన్న దైర్యం ... నాన్న నీ పక్కన జీవిస్తూ నిన్ను పదిలంగా నడిపించే దైవం ...
తల్లీ కూతుళ్ళ ప్రేమలో స్వార్ధం చూడగలమేమో కాని నిస్వార్ధి నాన్న ... కన్నతండ్రిని నిజంగా నిజరూపంలో చూడగలిగిన శోభమ్మ ధన్యురాలు!
ఫ్యామిలీ గారు... ధన్యవాదాలు.
వేములపల్లి వారు ధన్యవాదాలు...
very touchy
చాలా బాగా రాసారు...
Thank You Very much Keerthanagaaru..
నిజంగానే గుండె బరువెక్కింది..శొభ గారు..Thanks for sharing!
Sudheer
శోభక్కా చాలా బాగుందక్కా...
అమ్మ గ్ల్లాసునిండా పాలని తెచ్చిస్తే...
హడావుడిలోమ్ సగమ్ తాగి ... గ్లాసుని అక్కడే గూట్లో పెట్టి వెలితే....
నాన్న, అంటాడూ...." వీడికి క్రమశిక్షణే లేదు ... తాగి, గ్లాసు అక్కడా పెట్టేది?.. "
అమ్మ, అంటుంది .... " అయ్యో, వీడు పాలు సగమే తాగి వెళ్ళాడే?... "
ఇద్దరికీ నాకోసం ఇంకా ఏదో చేయాలని , ఏదో అందించాలని నిరంతర తపన ... ఓకరికి పోషణ నియ్యాలని ... ఒకరికి శిక్షణ నియ్యాలని...
పరమాత్మ తలిదండ్రుల రూపంలో మన మధ్యే ఉన్నందుకు సర్వదా ధన్యవాదాలు !
very touching and kind lines Madam...thanks for sharing...
@ వర్మగారు ధన్యవాదాలు...
@ సత్యా.. నువ్వు చెప్పే ప్రతిమాటలోనూ లోతైన అర్థం ఉంటుంది. నా పోస్టు నచ్చినందుకు బోలెడన్ని థాంకులు...
Nice...touching one.
@ సుధీర్ గారికి, పద్మార్పిత గారికి... ధన్యవాదాలు
చాలా బాగుంది కారుణ్య గారు..
Thank you Girish gaaru..
Awesome ,చాలా బాగా రాసారు...
ధన్యవాదాలు వినయ్..
Awesome madam... chaala baaga HEART touching mam...
థాంక్యూ పవన్
Post a Comment