బుల్లి బుల్లి చేతులతో
ముట్టుకుంటే మాసిపోయేంతలా
అచ్చం దేవకన్యలా
దూదిలాంటి మెత్తనైన మేనుతో
మెరిసిపోతున్న బుజ్జాయిని
సంభ్రమాశ్చర్యాలతో
మునివేళ్లతో స్పృశించాడతను...
అమాయకమైన బోసి నవ్వులతో
కళ్లల్లో ఒకింత మెరుపుతో
బొద్దుగా, ముద్దుగా ఉన్న ఆ చిన్నారి చేయి
తన వేలును గట్టిగా పట్టుకోగానే
మురిసిపోతూ గుండెలకు హత్తుకున్నాడతను
ఇక అప్పటినుంచి...
ఆ బుజ్జాయే ఆతని లోకం
ఆ బుజ్జాయి ఆవాసం ఆతని గుండెలపైనే
ఆ చిన్ని తల్లి నవ్వితే తానూ నవ్వాడు
ఏడ్చితే తానూ ఏడ్చాడు
అలా తన గుండెలపైనే పెరిగి పెద్దయిన
చిట్టితల్లిని వదలి వుండాలనే
ఊహ వస్తేనే విలవిలలాడిపోతాడతను
తనని వదలి వెళ్లాలంటే ఆమెదీ అదే స్థితి...
కానీ...
కాలం వారిద్దరికంటే గొప్పది
అనుకున్నట్లుగా అన్నీ జరిగిపోతే ఇంకేం..
ఒకానొక ఘడియన.....
ఈ ఇద్దర్నీ దూరం చేసేసింది
అప్పుడప్పుడూ కలుస్తున్నా
మానసికంగా అందనంత దూరం....
నువ్వు మారిపోయావు
ముందుట్లా లేవు
చిట్టితల్లి ప్రశ్నిస్తుంటే...
లేదమ్మా నేను మారలేదనీ
చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఓవైపు...
మీ ప్రేమంతా మీ సోదరి సంతానానికేనా
మరి మా సంగతేంటంటూ...?
తన సగభాగమూ నిలదీస్తుంటే
ఎవరికి ఏమి తక్కువ చేసాడో తేల్చుకోలేక
అటూ, ఇటూ, ఎటూ సర్దిచెప్పలేక మరోవైపు
ఆతని అవస్థ వర్ణనాతీతం........
కాలం ఆటల్ని అలా సాగనిస్తే....
"ప్రేమ" అనే మాటకు విలువేముంది
కాలం ఏర్పర్చిన సంకెళ్లను, హద్దుల్ని
చేధించిన "ప్రేమే" ఆ ఇద్దర్నీ మళ్లీ కలిపింది
ఆ ఇద్దర్నే కాదు.. అందర్నీ కలిపింది
మరెప్పటికీ విడిపోనంతగా
"అనుబంధం" గెలిచింది
గాలిపటం
11 hours ago
11 comments:
ప్రేమ ని మరోసారి అందంగా నిర్వచించెప్రయత్నం చేశారు కారుణ్యా.....సారీ...శోభా! ప్రేమని అపార్ధం చేసుకునే వాళ్ళందరికీ మీ ఈకవిత ఓ కనువిప్పు. కథ సుఖాంతం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
అక్క చాల ఉన్నతంగా ఉంది ఈ భావన.మనసుకి హత్తుకుంది.అభినందనలతో...
వాసుదేవ్ గారికి, శైలూకి ధన్యవాదాలు...
My comment missed
emi raasonaa gurtuledu
any way nice poem
best wishes
జాన్ గారు ధన్యవాదాలు సర్...
అనుబంధం ఎంత కాదన్నా అనురాగ బంధమే
కనీ అనుబంధమెంత గొప్పదైనా నిర్బంధం కాకూడదు ....ఇది ఓ అవ్యక్త భావన పరంపర ...అభివ్యక్తి అర్ధవంతంగా ఉంది ....కొంచం ఇంకా స్పస్తత కావాలనిపించింది ఏమీ నులోకమ్మ శోభ...ఇలా అన్నానని...ప్రేమతో...జగతి
ఆర్ద్రత,ఆప్యాయత అనురాగం అన్నీ కలిపి ఎంత చక్కగా చెప్పావమ్మా....చాలా బాగుంది
ఇందులో అనుకోవడానికి ఏముందమ్మా... మీరు ఫీల్ అయినదాన్నే చెప్పారు.. నాక్కూడా అలాగే అనిపించింది. నిజానికి వాళ్లిద్దరూ విడిపోయారు అనేచోటే ఆపేయాలని అనుకున్నాను. కానీ..విడిపోయినవారు ఎప్పటికీ కలవకుండా ఉండరు కదా, అందుకే ముగింపు ఇచ్చాను. మీ సూచనల్ని అమూల్యమైనవిగా భావించి, సంతోషంగా ఆహ్వానిస్తానేగానీ, ఏమీ అనుకోను.. మరిన్ని, సలహాలను, సూచనలను మీ నుంచి కోరుకుంటున్నానమ్మా...
Thanks a lot Uday Annyya... :)
శోభ గారూ, నమస్తే. మీ కవిత చదువుతుంటే నా కళ్ల ముందు ఓ బుల్లి పాపాయి సాక్షాత్కరించింది...చాలా బాగా రాశారు....అభినందనలు అందుకోండి...గాయత్రి
గాయత్రిగారు నమస్తే.. మీ అభినందనలు అందుకునేశానండీ... :)
నా కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు అందుకోండి మరి...
Post a Comment