నా కల
తిరిగిరాని బాల్యం కోసం
అమ్మమ్మ చెప్పే కథల కోసం
తాతయ్య తెచ్చే మిఠాయిల కోసం
పంట కాలువల్లో… యేటినీళ్ళలో
అమ్మ కొంగుతో చేపల్ని పట్టేందుకోసం
తమ్ముళ్లతో చేసిన అల్లరి కోసం
నాన్న చెంపపై ఇచ్చిన గుర్తుల కోసం
అదే చెంపపై ఇచ్చిన ముద్దుల కోసం
అమ్మ ముఖంలో నవ్వు కోసం
నా కల
తుపాకులు లేని రాజ్యం కోసం
యాసిడ్ దాడుల్లేని రోజు కోసం
నిజమైన రాజకీయాల కోసం
ప్రశాంతంగా బ్రతికే జనాల కోసం
ఎళ్లవేళలా పరితపించే శాంతి కోసం
నా కల
స్వార్థం లేని మనుషుల కోసం
కల్మషం లేని నవ్వుల కోసం
ఎల్లలు లేని సంతోషం కోసం
బతుకంతా పెనవేసే స్నేహం కోసం
చివరిదాకా అంటిపెట్టుకునే ప్రేమ కోసం
నా కలలు
వెచ్చనివే… కానీ తడిగా ఉంటాయి
ఊహలే… కానీ సృజనాత్మకమైనవి
జ్ఞాపకాలే… కానీ ఉల్లాసాన్నిస్తాయి
సాధారణమైనవే… కానీ ఆలోచింపజేస్తాయి
11 comments:
అందమైన కలలు...'కల నిజమాయెగా కోరిక తీరిగా' అని పాడుకునే రోజు ఎప్పుడొస్తు౦దో?
Chala bavunnay me kalalu :)
అక్క మీ కలలు చాలా బావున్నాయి.
Excellent.. specially first two lines of last paragraph...
చాల బాగా వ్రాసారు.మీ కల తప్పక నిజం కావాలి.
మీకొసమె కాదు మన అందరి కొసం...
జ్యోతిర్మయిగారూ... మీరన్నది నిజమే "కల నిజమాయెగా కోరిక తీరిగా" అని పాడుకునే రోజులు త్వరలోనే వస్తే బాగుండు... :)
వల్లి గారు ధన్యవాదాలండీ
శైలూ.. నా కలలు బాగున్నాయి కదూ... ఇవి నావే కాదు మనందరివీ... అన్నట్టు నీవు కనే కలలే నీ అక్షరాలు కదూ... ఎంత చక్కటి భావన... సూపర్బ్..
రాజేష్ మారం గారు నా కవిత మీకు నచ్చినందుకు సో మెనీ మెనీ థ్యాంక్స్....
శశికళగారు... మనందరి కోసం నా కలలన్నీ తప్పకుండా సఫలం కావాలని ఆశిస్తున్నా.....
good one..
Post a Comment