Pages

Thursday 5 January 2012

మత్తు నీకు... మాకు నువ్వు... ఎవరికెవరు..???


మా కోసం ఆకలినే కాదు
కష్టాలను, కన్నీళ్లను
అవమానాలను, అన్యాయాలను
దౌర్జన్యాలను, దాష్టీకాలను
అన్నింటినీ...
పంటి బిగువున భరించావు

నువ్వు తిన్నా, తినకున్నా
మాకోసం దాచి మరీ తెచ్చావు
చంద్రుడు గోళ్ళలో తల్లికోసం తీసుకొస్తే
నువ్వు మాకోసం చేతుల్నిండా తెచ్చావు

తల్లి దీవెనలతో చంద్రుడు
లోకమంతటికీ చల్లదనాన్నిస్తే..
నీ దీవెనలతో
మా జీవితాల్లో వెలుగునింపావు

పేదరికపు జీవితం
నీకులాగే మాకూ వద్దని
కట్టెలమ్మావు
పువ్వులమ్మావు
పెద్ద చదువులు చదివించావు

మా కోసం ఇన్ని చేసిన నువ్వు
కష్టాలను మర్చిపోయేందుకు
మత్తుకెందుకు బానిసయ్యావు..?

మా కోసం ఎన్నింటినో
తృణప్రాయంగా వదులుకున్నావు
నిన్ను క్షణక్షణానికీ తినేస్తున్న
ఆ మహమ్మారిని మాత్రం వదలలేకపోయావే..!

ఒకప్పుడు నువ్వు వదలలేని
ఆ మహమ్మారి...
ఇప్పుడు నిన్ను వదలనంటోందే...!
అది నీకు చేసిన మంచేంటోగానీ,
నువ్వు మాత్రం నీ శరీరంలోని
ప్రతి రక్తపు బొట్టునూ అర్పించేశావు
మత్తు నీకు కావాలి
మాకు నువ్వు కావాలి

నీ కోసం యాచిస్తున్న మాకోసం
ఇకనైనా మారవా...?!
నువ్వు మా ముందే ఉండాలన్న
ఆశను మన్నించవా..?
ఇకనైనా మారవా...???

5 comments:

Shloka Sastry( శ్లోకా శాస్త్రి ) said...

nijam akka...
ee matthu chtthu lo yenno jeevithaalu agadhamlo kottumittaduthunai...

prathi okka padam manasunna prathi manishini kadilisthundi...

ee kavitha choosaka ye okka thandri aina, manishaina aina marakunda undaledu

chalaaa bagundhi

శోభ said...

ధన్యవాదాలు శ్లోకా....

Unknown said...

బావుంది అక్క...sloke cheppindi nijjam

SATTAR SAHEB said...

ఆహా మేడం
మీ పదాల అల్లికకు...
మల్లికలు... మీ పాదాలకు
ఇలాంటి
గుళికల మాలికలు (దండలు అని నా మీనింగ్)
కావాలి తరతరాలకు.....

సత్తార్
ది హన్స్ ఇండియా

శోభ said...

Thanks a lot Sailu and Sattar gaaru...