బాగా చిన్నప్పుడనుకుంటా
ఏదో కావాలని మారాం చేసేస్తుంటే
ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడాయన
అయినా వింటేగా..
అంతే.. లాగి చెంపపై ఒకటిచ్చుకున్నాడు
ఎప్పుడూ భుజంపై ఎక్కించుకుని
ఊరంతా తిప్పుతుండే ఆ వ్యక్తికి
ఆ రోజునుంచీ మనసు మనసులో లేదు
రాత్రీ పగలూ ఒకటే ఏడుపు
ఆ పసిదానిపైనా నా ప్రతాపం
తనలో తాను తిట్టుకోని, గొణుక్కోని రోజులేదు
ముద్ద ముడితే ఒట్టు
తనను ఎత్తుకుని ఆడించే ఆ మనిషి
ఇలా కొడతాడని ఊహించని ఆ పసిమనసు
చెంపమీద వేళ్లగుర్తులు అచ్చుగుద్దినట్టు
ఆ రోజునుంచీ అతడి దగ్గరికెళితే ఒట్టు
మామూలుగా అయితే...
చూడగానే మీదికెక్కే ఆ పసిది
ఆ మనిషిని చూస్తేనే జడుసుకునేది
వారిద్దరి సయోధ్యకు చాన్నాళ్లే పట్టింది
ఓ రోజున జాగ్రత్తగా దగ్గరికి తీసుకుని
తినేందుకు ఒడినిండా కొనిచ్చి
ముద్దులాడుతూ క్షమించమన్నాడు
ఏమనుకుందో ఏమో
క్షమించేసింది, ఇకపై ఇలా చేయకని
ముద్దుతో మరీ వార్నింగ్ ఇచ్చేసింది...
తాత మనవరాళ్ల ఫైటింగ్ ఇలా సమాప్తం.....
మళ్లీ చాన్నాళ్ల తరువాత
ఎందుకోగానీ అదే చెంపపై
మళ్లీ వేళ్ల గుర్తులు అచ్చుగుద్దినట్లు
అయితే ఈసారి తాతవి కావు, నాన్నవి...
ఆ పసిది ఇప్పుడు యుక్తవయసు అమ్మాయి
చిన్నప్పుడు తాతపై ప్రకటించిన యుద్దమే
ఇప్పుడు నాన్నపై....
నాన్న పరిస్థితీ తాత పరిస్థితికంటే దారుణం
అయ్యో నా తల్లిని ఇలా కొట్టేశానేంటి
ఏడ్వని రోజు లేదు...
ముద్ద ముడితే ఒట్టు...
అర్థం చేసుకుందో ఏమో
తాతలాగే నాన్ననీ ముద్దుతో క్షమించలేదు
మౌనంగా, కళ్లతో క్షమించేసింది
అదే పెళ్లై అత్తారింటికెళ్లాక...
రోజూ చెంపపై
మొగుడి ప్రేమ ముద్రలు
కాదు కాదు
చేతి వేళ్ల ముద్రలను
మౌనంగా భరించటం నేర్చుకుంది
అయినా ఎంతకాలం అలా...?
చిన్న దెబ్బకే అల్లాడిపోయిన
తాత, తండ్రుల్లాగా
ఇక్కడ ప్రేమ పంచడానికి
బుజ్జగించడానికి ఎవరూ
లేరన్న సత్యం మెల్లిగా బోధపడిందే ఏమో
మానసిక, శారీరక గాయాలకు
మందు ఇక్కడ లేదనుకుందో ఏమో
ఓ రోజు పుట్టిల్లు చేరుకుంది
బ్రతికినంతకాలం నీ కూతురుగా
ఇక్కడే ఉంటా...
ఇంత తిండి పెట్టండి చాలని
బ్రతిమాలింది ఆ తండ్రిని
కన్నీటి వరదై కరిగిపోయాడా తండ్రి
కానీ... లోకం నోటికి భయపడి
చావైనా, బ్రతుకైనా కట్టుకున్నోడితోనే
ఇక్కడొద్దని బయల్దేరదీశాడు
మెట్టినింట్లో కూతురిని అప్పజెపుతూ
అల్లుడి మాటలు నమ్మి
ఆమెకు బుద్ధిమాటలు చెప్పాడు
బంగారు తల్లిని బలి ఇస్తున్నాడని
ఆయనకు తెలియదాయె..
చావైనా, బ్రతుకైనా ఇక్కడేనా
మరి బ్రతుకుతూ చావటమెందుకైతే
అందుకే ఓరోజున ఆమె నావ తీరం చేరింది
తాత, తండ్రులపై గర్జించిన ప్రేమ మేఘం
చివరికలా వర్షించింది....
(ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో సామాన్యగారు రాసిన "మహిత" కథ చదివాక (నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలూ కాసిన్ని గుర్తుకురాగా) బాధను ఎలా వ్యక్తపరచాలో తెలీక ఇలా...!!)
21 comments:
chalaa ardrangaa undammaa sobhaa .... kanneellochchaay ....prematho ...jagati
Baagundi... baagundi..
బాగుంది.. తెలుపలేని.. తెలియరాని..నిరసన కూడా ప్రేమలో భాగంగా వర్షింప చేసావ్...బాగుంది శోభా..
ఆర్తిని అద్భుతంగా ఆవిష్కరించారు.
తెలియని ఆవేదన మబ్బులా కమ్ముకుందండీ:( చాలా ఆర్ధ్రతతో వ్రాసారు..
@ ధాత్రి అమ్మా,
@ లాహిరి (శ్రీనివాసరావు) గారూ,
@ సాయి పద్మ మూర్తి అక్కా,
@ పద్మార్పితగారూ,
@ కిరణ్‌గారూ,
@ సుభగారూ.. మీ అందరికీ కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
పుట్టింట్లో ఎంతో గారాబంగా చూసుకునే తల్లిదండ్రులు.. మెట్టినింట్లో కూతుళ్లు ఎన్ని కష్టాలు పడినాసరే ఓర్చుకుని, సర్దుకుపొమ్మంటారే తప్ప, అత్తింటిని వదిలి పుట్టింటికి చేరుకుంటానని ఏ కూతురు అడిగినా ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉండరు.
పరువు మర్యాదలకు, లోకం నోటికి భయపడి ఎంతోమంది తమ బంగారుతల్లుల్లి బలి ఇచ్చుకుంటున్నారు. ఇదంతా తల్చుకుంటే భరించలేనంత బాధగా ఉంటుంది. ఈ బాధకే ప్రతిరూపమే ఈ కవిత. కవిత భావాన్ని ఫీల్ అయినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.
tirigi raanidi chinnatanam. ante kaadu, talli tandri mana allari ivvanni memories that last for ever. oka permanent treasure, prema meghamlane kaadu tanavaari talchukunte vechhati kanneerula kooda varshinchachu ani nirupincharu. thank q
ధన్యవాదాలు మాధవ్‌గారు..
ప్చ్.....
చాలా బావుంది అక్క!
Thanks a lot parimalamgaaru and sailu..
బావుంది శోభా..ప్రేమలో మరోకోణాన్ని ఆవిష్కరించారు. మానవసంబంధాలలో నష్టపోయేది స్త్రీయే ఎక్కవ. ఎఅయ్ససునుండైనా. ఇది మీ కవితలో ప్రస్ఫుటం
ప్రేమ మేఘం వర్షించిందిలా..! బాగుంది అనే కన్నా అనుబందాల నరాల్ని లాగినట్లనిపించింది. మాటలు రాని బాధ పెనవేసినట్లయ్యింది! సమయాబావం వల్ల ఎక్కువగా స్పందించలేకపోతున్నాను! చాలా గొప్పగా రాసావు. శుభోదయం శోభా..!
- Chandrasekhar Vemulapally
chala bagundhi... thatha, thandri la yokka premanuragala viluvalanu teliyachestu ade vidanga at the same time e roju oka illalu mettininti lo face chestuna jivana poratam gurinchi chala adbuthanga varnincharu and oka kuturiki pelli chesina taruvatha kontha mandi thandru lu samajam chatuna brathaka leka gunde kothanu anubavistunaru ani suvivaranga varnincharu.......
- Banuka Sainath
శ్రీనివాస్ వాసుదేవ్ గారికి,
వేములపల్లి వారికి,
బానుక సాయినాథ్ కి మనఃపూర్వక ధన్యవాదాలు..
ఓహ్, సూపర్ గా రాసావు శోభా!
prema meghalu varshinchatam emo gani inkonchem leenamaithe maa kanti meghalu varshistayemo.
@chvgupta గారు కవితలోని భావాన్ని ఫీల్ అయినందుకు ధన్యవాదాలండీ.
శోభా! గుండెను గుప్పిట పట్టి నలిపేసావు కదరా... నాన్న తాతల అనురాగపు ముద్రలు భర్తనే మృగం చేతిలో అసహాయపు చితుకులై అతివ బ్రతుకును నుసి చేసేస్తాయి...అక్కడ ముద్దుతోనూ,కంటి చూపుతోనూ మన్నించిన అమ్మాయి వేళ్ళ గుర్తులు మోసుకుంటూ భర్తనబడేవాడి కాళ్ళు పట్టుకుని మన్నింపులడగాలి...ఎంత దైన్యం...ఎంత హేయం...ఓ అతివా!! ఎక్కడమ్మా నీదైన భవిత!!!
ఏతా వాతా చెప్పేదేంటంటే యే విషయమైనా గుండెకెక్కాలంటే నీ భావాల్లోంచి ఇలా జారిపడాలి...అదన్నమాట అమ్మాయ్ మేటరు...ఇక దబ్బకం మానేసి రాస్తూండు....
పద్మక్కా.. మీ అభిమానానికి కృతజ్ఞతలు..
బద్ధకం వదిలేసి తప్పక రాసేందుకు ప్రయత్నిస్తాను... ఈ కవిత మీరు చూసే ఉంటారు అనుకున్నా.. పోన్లేండి ఇన్నాళ్లకు అయినా చూసారు. మీరు ఎప్పుడు చదివినా నాకు ఆనందమే... థ్యాంక్యూ అక్కా.. :-)
ఏంటో బిడ్డ కష్టాలు పడుతుందని కన్నీరు పెడుతూనే జీవితాంతం ఆ బాధల్లోనే వదిలేస్తారెందుకో...బిడ్డతోపాటే ఏడుస్తూ..
Post a Comment