Pages

Monday, 10 September 2012

జ్ఞాపకాల జడివాన జోరు తగ్గేదెలా.....!!



నా మది గదిలోనూ
ఇంటిగది బయటా
భోరున, జోరున ఒకటే వాన
జ్ఞాపకాల వాన
చినుకులుగా మొదలై.. జడివానై
అంతకంతకూ పెరిగిపోతూ
మదిగదిని ఉక్కిరిబిక్కిరిచేస్తూ
వరదలా ముంచెత్తుతోంది

పసితనపు వాన...
ఇంటి బయట చూరుకింద
ధారలు కట్టిన కాలువల్లో
అమాయకత్వపు పడవలు
హైలెస్సా అంటూ సాగుతుంటే
అల్లరి ఆనందాల కేరింతల వాన...

చినుకు చినుకు చిత్రంగా
అరచేతిలో నాట్యం చేస్తూ
అంతలోనే వేళ్ల సందుల్లోంచి
సుతారంగా జారుతుంటే
సందడిచేసే సంగీతపు వాన...

చూపులు, చేతులు కలిసి
ఒకటి రెండో భుజానికి ఆసరాగా
ఇరు మనసుల కలబోతలో
అంతేలేని మాటల జల్లులై కురిసేవేళ
ముసిముసి నవ్వుల ప్రేమవాన...

ప్రేమబంధం మాంగల్య బంధమై
మరుజన్మ ఎత్తితే
ఏకాంతపు లోగిలిలో
అనురాగపు ఆనందాల వెల్లువలో
సిగ్గుల మొగ్గ సింధూరపు వాన...

ముద్దు ముద్దు మాటలు
మురిపాల మూటలై
అమ్మానాన్నలని చేసిన
బుడి బుడి అడుగుల చప్పుడు
చిటపట చినుకుల నాట్యమైనప్పుడు
గుండెనిండా వాత్సల్యపు వాన...

రెక్కలొచ్చి ఎగురనేర్చి
గూడును, కన్నవారినొదిలి
కాలమనే కారుమబ్బులై
తుఫానులా తీరం చేర్చితే
జీవితపు మలిసంధ్య వాన...

మది గదిలో వాన...
చినుకులుగా మొదలై...
జడివానై, తుఫానై అలా తీరం చేర్చింది
వాన వెలసిన ఆకాశం స్వచ్ఛంగా
ఇంధ్రధనుస్సు వెలుగుల్ని విరజిమ్ముతోంది...

18 comments:

Unknown said...

very nice sobha garu

Yohanth said...

Nice feel

dhaathri said...

chalaa ardrangaa undamma sobhaa ....love j

సుభ/subha said...

భలే ఉన్నాయండీ వానలు..హరివిల్లుల రంగుల్లా..

శోభ said...

"చినుకు చినుకు చిత్రంగా
అరచేతిలో నాట్యం చేస్తూ
అంతలోనే వేళ్ల సందుల్లోంచి
సుతారంగా జారుతుంటే
సందడిచేసే సంగీతపు వాన..." Oh! వాన గురించి ఎవరు ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా రాసిన అదెప్పుడూ ఫ్రెష్షే ...ఫ్రెష్ గా కురుస్తున్న వర్షంలా...ఈ వాక్యాలు హత్తుకున్నాయి శోభాజీ...!!

- Srinivas Vasudev

శోభ said...

మది గదిలో వాన... / చినుకులుగా మొదలై...
జడివానై, తుఫానై అలా తీరం చేర్చింది / వాన వెలసిన ఆకాశం స్వచ్ఛంగా
ఇంధ్రధనుస్సు వెలుగుల్ని విరజిమ్ముతోంది...>>>>>> వాన సూర్యకాంతి ఏక కాల ప్రత్యక్షంలొ మనసుదోచే ఇంద్ర ధనుస్సు ఎంతో హృద్యంగమం కద!....

- Kapila Ramkumar

శోభ said...

నా మది గదిలోనూ
ఇంటిగది బయటా
భోరున, జోరున ఒకటే వాన
జ్ఞాపకాల వాన
చినుకులుగా మొదలై.. జడివానై
అంతకంతకూ పెరిగిపోతూ
మదిగదిని ఉక్కిరిబిక్కిరిచేస్తూ
వరదలా ముంచెత్తుతోంది....చక్కటి వర్ణన

- Bahudoorapu Baatasaari

శోభ said...

పసితనపు వాన...
ఇంటి బయట చూరుకింద
ధారలు కట్టిన కాలువల్లో
అమాయకత్వపు పడవలు
హైలెస్సా అంటూ సాగుతుంటే
అల్లరి ఆనందాల కేరింతల వాన../////Beautiful..fantastic.stupendous..!!!!!!!

- Kavi Yakoob

శోభ said...

its gud.. siggula mogga sindurapu vana ane line chala bagundhi...

last nunchi second poem kuda chala bagundhi padala vaduka kuda superrrrrrrrrrr

- Banuka Sainath

జాన్‌హైడ్ కనుమూరి said...

my work on vaana still pending may be for ur poem only

plz send the text on mail

శోభ said...

@ రమేష్‌ గారు,

@ యోహంత్ గారు,

@ ధాత్రి అమ్మా,

@ సుభ గారూ,

@ శ్రీనివాస్ వాసుదేవ్ గారూ,

@ కపిల రాంకుమార్ గారూ,

@ బహుదూరపు బాటసారి గారూ,

@ కవి యాకూబ్ గారూ,

@ జాన్ హైడ్ కనుమూరి గారూ... కవిత మీ అందరికీ నచ్చినందుకు మీకివే ధన్యవాదాలు..!

శోభ said...

@ బానుక సాయినాథ్‌... నీక్కూడా ధన్యవాదాలు...

శ్రీ said...

chaalaa baagundi shobha gaaroo!
baagaa vraasaaru...
@sri

కెక్యూబ్ వర్మ said...

వాటి జోరు తగ్గేది మట్టిలో కలిసేకే కదా శోభ గారూ...చాలా ఆర్థ్రంగా వుంది...

శోభ said...

శ్రీ గారికి, వర్మగారికి మనఃపూర్వక ధన్యవాదాలు..

Unknown said...

చాలా చాలా బాగున్నాయి

శోభ said...

ధన్యవాదాలు కాంత్ గారు

జోషి said...

మీ జ్ణాపకాల జడివానలో నేను తడసి ముద్దయ్యాను.
చాలా చాలా బాగా రాశారు