పెద్దసైజు గోళీకాయల్లాంటి
కళ్లను అలా ఇలా తిప్పుతూ
జ్ఞాపకాల లోకానికి తీసుకెళ్తూ
నిన్ను నువ్వు మర్చి
నవ్వుతున్నావా, పలవరిస్తున్నావా
తెలీని నీ స్థితిని చూస్తే..
స్వచ్ఛమైన సెలయేరు
పరవళ్లు తొక్కుతున్నట్లనిపించేది
యేటి చెలిమలా, నీ జ్ఞాపకాల చెలిమలో
ఎన్నెన్ని తీపి ఊసులో, అనుభూతులో......
బాల్యం వాకిట్లో నువ్వు తచ్చాడుతుంటే
పసితనాన్నై పలుకరించా
మధురోహల యవ్వన విహారానికెళ్తే
సిగ్గులమొగ్గనై చిలిపిగా నవ్వా
మొగ్గలోనే చితికిన తొలిప్రేమ
కన్నీరై ప్రవహిస్తుంటే
ఓదార్పు ఆనకట్టనయ్యా...
తీపి ఊసులన్నీ ఉక్కిరిబిక్కిరిచేస్తే
ఆనందమై అక్కున చేర్చుకున్నా
జ్ఞాపకాల చెలిమ భారంగా నిండితే
ఒరిగిపోకుండా ఒంపుగా పట్టుకున్నా...
మనసు గాయాలు మళ్లీ రేపుతుంటే
మందునై మాన్పుతూ వచ్చా
కల్లోలపరిచే కాలం చీకట్టు కమ్ముకుంటే
వెలుగు దివ్యనై కాంతిని పంచా...
జీవితం ప్రతిదశలోనూ...
నీ వెంట నీడనై.. నేనే నువ్వై సాగుతుంటే
ఓ రోజున హఠాత్తుగా... నువ్వడిగిన ప్రశ్న....
"నువ్వెవరు అని"......?
పెద్ద చిక్కుప్రశ్నే వేశావు
అవును నేనెవర్ని....?
నేనెవర్నో, నీకు ఏమవుతానో...
పూర్తిగా మర్చిపోయా...
అంతా నువ్వే అయిన మనఃస్థితిలో
నన్ను నేనే మర్చిపోయిన దీనస్థితి అది
ఇంతకీ నేనెవర్ని...?
నువ్వు మాత్రం నేను కాను
నేను మాత్రం ముమ్మాటికీ నువ్వే....!
నేనున్నంతదాకా... నా ఊపిరి ఆగేంతదాకా.....!!
7 comments:
sobha garu chalaa chaalaa baagundi
wow who is that?:)nice one
chaalaa bagundamma sobhaa hrudi kadilinchelaa undi love j
@ జలతారు వెన్నెలగారికి,
@ ది ట్రీ గారికి,
@ రమేష్ గారికి,
@ సృజన గారికి,
@ ధాత్రి అమ్మకి.... కవితను నచ్చిన, మెచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు..
కవితకి ప్రాణంపొసే థీమ్ సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని నిలబెట్టే బాష కూడా బాగా కలిసొచ్చింది శోభా గారూ
ధన్యవాదాలు వాసుదేవ్‌గారు..
అంతా నువ్వే అయిన మనస్ధితిలో....
.... చాలా చాలా బాగుంది శోభగారు
Post a Comment