Pages

Monday 24 December 2012

"ప్రియబాంధవి" శైలూకి... "ఆత్మబంధువు"కి...


నిన్న పుట్టినరోజు జరుపుకున్న "నాన్న" ప్రియపుత్రిక, మా చిన్నారి చెల్లాయి, "వెన్నెల్లో గోదావరి" రచయిత్రి కల్లూరి శైలబాలకి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...



అతి తక్కువ కాలంలోనే మా జీవితంలో భాగమైపోయిన ఓ "ఆత్మబంధువు", నేను ప్రేమగా పిలుచుకునే "పరి"కి ప్రేమపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు...



మీరు ఇద్దరూ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... హ్యాపీ హ్యాపీ బర్త్ డే...

ఇన్నాళ్లూ డిసెంబర్ 23, 24 చాలా సాధారణంగా గడిచిపోయేది. కానీ ఇప్పుడలా కాదు.. ప్రియమైన ఈ ఇద్దరు ఆప్తులు పుట్టినరోజులు ఈ తేదీలలోనే రావటం వల్ల ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజుల్లా అవి మారిపోయాయి...


నెట్‌కి అందుబాటులో లేని కారణంగా నిన్ననే పోస్ట్ చేయాల్సిన ఈ శుభాకాంక్షలు ఓ రోజు ఆలస్యంగా ఇలా పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఓ రోజు ఆలస్యమైనా సరే బ్లాగ్ మిత్రులందరూ.. మీ అభినందనలను, ఆశీస్సులను ఈ చిన్నారులకు (పెద్దవాళ్లే అయినా నా మనసులో వీళ్లు చిన్నారులే) అందించాలని కోరుకుంటున్నాను... అందిస్తారు కదూ..?!

మా ఇద్దరు చిన్నారులతోపాటు.. నిన్న, ఇవ్వాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న అందరికీ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. 



2 comments:

Unknown said...

అక్క ! థాంక్స్ చెప్పాలని లేదు కాని మీ ప్రేమకి మనసు మూగబోయింది .
మీ ప్రేమని , ఆప్యాయతని పదిలంగా కాపాడుకుంటాను.
మీకు నెట్ సహకరించకపోవడం వలన కరెక్ట్ డేట్ కి బ్లాగ్ లో పోస్ట్ చేసారు . నా పుట్టిన రోజు 23 కాదు డిసెంబర్ 24 న...
మారోసారి మీకు థాంక్స్ చెప్తూ ...

శోభ said...

ధన్యవాదాలు శైలూ..

గత సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలను నా బ్లాగులో పోస్ట్ చేశాను. ఆ పోస్టులో నీ పుట్టిన రోజు 24న అని నువ్వూ చెప్పలేదు.. నేనూ అడగలేదు.సో.. నాకు 23 అనే బాగా గుర్తుండిపోయింది.

ఎందుకైనా మంచిదని మళ్లీ బ్లాగు పోస్టును కూడా చెక్ చేశాను. డిసెంబర్ 23నే పోస్ట్ చేసినట్లుగా ఉంది. అలాగే నీ పుట్టిన రోజు గురించి ఫేస్‌బుక్‌లో గీతగారు గత సంవత్సరం పోస్ట్ చేసింది చూడటం, అప్పటికప్పుడు నీకు విషెష్ బ్లాగు ద్వారా అందించిన సంగతి కూడా గుర్తు వచ్చింది. అందుకనే 23కు ఫిక్సైపోయి అలా చెప్పాను.

పోనీలే.. ఇప్పటికైనా కరెక్ట్ డేట్ తెలిసింది కదా.. ఇకపై డిసెంబర్ 24 శైలూ చెల్లాయి పుట్టినరోజు అని గుర్తుంచుకుంటాను.. :)