తనువంతా నెర్రెలతో
తడిలేని గొంతుకతో
తడబడే మాటలతో
నిట్టూర్పు ఆవిర్లతో
జాలిలేని మేఘాల్ని
శపించలేని అశక్తతతో
నీటిబొట్టుకోసం తపించే "నేలమ్మ"లా...
అసహనపు నిట్టూర్పుతో
బాధ్యతల బరువుతో
నిగ్రహపు నిరసనలతో
ఆగ్రహపు ఆక్రందనతో
పలవరిస్తున్న "మనసమ్మ"ని
ఊరడించమంటూ......
ఘనీభవించిన దుఃఖ మేఘాల్ని
ఒడిసి పట్టుకున్న నయనాల్ని
ఎంత వేడుకున్నా...
జాలిలేని ఆ మేఘాలకు మల్లే
ఎంతకీ వర్షించేవేం...?
ఛిద్రమైన బ్రతుకు ఆశల్ని గుదిగుచ్చి
జీవితపు గుడ్డకు అతుకులేస్తూ
జ్ఞాపకాల కొలిమిలో కాలి కాలి
రాటుదేలిన నిజానివై
నిబ్బరంగా సాగిపోవాలేగానీ
బేల అవకు మిత్రమా...?
కన్నీళ్లే కత్తులై ప్రశ్నిస్తుంటే...
ఇక కన్నీళ్లకి చోటెక్కడ
జీవన సమరంలో సిపాయినై
అలుపెరుగని సమరానికి
సై అనటం తప్ప...!!!
13 comments:
Nice.. Chaalaa baagundi.
మీకు నచ్చినందుకు సంతోషం వనజగారు...
నైస్ శోభా....
చాలా బాగా రాసావక్కా... really inspirable words...
-satya
ఓ చిన్న మానసిక కుదింపుకి.. అక్షరరూపం ఇది సత్యా... థ్యాంక్యూ
కుదింపు కాదు... కుదుపు అని అనబోయి అచ్చు తప్పు పడింది... :(
entha bavundoooo..!!!!
really beautiful wording
అక్షరరూపం ఇది థ్యాంక్యూ
బాగా రాసారు శోభ గారు
నచ్చిన మెచ్చిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు
ఘనీభవించిన దుఃఖమేఘాల్ని ఒడిసిపట్టుకున్న నయనాలు ఎంతవేడుకున్నా... ఎంతకీ వర్షించవే...
సూపర్ అసలు
అంతరాత్మ అనుభవాలకు అక్షరరూపం మీ ఈ సాహిత్యం శోభా గారు
Post a Comment