అవి... నేను ఇంటిపట్టునే ఉంటోన్న రోజులు... అయితే మిగతా రోజుల్లో ఉండరా ఏంటీ? అని అడగకండి. అంటే నేను ఏ ఉద్యోగమూ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నానండి అంతే...!!
అబ్బా...! ప్రారంభంలోనే విషయం పక్కదారి పడుతోందే..? పోన్లేండీ... అదలా వదిలేద్దాం.. ఇందాక చెప్పినట్లు నేను ఇంటిపట్టునే ఉంటోన్న రోజుల్లో టీవీ అంటే మహా పిచ్చి. అలాంటిలాంటి పిచ్చి కాదండి బాబూ... ఏ ఒక్క సీరియల్ (భాషా భేదాలు నాకసలే లేవు సుమా.. మరీ సీరియల్స్ విషయంలో...)ను కూడా వదలకుండా చూసేదాన్ని.
ఎంత పక్కా ప్రణాళికతో ఉండేదాన్నంటే... టీవీ సీరియల్స్ టైమింగ్స్‌ను బట్టి ఆయా పనులకు సమయాన్ని కేటాయించుకునేదాన్ని. చాలా బాగా నచ్చిన, మనసుకు హత్తుకునేలా ఉండే సీరియల్స్‌ను కళ్ళప్పగించి మరీ చూసేస్తుంటాన్లేండి. అలాంటి సమయంలో ఏ పనీ ముట్టుకునేది లేదు. కాస్త ఫర్వాలేదు అనుకునే సీరియల్స్ వచ్చేటప్పుడు మాత్రం వాటిని చూస్తూ మిగతా పనులు చేసుకునేదాన్ని.
ఆహా... ఈరోజు చూడకపోయినా ఫర్వాలేదు అనుకునే సీరియల్స్ టైమింగ్స్‌లో మాత్రం బయటపనులు చూసుకునేదాన్ని. కొన్ని ఛానెల్స్‌లో శని, ఆదివారాలు సీరియల్స్ తక్కువగా వచ్చే సమయంలో వారం మొత్తంలో చేయకుండా అట్టిపెట్టిన పనులను ముగించేయడం అలవాటుగా మారిపోయింది.
ఇంతకూ విషయానికి రాకుండా నా టీవీ సీరియల్స్ సోది చెప్పేస్తున్నాను. మీకు సోదిలాగా ఉందేమోగానీండి. నాకు మాత్రం రోజూ అలాగే గడిచిపోయేది మరి. మా ఆయన ఆఫీసుకు వెళ్ళి, మళ్ళీ తిరిగి వచ్చేదాకా నాకు అవే నేస్తాలు కాబట్టి వాటిమీద నాకు చాలా ప్రేమ (ఒక్కోసారి మా ఆయన్ని కూడా పట్టించుకోనంత) సుమా..!!
వందల ఎపిసోడ్లయినా ఆగని టీవీ సీరియల్స్ లాగే... రోజులలా గడుస్తున్నాయి. ఒకరోజు నాకిష్టమైన "చక్రవాకం" సీరియల్ వస్తోంది. అందులో ప్రధాన పాత్ర "ఇక్బాల్" చనిపోయే సన్నివేశం వస్తోంది. ఆ సీరియల్‌లో ఇష్టమైన ఆ పాత్ర చనిపోతుంటే ఓ వైపు గుండె తరుక్కుపోతోంది. కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి. కళ్ళముందు టీవీ కూడా కనిపించలేనంతగా ఏడ్చేస్తున్నాను.
అంతగా ఏడుస్తున్నా... ఏదో మర్చిపోయానే అనుకుంటూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే, టీవీ ముందు నుంచి మాత్రం కట్టుకదలలేదండి. అమ్మతోడు. ఇంతలో ఏదో మాడుతున్న కమురు వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి.
అయ్యో...! అంటూ ఒక్క పరుగున చేతిలో రిమోట్ ఏమాత్రం వదలకుండా మరీ... కిచెన్‌లోకి (గుర్తొచ్చేసింది లెండి) పరుగెత్తాను. చూస్తే ఏముందీ... స్టవ్ పైన పాలుపెట్టి మరిచిపోయాను. అవి పొంగిపోతున్నాయి. స్టవ్‌ను ఆపేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. సాధ్యం కావటం లేదు. పాలేమో పొంగిపోతున్నాయి.
అబ్బా... ఎంతసేపు సాగదీస్తారు. ఏముంది స్టవ్‌ను ఆపేసేందుకు కుదరటం లేదా...? స్టవ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్‌ను కుడివైపుకు తిప్పేస్తే సరిపోదా..! అంటారేమో...? అక్కడే ఉందండీ తిరకాసంతా...! నేను స్టవ్‌ను ఆపేసేందుకు కుస్తీలు పడుతున్నాను. ఓ వైపు టీవీలో సీరియల్ కాస్తా అయిపోతోంది. ఒకటే టెన్షన్. పాలు ఇంకా పొంగుతూనే ఉన్నాయి.
ఇదిగో ఇదేం బాగాలేదు.. ఇంతకీ ఏం చేశారో చెబుతారా.. లేదా..? అంటూ అలా కోపంగా చూడకండే... చెప్పేస్తున్నాను. టీవీ రిమోట్‌తో నేను స్టవ్‌ను ఆపడానికి ప్రయత్నిస్తున్నానండి. ఎంతసేపు రెడ్ బటన్ నొక్కినా స్టవ్ ఆగడం లేదు. ఆ క్షణంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. తిట్టుకుంటూ ఏమయ్యింది ఈ స్టవ్‌కు అనుకుంటూ రిమోట్ బటన్‌ను విపరీతంగా నొక్కేస్తున్నాను. పాలు పొంగి పొంగి స్టవ్ కాస్తా ఆగిపోయింది. హమ్మయ్య ఇప్పటికైనా ఈ రిమోట్ పనిచేసింది అనుకుని గ్యాస్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసి మళ్ళీ "చక్రవాకం"లో లీనమయ్యాను.
సీరియల్‌లో ఇక్బాల్ చనిపోతాడా... లేదా...? అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.. తరువాయి రేపు చూడండంటూ సీరియల్ ఆరోజుకు అయిపోయింది. మళ్ళీ ఇంకో సీరియల్ వచ్చే గ్యాప్‌లో కిచెన్లోకి రాగానే ఇందాకటి పాలు పొంగిన విషయం గుర్తుకొచ్చింది. ఊరికే పాకెట్ పాలు పోయాయి. రేపు పెరుగుకు ఏంచేయాలబ్బా... అనుకుంటూ స్టవ్ ఆపేందుకు నేను చేసిన ప్రయత్నం, స్టవ్ ఆరిపోయిన వైనం అన్నీ లీలగా మెదిలాయి.
అంతే ఇంట్లో ఒక్కదాన్నే పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడం మొదలెట్టాను. ఎంత సీరియల్ పిచ్చైతే మాత్రం అంతలా ఇదైపోవాలా? ఇంత చోద్యం ఎక్కడైనా జరిగుంటుందా...? "గ్యాస్‌స్టౌవ్‌ను టీవీ రిమోట్‌తో ఆపటమా..." నా తింగరిపనికి నాకే పట్టరాని కోపం, ఆ తరువాత తెరలు తెరలుగా నవ్వు దోబూచులాడాయి.
ఆ రాత్రి మా ఆయన ఇంటికి రాగానే జరిగిన తంతునంతా వివరించి చెప్పేసరికి... విన్నంతసేపు విని నావైపు అదోలా చూసి పడి పడి నవ్వారు. అయినా నీకు బుర్ర అనేది ఉంటేగా...? ఆ టీవీ సీరియల్స్ అన్నీ ఈ పాటికి నీ బుర్రని కొంచెం కొంచెంగా తినేస్తున్నాయి. ఆ సీరియల్స్ చూసే నీకు ఆపాటి తెలివితేటలు ఉంటాయిలే...! అంటూ నవ్వుతూనే ఉన్నారు. నేను లోలోపల నవ్వుకుంటూనే బయటికి మాత్రం ఉడుక్కుంటూ మా ఆయనవైపు గుర్రుగా చూస్తుండిపోయాను.
ఆ తరువాత మా ఇంటికి తెలిసినవారు, బంధువులు, స్నేహితులు ఎవరొచ్చినా సరే... మా ఆయన మాత్రం నేను చేసిన తింగరిపనిని పొగిడి పొగిడి మరీ చెప్పేవారు. అప్పట్లో తానలా చెబుతుంటే నాకు చాలా కోపం వచ్చేది. అయితే ఇప్పుడు కూడా ఆరోజు సంఘటన గుర్తొస్తే మాత్రం నవ్వాపుకోలేను....!!

9 comments:
హ్హ హ్హ హ్హ... హ్హి హ్హి హ్హి... Very Nice Experiance... :)
good one
ha ha. good one
హ హ హ సూపరండీ మీరసలు....ఎన్ని తెలివితేటలో! :D
హ హ బాగుంది :-)
నా టపా మీ అందరికీ నచ్చినందుకు ధన్యవాదాలు :)
అక్క! సూపర్ పోస్ట్.మీరు రిమోట్ తో పరిగెత్తినప్పుడే అనిపించింది ఇలాంటి పని ఏదో చేస్తారు అని
అనుభవం కదా నేను స్టవ్లు , ఫ్యాన్లు , లైట్ లు కూడా రిమోట్ తో ఆపాలని ట్రై చేస్తుంటా...
సూపర్ శైలూ.. నువ్వు నాకంటే గ్రేట్ అన్నమాట...... :) :) :)
Akka Meku నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Post a Comment