Pages

Wednesday, 9 January 2013

నేనిలా... ఎలా...?!!



వాడిపోయిన పువ్వులా
మూగబోయిన మురళిలా
వేకువరాని చీకటిలా
నువ్వు లేని నేనిలా... ఎలా..?

మనసు లేని రాయిలా
గుండె బొమ్మ ఉందెలా
ముసురుకమ్మిన మబ్బులా
నీ ప్రేమ లేని నేనిలా.. ఎలా..?

కంటి చెమ్మ ఊరడించి
బుగ్గల దోసిలి నింపితే
సందె కాంతి ఎరుపెక్కదా
నువ్వు రాని నేనిలా.. ఎలా..?

కంటి భాషకు కరుణించి
మనసు భాషను మన్నించి
చేతి భాషకు పులకించి
పరుగులెత్తావ్ నువ్విలా...
పరవశించాను ప్రేమలా...

ఉన్నాను.. నేనిలా..
నువ్వున్న నేనులా... ఇలా...!!!

10 comments:

David said...

చాల బాగుంది.

Unknown said...

very nice andi

వాసుదేవ్ said...

కొంచెం "లా" "లు" ఎక్కువైనా కవితాద్యంతమూ మురళీ రవం వినిపిస్తూనెఉంది...సున్నితమైన విరహాన్ని చిందించారు కవితాత్మకంగా...అభినందనలు

శోభ said...

@ డేవిడ్ గారూ

@ రమేష్ గారూ

@ వాసుదేవ్ గారూ...

కవిత మీ అందరికీ నచ్చినందుకు ధన్యవాదాలు..

వాసుదేవ్ గారూ.. మీ అభినందనలకు నమస్సులు...

David said...

శోభ గారు మీకు మీ కుటుంబానికి "సంక్రాంతి శుభాకాంక్షలు" ఈ సంక్రాంతి మీ జీవితంలో అనందం నింపాలని ఆశిస్తున్నాను.

శోభ said...

డేవిడ్ గారూ...

ధన్యవాదాలు సర్...

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక "సంక్రాంతి శుభాకాంక్షలు"...


ఈ పండుగ మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ.. మరోసారి ధన్యవాదాలు.. :)

శోభ said...

బ్లాగ్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి "శోభ" శుభాకాంక్షలు ... :)

జోషి said...

మనసుభాషను మన్నించే నువ్వుంటే నేను నేనులా ఇలా....

శోభ said...

నువ్వున్న నేనులా
ఇలా జోషీ 🙂😍❤️

Vijaya Ramireddy said...

'లా' ,'లు' , లు ఎక్కువవ్వడమే , ఈ భావ లాహిరికి లయ చేకూర్చాయి. లాహిరి లాహిరి లాహిరిలో అన్నట్లుగా ఆద్యంతమూ మీ కవితా లాహిరి సాగింది శోభా గారు. చాలా అద్భుతంగా వుంది.