మా ప్రేమ కుటీరం అంతా
నా మనసుకు మల్లే
ఖాళీ.. ఖాళీ.. ఖాళీ..
ఈసురోమని ఎంత తిరిగినా
కాళ్లకి భారమేగానీ...
మనసు భారం ఎంతకూ తగ్గదేం...?
నువ్వు వదిలేసి వెళ్లిన వాలుకుర్చీలా
నీ చేతిని వీడి ఒంటరిదైన నా వాల్జెడ
నువ్వు వదిలేసి వెళ్లిన ఊయల చప్పుడులా
తీపి గుర్తుల గుండె చప్పుడు
నువ్వు వదిలేసి వెళ్లిన రాత్రిలా
చిక్కటి చీకటి ఆవరించిన నా మనసు
నువ్వు వదిలేసి వెళ్లిన కలల్లా
కన్నుల్లో కన్నీటి సునామీల అలజడి
నువ్వు వదిలేసి వెళ్లిన నీ గుండెబొమ్మలా
కంటిచెమ్మ చిత్రించిన నీ "నా" రూపం
నువ్వు వదిలేసి వెళ్లిన అడుగుల్లా
ఒంటరి పక్షినై ఒడ్డుకు చేరిన వైనం
ఇన్ని గుర్తొస్తుంటే...
మనసు భారం.. తులాభారమై..
ఎద లయలో ఊగిసలాడుతుంటే
జ్ఞాపకాలు తులసీ దళాలై...
సేదదీర్చి.. "నిను నా" చెంత చేర్చేనా...!??
9 comments:
చాలా బాగుందండీ.
manchi feel undi akka indulo...
Thank You Priya and Shamili...... :)
ఖాళీ తనాన్ని కావ్యం చేసావు...
ఎదలోయల సవ్వడిని అక్షరబద్ధం చేసావు
జ్ఞాపకాలను అందరూ మల్లెలంటే నువ్ మాత్రం...
కృష్ణుని తూచిన తులసిదళం చేసావు
బంగారూ...ఏమని నిన్ను పొగడాలిరా
ఎన్నక్షరాలు వాక్కుబేరుల కడ అరువు తేవాలి?
అద్భుతంగా గుండె కోస్తోంది నీ ఒంటరివైనం....
నైస్ శోభ గారూ!...@శ్రీ
"ఎన్ని అక్షరాలు వాక్కుబేరుల కడ అరువు తేవాలి?" ఎంత చక్కగా మీ ఫీలింగ్స్ ని రాస్తారో Padma అక్కా...
నా కవిత కంటే మీ కామెంట్ సూపర్... Thank You...
ధన్యవాదాలు శ్రీ గారు
బాగుంది కారుణ్య గారు ...మీ టపా ..
ఒంటరితనాన్ని ఎంత చక్కగా అక్షరీకరించావో.....
Post a Comment