నీలో నేనుగా
నాలో నీవుగా మిగిలుందాం
ఒకే దేహపు గూడుగా
మూల మూలల్ని ప్రేమతో
నిక్షిప్తం చేసి
పరవళ్లెత్తి పరవశిద్దామని
నువ్ చేసిన బాసకి
లిపి ఏది...
లయ తప్పిన నా గుండె సడి తప్ప
నీకు నీవుగా
నాకు నేనుగా మిగిలున్న
దేహపు గూడుల
మూల మూలల్లోనూ
నిక్షిప్తమైన "ఇగో"లని
సంతృప్తిపరచలేక
కలిసి జీవించనూ లేక
ఎవరి దారి వారిదేనంటూ
నువ్ ఇచ్చిన తీర్పుకి
లిపి ఏది...
లయ తప్పిన నా గుండె సడి తప్ప
నాలో నేనుగా
నాకు నేనుగా మిగిలున్న
దేహపు గూడులో
మూల మూలల్లో
నిగూఢంగా నిక్షిప్తమై
నిత్యం నిద్రలేపే
వేనవేల భావాలకి
లిపీ లేదు, భాషా లేదు
లయ తప్పిన నా గుండె సడి తప్ప...!
నీకు నీవుగా
నాకు నేనుగా వద్దు
ఇద్దరం కలిసి ఉంటేనే ముద్దు
"ఇగో"లేం వద్దు.. అసలే "గోలా" వద్దు
నింపుకుందాం నమ్మకాన్ని
ఒడిసి పట్టుకుందాం ఆశల్ని
ఒలికిపోయిన జీవితానికి
కొత్త రంగుల శోభనద్ది
దాసోహమౌదాం ప్రేమకి
మరో జన్మ ఇద్దాం దేహాలకి
ఇలా.....
నా దేహపు గూడు
లోలోపల ఎగిసిపడే
ఆశల లావా ఎగజిమ్మితే
వర్ణించే లిపి ఏది...
లయ తప్పిన నా గుండె సడి తప్ప...!!
("ఇగో"ల మాయలోపడి అస్తవ్యస్త జీవితాలతో సతమతమవుతున్న వారందరి కోసం...)
11 comments:
Nice post andi baavundi kavita
లిపి లేకపోయినా మీలాంటి శిల్పి లభించినందులకు ఆ లయ తప్పిన గుండె సడి చేయక , సంతసించక ఉండగలదా మఱి ?
శర్మ జీ ఎస్
నా ఆలోచనల పరంపర
http://naalochanalaparampara.blogspot.in
ఆ ఫోటో లో అమ్మాయి చాలా బాగుంది.
రెండు మీరు ఈ కవితలో ఇచ్చిన సందేశం కూడా బాగుంది.
"ఇగో లు వద్దు, అసలే గోలే వద్దు" Nice!
బాగుందండి గుండె సడి. లిపి లేకపోయినా భావావేశం వున్నా మీలాంటి వారున్నారుగా విడమరచి వినిపించడానికి.
శుభాకాంక్షలు !!
@ మంజుగారు ధన్యవాదాలండీ
శర్మగారూ..
నా బ్లాగింటికి స్వాగతం.. సుస్వాగతం అండీ..
లిపి లేకపోయినా శిల్పి లభించినందుకు గుండె సడి చేస్తుందని, సంతోషిస్తుందని ఎంత బాగా చెప్పారు... మీ స్పందనకు ధన్యవాదాలండీ
వెన్నెలగారూ
ఫొటోలో అమ్మాయి మీకు బాగా నచ్చేసిందా.. నాక్కూడా ఆ అమ్మాయి బాగా నచ్చిందండీ..
కవితలో మెసేజ్ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
సాగర్ గారు నా బ్లాగింటికి మీ రాక సంతోషం సుమండీ...
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ.
చాలా బావుంది శోభ గారు :)
థ్యాంక్యూ ప్రియా
చాల బావుంది అక్క ...
Post a Comment