జాజిమల్లి గారి బ్లాగులో.... నా అక్షరాల్లో నేను...... :)
మొదటినుంచీ మనసుకి తోచినవి రాయటం అలవాటు. నచ్చినవి, నచ్చనివి.. స్పందింపజేసినవి.. ఆలోచింపజేసినవి.. బాధపెట్టినవి, భయపెట్టినవి, బాధ్యతల్ని నేర్పినవి ఇలా ఒకటేమిటి అన్నీ మనసు చెప్పిన కథలు, కథనాలే నా బ్లాగునిండా. ఎక్కువగా స్వానుభవాలే. మొదట్లో ఏం రాయాలన్నా ఇది బాగుండదేమో, ఎవరికీ నచ్చదేమో… ఇలా రాయకూడదేమో…… ఇలా ఎన్నో రకాల సందేహాలు.
చాలామందికిలా చిన్నప్పటినుంచి చందమామ సాహిత్యం చదువుతూ పెరగలేదు నేను. అస్సలు అదొక పత్రిక ఉందన్న సంగతి కూడా నా పెళ్లి అయిన రెండు మూడేళ్లదాకా కూడా తెలీదు. మీకు ముందే చెప్పాను కదండీ అమ్మా నాన్నలు నిరక్షరాస్యులు. ఓ పూట తింటే రెండు పూటలు పస్తులుండే పరిస్థితుల్లో నా చిన్ననాటి జీవనం సాగింది. ఇక్కడ పస్తులు అంటే అమ్మానాన్నలకేనండీ. మాకు మాత్రం మూడుపూటలా కడుపునిండేది.. మరి అమ్మానాన్నలంటే అంతే కదండీ.
అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని బడికి పంపటమే గొప్ప విషయం. పుస్తకాలు, బట్టల్లాంటి కనీస అవసరాల్ని తీర్చేందుకే నానా అగచాట్లు పడేవాళ్లు. నేను 8వ తరగతిలోకి వచ్చేదాకా ఇదే పరిస్థితి. తరువాత క్రమంగా మారటం మొదలైంది. ఉన్నంతలో కాస్త బాగా బ్రతికే పరిస్థితులు ఏర్పడ్డాయి. బాల సాహిత్యం లాంటివి ఉంటాయన్న సంగతి నాకు అస్సలు తెలీదు. దినపత్రిక, వార పత్రికల సంగతి ఇక సరేసరి. అయితే ఒక్కటి మాత్రం నిజం. పుస్తక రూపంలోని కథలు.. సాహిత్యం చదవకపోయినా… అద్భుతమైన బాల్యాన్ని అనుభవించాననే చెప్పవచ్చు. అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, తాతయ్యల ప్రేమ, లాలన… వాళ్ల ఒళ్లో పడుకుని, భుజాలపై వాలిపోయి మరీ లెక్కలేనని కథల్ని విన్న రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను.
ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో....
http://jajimalli.wordpress.com/2013/04/29/%E0%B0%A7%E0%B1%80%E0%B0%B0%E0%B0%97%E0%B1%81%E0%B0%A3-%E0%B0%B6%E0%B1%8B%E0%B0%AD/
12 comments:
mi title ki taggatte vundi mi interview Shobha garu chaalaa chakkagaa chepparu abhinandanalu
ధన్యవాదాలు మంజుగారు...
చాలా నిజాయితీగా, అందంగా ఉందండీ మీ పరిచయం. అభినందనలు.
థ్యాంక్యూ సో మచ్ శిశిరగారూ... :)
ఉండండి శొభ గారు, అక్కడ చదివేసి మళ్ళీ ఇటు వైపు వస్తాను!:)
అలాగేనండి వెన్నెలగారూ...
మీరు అక్కడ కూడా చదివేశారు... కామెంట్ కూడా పెట్టారు...
ధన్యవాదాలు... :)
ఇంటర్వ్యూ బాగుంది .
అభినందనలు శోభగారు ,
ధన్యవాదాలు మాల గారు...
Shobha garu
Vruttireethya nenu software engineer ni kanee inthavaraku naaku ila blogging ani okati untundhani andhulo intha chakkaga oka dairylaaga manasuki nachina prathi vishayam prapanchamtho panchukovachani naaku theliyadhu...online lo parichayam aina oka friend dvaara mee blog gurinchi thelisindhi....innellu facebook,messenger chats,novels you tube whatsapp idhey prapancham anukunnaa...kanee blogs roopam lo oka kotta prapanchanni avishkarimpacheyochani ippudey arthamayyindhi.....mee blog chusaaka nakkuda ilanti oka blog untey entha baguntundhi anipinchindhi...urukula parugula naa jeevithamlo adhi ye meraku neraveruthundho chudali.......
Meeru enno unnatha sikharalanu cherukovaalani manaspoorthiga akankshisthu
Abhinandhanalatho
Akash...
మీ అభిమానానికి ధన్యవాదాలు ఆకాశ్ గారూ..
నేటి సమాజం లో మీలాంటి ప్యూరిటీ కలిగిన వ్యక్తులను చూడడం చాలా అరుదు. వున్నది ఉన్నట్లు ఇంటర్వ్యూ లో చెప్పి. మీరు ఏంటో , మీ వ్యక్తిత్వం ఏంటో సమాజానికి తెలియజేసారు. నిజంగా మీరు ధీరగుణ శోభా నే . ... శోభా గారు
నేటి సమాజం లో మీలాంటి ప్యూరిటీ కలిగిన వ్యక్తులను చూడడం చాలా అరుదు. వున్నది ఉన్నట్లు ఇంటర్వ్యూ లో చెప్పి. మీరు ఏంటో , మీ వ్యక్తిత్వం ఏంటో సమాజానికి తెలియజేసారు. నిజంగా మీరు ధీరగుణ శోభా నే . ... శోభా గారు
Post a Comment