Pages

Thursday, 9 May 2013

అక్షర "అభిషేకం"....!



నువ్వెవరో నాకు తెలీనప్పుడు....

బాగానే ఉండేది. రోజులు ఎప్పట్లా వాటికవే దొర్లిపోతుండేవి

జీవితంలో ఏదో తెలీని వెలితి ఉంది అని అనుకోడానికేం లేదు

నాకేం బానే ఉన్నానుగా అనుకునేస్తూ.. ఎంచక్కా ధీమాగా గడిచిపోతుండేది.

ఓ మనిషి ఆనందంగా ఉండేందుకు ఏం కావాలో అన్నీ దొరుకుతున్నప్పుడు విచారానికి టైం ఎక్కడుంటుంది. అందుకే నాకేంటి అన్నీ ఉన్నాయిగా అదే ధీమా

రోజువారీ వ్యాపకాల్లో మునిగి తేలుతూ.. బంధాల బాధ్యతల్లో తలమునకలవుతూ.. తప్పనిసరి పెద్దరికాన్ని ముఖానికి తగిలించుకుని...

రోజు ఎలా గడిచిపోతోందో తెలీనంత బిజ్జీగా బిజ్జీగా జీవితం.... ఇంతకంటే ఇంకేం కావాలనే ధీమా......

ఓ రోజున అనుకోకుండా నువ్వొచ్చావు...

నువ్వొచ్చాక కూడా బాగానే ఉండేది.. అంతకుముందు ఎలానో అలానే ధీమాగా.....

నేను తగిలించుకున్న ధీమా... ఒట్టి గాంభీర్యమే అని అర్థం చేయించేందుకు నీకు చాలా కాలం పట్టలేదు

నా ధీమా వెనుక అసలు కథను ఒక్కోటిగా విడమర్చావు

ఇన్నాళ్లూ చీకట్లోనే ఉంటూ వెలుగులో ఉన్నాననుకుని భ్రమపడుతున్నావన్నావు

నిజమైన వెలుగును నే చూపిస్తా పదపదమన్నావు

ఇల్లు, కుటుంబం, బంధాలు, బాధ్యతలనే రెండు మూడు రంగులే లోకమంతా నిండిపోయానుకునే నాకు...

"సాహిత్య" మనే ఇంధ్రధనుస్సు రంగుల హరివిల్లును కళ్లముందు పరిచావు...

బావిలో కప్పలా ఉంటూ.. నా ప్రపంచం నిండుగా, హాయిగా ఉందనుకునే నా భ్రమను పటాపంచలు చేస్తూ......

నిజమైన ప్రపంచం ఇదే.. ఇటు చూడు అంటూ విశాల ప్రపంచంలోకి లాక్కొచ్చావు

"నిన్ను నీవు తెలుసుకో
నిన్ను నీవు ప్రేమించుకో
నిన్ను నీవు గౌరవించుకో
నిన్ను నీవు ఆదరించుకో
నిన్ను నీవు మార్చుకో
నిన్ను నీవు మలచుకో" మంటూ....

నన్ను నాకే కొత్తగా, సరికొత్తగా పరిచయం చేసిన

ఓ "సాహితీ" మిత్రమా...!
నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను
నా "అక్షరాలతో" నిన్ను అభిషేకిస్తూనే ఉంటాను


9 comments:

Unknown said...

నీ అభిషేకాలు అనవరతమవ్వాలని అక్షరాలు సైతం కోరుకునేంత బాగుంది శోభా..

శోభ said...

Thank You Akka.....

మీలాంటివారి ఆశీర్వాదాలు ఉన్నంతకాలం ఇలా సాగుతూనే.....

జయ said...

సాహితీ మిత్రమ తోడున్న వారికేమి లోటండి.ఎంతైనా తెలుసుకో గలరు... అంతా వారిదే.చాలా బాగుంది శోభ గారు.

శోభ said...

ధన్యవాదాలు జయగారు...

శోభ said...

Thank You Mastaaru....

Unknown said...

chala chala bhagundandi... :)

శోభ said...

థ్యాంక్యూ రా

Anonymous said...

మీ బ్లాగ్ తో బ్లాగ్ వరల్డ్ లో జాయినవ్వండి.విసృతమైన ప్రచారం మీ బ్లాగుకు కల్పించుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడండి.
http://ac-blogworld.blogspot.in/p/blog-page.html

Vijaya Ramireddy said...

"నిన్ను నీవు తెలుసుకో
నిన్ను నీవు ప్రేమించుకో
నిన్ను నీవు గౌరవించుకో
నిన్ను నీవు ఆదరించుకో
నిన్ను నీవు మార్చుకో
నిన్ను నీవు మలచుకో" మంటూ....

నన్ను నాకే కొత్తగా, సరికొత్తగా పరిచయం చేసిన

ఓ మిత్రమా...!
👌👌👌