పగలయితే క్షణాల్ని
రాత్రయితే నక్షత్రాల్నీ... లెక్కపెడుతూ
తనువంతా కళ్లతో
నీ కోసం చూస్తుంటానా
ఓ క్షణం మెరుపులా
అలా వచ్చి ఇలా మాయవుతుంటావు
అయినా
ఆ క్షణకాలపు నీ సాన్నిధ్యం
గుండె లోతుల్లోంచి వస్తోందా
అన్నట్టుండే నీ పిలుపూ
ఎంత బాగుంటాయో
అందుకే.....
క్షణకాలపు మెరుపువైనా
క్షణాలు యుగాల్ని సైతం లెక్క చేయకుండా
కళ్లలో వత్తులేసుకుని మరీ
నీ కోసం ఎదురు చూస్తుంటా...!!
9 comments:
ఎంత ప్రేమో....అందంగా చెప్పారు.
ఎంతబాగుందో.
థ్యాంక్యూ పద్మగారు
కవితను నచ్చినందుకు, మెచ్చినందుకు వందనాలు తెలుగమ్మాయిగారు....
ఇప్పుడే చదివాను మీ కవితని!చాలా చాలా బావుంది!చక్కని పద ప్రయోగం!ఇంత చక్కని భావాలు కవితలో మలచినందుకు అభినందనలు
కవిత భావం, పదాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు ఫణీంద్రరావు గారూ...
ఒక్క క్షణం ఆగు వస్తున్నా...
అద్భుతమైన భావ మంజరి. ప్రేమామృత భావన , నైస్ శోభా గారు
Post a Comment